Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణ… మాయదారి మల్లిగాడు కాదు… మంచి మనసున్న మల్లిగాడే…

June 24, 2024 by M S R

జీవితంలో ఎవరి నుండయినా సహాయం పొందినా , వారి సాయంతో అభివృద్ధిలోకి వచ్చినా వారి సహాయాన్ని మరవకూడదు . ముఖ్యంగా ఆ సహాయం చేసినవారు దెబ్బతిని ఉంటే , అసలు మరవకూడదు . చేతనయినంత సహాయం చేయగలగాలి . అలా సహాయం చేసే మనస్తత్వం కలవాడు కృష్ణ అని అందరికీ తెలిసిందే .

తనను హీరోగా మొదటి పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు చేతులు కాల్చుకుని , మళ్ళా నిలదొక్కుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న సమయంలో , కాల్ షీట్లు ఇచ్చి , కలర్ పిలిం ఇప్పించి , ఆర్థిక సహాయం చేసి కృష్ణ ఈ సినిమాలో నటించారు . ఇప్పటికీ ఇలాంటి మహానుభావులు మచ్చుకి అక్కడక్కడా ఉంటారు . వాళ్ళకు వంద దండాలు . మొహం తిప్పుకునే వారికి వెయ్యి దండాలు . ఆ చేతుల్నే నరికేసే వారికి కోటి దండాలు . ఇంక సినిమాలోకి వద్దాం .

1973 లో వచ్చిన ఈ మాయదారి మల్లిగాడు సినిమా బాగా ఉండటమే కాకుండా , ఓ సరికొత్త గెటప్పులో కనిపిస్తారు కృష్ణ . బొమ్మల లుంగీ , బనీను కనిపించే పల్చటి లాల్చీ , మెళ్ళో ఓ స్కార్ఫు అభిమానులకు బాగా నచ్చింది . కృష్ణకు జోడీగా మంజుల . బహుశా మెయిన్ హీరోయిన్ గా , కృష్ణ పక్కన హీరోయిన్ గా అమెకు ఇదే మొదటి సినిమా . ప్రధానంగా ఈ సినిమాలో చెప్పుకోవలసింది జయంతి . చక్కగా నటించింది . ఆవిడే షీరో . ఆ తర్వాత మెచ్చుకోవలసింది అంజలీదేవి నటన .

Ads

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం బ్రహ్మాండమైన హిట్ సాంగ్సుని ఇచ్చింది . నవ్వుతూ బతకాలిరా అనే పాట ఇప్పటికీ జనం నోట్లో నానుతూనే ఉంది . కొసరాజు వ్రాసారనుకుంటా . జైల్లో పాడే ఈ పాట బెంగళూరు సెంట్రల్ జైల్లో తీసినట్లుగా టైటిల్సులో పేర్కొన్నారు . ఆ తర్వాత అత్యంత శ్రావ్యమైన పాట ఆత్రేయ విరచిత మల్లె పందిరి నీడలోన జాబిల్లీ మంచమేసి ఉంచినాను జాబిల్లీ అనే పాట . తలకు నీళ్ళోసుకుని కురులారబెట్టుకుని , వస్తా వెళ్ళొస్తా పాటలు బాగుంటాయి .

నాగభూషణం , అంజలీదేవి , ప్రసన్నరాణి , పద్మనాభం , రాజబాబు , కాంతారావు , మాస్టర్ రాము , కె వి చలం ప్రభృతులు నటించారు . కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . నిర్మాతకు డబ్బులు కూడా వచ్చాయి . డైలాగ్ రైటర్ సత్యానంద్‌కూ ఇది తొలి సినిమా.

నేను ఈ సినిమాను మా నరసరావుపేటలో చూడలేదు . గుంటూరు విజయా టాకీసులో చూసా . ఈ థియేటర్ మా అక్కయ్య గారింటికి దగ్గరగా ఉండటం , థియేటర్ నిర్వహణ బాగా ఉండటం వలన ఈ థియేటర్లో చాలా సినిమాలే చూసా . ఈ థియేటర్లో పైన అటుఇటూ రెండు స్పెషల్ బాక్సులు ఉండేవి యంగ్ లవర్సుకి కన్వీనియంటుగా .

ఈమధ్యనే చూసా థియేటర్ పడేసారు . బహుశా ఏదయినా షాపింగ్ మాల్ వస్తుందేమో ! సినిమా యూట్యూబులో ఉంది . తప్పక చూడతగ్గ సినిమాయే . ముఖ్యంగా కృష్ణ అభిమానులకు బాగా నచ్చుతుంది . An entertaining , feel good , musical movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….. (By డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మెట్రో విస్తరణపై కేసీయార్ స్క్రిప్టు – రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కిషన్‌రెడ్డి కట్టెలు..!!
  • భలేవారే, యాంగ్రీ రాజశేఖర్‌ సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలూ చేయగలడు తెలుసా..!!
  • భారత్ భాగ్య విధాత … ఫ్లాప్ … కంగనాపై నెగెటివిటీ తగ్గలేదు ప్రేక్షకుల్లో …
  • వైభవ్..! ఈ పేరంటేనే ఓ సంచలనం..! నడిసంద్రంలో కూడా..!!
  • శాంతి ఒప్పందం- యుద్ధవిరమణ… నో, మూడు దేశాల దోబూచులాట…
  • దివాళా అంచున దేశం… ఆ దిక్కుతోచని సర్కారు ఏం చేసింది…
  • మన పెట్రో బిల్లును ఎథనాల్ తగ్గించగలదా..? ఏమేం ప్రయోజనాలు..?!
  • రాజా రమేష్… సినిమా కథగా ఓ నిజ జీవిత థ్రిల్లర్… కానీ..?
  • పునర్జన్మ… మీరు నమ్మరా… పోనీ, ఈ రియల్ స్టోరీ ఓసారి చదవండి…
  • ఆకలి కడుపులకు అన్నపూర్ణ..! నచ్చిన రేవంత్ మరో పథకం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions