ఎహె, మోడీకి వచ్చినవి ఆఫ్టరాల్ 6 శాతం వోట్లు అని కొన్ని వార్తలు కనిపించాయి… అరె, 36.56 శాతం కదా, ఇదేమిటి 6 శాతం అని రాసేస్తున్నారు ఏమిటా అని చూస్తే… అవి మొత్తం జనాభాలో బీజేపీకి పడిన వోట్ల శాతం అట…
వారెవ్వా… మోడీ మీద వ్యతిరేక వార్తలు రాయాలనుకుంటే రాయండి గానీ మరీ ఇలాంటి బాష్యాలు ఏమిటో అర్థం కాదు… మోడీలు వస్తుంటారు, పోతుంటారు… ఎవరూ శాశ్వతం కాదు, గెలుపోటములు కూడా వస్తుంటాయి, పోతుంటాయి… కానీ ఒక ప్రచారం మొదలు పెడితే జనం నవ్వుకుంటారు, జాగ్రత్తగా రాయాలనే సోయి ఉండాలి కదా అనిపించింది…
ఇప్పుడు చెప్పిన వార్తలో వివరాలు ఓసారి చెప్పుకోవాలంటే… దేశ జనాభా 142 కోట్లు, అందులో వోటర్లు 96 కోట్లు, మొన్నటి ఎన్నికల్లో పడిన వోట్లు 63 కోట్లు, మోడీకి (అంటే బీజేపీకి) వచ్చిన వోట్లు 23 కోట్లు, సో, పోలైన వోట్లలో 36 శాతం కానీ మొత్తం జనాభాలో ఆరు శాతమే… ఇదీ సారాంశం…
Ads
నవ్వొచ్చింది… తమ పాలకుడు ఎవరో మొత్తం జనాభా నిర్ణయించదు… పిల్లాపీచూ, వోట్లు వేయనివారు, వేయలేనివారు కాదు నిర్ణయించేది… మన ఎన్నికల సిస్టమ్ వేరు… పది మంది జనాభా, ఆరుగురు వోటర్లు, అయిదు వోట్లు పడితే… అందులో మూడు పడినవాడు విజేత, రెండు పడినవాడు పరాజితుడు… అంతే, సింపుల్ లెక్క… ఖచ్చితంగా 50 శాతం రావాలనేమీ ఉండదు… పడిన వోట్లలో మెజారిటీ… అది ఒక్క శాతమైనా సరే, ఒక్క వోటైనా సరే…
నిజానికి వోట్ల శాతం లెక్కలు కూడా కాదు… సీట్లు… ఎందుకంటే… మొన్నటి లోకసభ ఎన్నికల్లో జగన్‌కు బాబుకన్నా ఎక్కువ వోట్లు వచ్చాయి, కానీ సీట్లు తగ్గాయి… తమిళనాట డీఎంకే విజయఢంకా కదా, వాళ్లు వోట్లు టీడీపీకన్నా తక్కువ… ఇంతా చేస్తే బీజేపీకి 1.7 వరకూ తక్కువ వస్తే కాంగ్రెస్ కి పెరిగింది అంతే శాతం… వోట్ల కన్సాలిడేషన్, లభించే సీట్ల లెక్క కొన్నిసార్లు సంక్లిష్టం… సరే, అసలు విషయానికి వస్తే…
సరే, ఖచ్చితంగా మోడీకి గతంలోకన్నా ఆదరణ బాగా పడిపోయిందనేది నిజం… ఏ ఆత్మవిమర్శ చేసుకుంటారో, ఎలా సరిదిద్దుకుంటారో ఆ పార్టీ ఇష్టం… పోనీ, ఇప్పుడొస్తున్న ఆ జనాభా లెక్కల ప్రాతిపదికనే ఆలోచిద్దాం…
మోడీకి ఆరు శాతమే కదా వచ్చింది అనే తిక్క విశ్లేషణ కోణంలోనూ పరిశీలిస్తే… మరి రాహుల్ గాంధీకి వచ్చిన వోట్లు ఎన్ని..? జస్ట్, 3.47 శాతం..!! అందుకే నిన్న మోడీ పార్లమెంటులో ఎత్తిపొడిచింది… ఒరే, బాబూ, మీకు 100లో 99 రాలేదు భయ్, 543లో 99 మాత్రమే అని వెటకరించింది…
చివరగా… గతంలో ఎన్నడూ లేనంతగా ఇండి కూటమి పేరిట వోట్ల చీలికను గణనీయంగా తగ్గించగలిగారు… మొత్తం కూటమిగా ఎక్కువ సీట్లు పొందారు… టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలే కదా ఆ కూటమిలో అసలు బలం… ఆ కూటమిలో నానా విభేదాలు… సో, మోడీకి ఆరు శాతం వోట్లు అనే విచిత్ర విశ్లేషణ గురించి చెప్పడమే ఈ కథన ఉద్దేశం…!!
Share this Article