‘‘నా కెరీర్‌లోనే చెత్త ఎంపిక ఆ పాత్ర’’ అని నయనతార చెప్పింది ఎక్కడో… ఇంకేం..? భలే వార్త చెప్పావ్ నయన్ అంటూ అందరూ చకచకా రాసేసుకున్నారు… ఇంతకీ ఆమె చెప్పింది ఏ పాత్ర గురించో తెలుసా..? గజిని సినిమాలో తను పోషించిన పాత్ర గురించి…
‘‘షూటింగుకు ముందు నాకు చెప్పింది ఒకటి, తరువాత తీసింది మరొకటి’’ అనీ ఆరోపించింది… డయానా మరియం కురియన్ అసలు పేరున్న ఈమె ఓ మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి, మొదట్లో మోడల్‌గా చేసేది… 2003లో ఏదో సినిమాతో ఎంట్రీ… మలయాళీ సినిమాలు చేసేది మొదట్లో…
తరువాత 2004, 2005లో ఆమెకు చంద్రముఖి, గజిని అవకాశాలు వచ్చాయి… అప్పట్లో ఆమెకు చాన్సులు రావడమే ఎక్కువ… ఇప్పుడంటే హయ్యెస్ట్ పెయిడ్ సూపర్ ఫిమేల్ స్టార్… అప్పుడు ఏదొస్తే అది అంగీకరించడమే తప్ప ఆమెకు వేరే మార్గమూ లేదు… ప్చ్, నా కెరీర్ మొత్తంలో నేను అంగీకరించిన చెత్తా పాత్ర అదే అని ఇప్పుడు వాపోతుంది గానీ… అలాంటి సినిమాల్లో చాన్స్ రావడమే బంగారం అనుకుని మురిసిన రోజులవి ఆమెకు…
Ads
నిజానికి ఆమె ఇప్పుడు చెబుతోంది గానీ… చంద్రముఖిలో అసలు హీరోయిన్ జ్యోతిక అని తెలియదా ఆమెకు… కాకపోతే రజినీకాంత్ సినిమాలో చాన్స్, అదీ తన ప్రియురాలిగా పాత్ర రావడమే గొప్ప అనుకుంది అప్పట్లో… అలాగే మురుగదాస్ సినిమాలో చాన్స్ దొరకడమే అపురూపం అనుకుంది గానీ గజిని సినిమాలో అసలు హీరోయిన్ ఆసిన్ అని తెలియదా తనకు..?
అందరూ ఇప్పుడు ఆమెను నిందిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు… నీ కెరీర్ మొత్తమ్మీద నీకు పేరు తెచ్చినవే చంద్రముఖి, గజిని… వాటిని తూలనాడితే ఎలా అని..! కొంతమేరకు నిజమే… చంద్రముఖి సినిమా నిజానికి రజినీకాంత్, ప్రభు సినిమా కూడా కాదు… అది అచ్చంగా జ్యోతిక సినిమా… నయనతార చాలా పాత్రల్లో ఓ పాత్ర అంతే… అలాగే గజినిలో ఆసిన్ హైలైట్ అయ్యింది…
ఇంట్రవెల్ తరువాత సూర్య విజృంభిస్తాడు తప్ప ఫస్టాఫ్ అంతా ఆసిన్‌కు మరుపురాని పాత్ర… డాంబికాలు పోయే ఓ మంచి మనసున్న మహిళ పాత్ర తనది… తను ఏదయితే అబద్ధం చెబుతుందో, ఆ అబద్దమే నిజమనీ, తన ఎదుటకు అనామకంగా వచ్చి తననే ప్రేమిస్తోందని తెలియని ఓ చోటా మోడల్ పాత్ర… ఆ ఇద్దరి నడుమ సరదా సీన్లు ఆ సినిమా సక్సెస్‌కు కారణం… ఆసిన్ బాగా చేసింది కాబట్టే హిందీలో కూడా ఆమెకే దక్కింది ఆ పాత్ర… నయనతార పాత్రకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదు…
నిజానికి నయనతార చెత్త ఎంపిక అని నిందించాల్సిన పనేమీ లేదు… అప్పట్లో ఆమెకు అదే ఎక్కువ… ఆ తరువాత కూడా ఆమెకు పెద్ద పేరున్న మంచి పాత్రలేమీ రాలేదు కదా… 2010లో అదుర్స్, 2011లో శ్రీరామరాజ్యం సినిమాలు ఆమె ఇమేజీని పెంచి తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి… తమిళంలో స్టార్ హీరోెయిన్ అయ్యాక తెలుగులో తగ్గించింది గానీ ఆమెకు లైఫ్ ఇచ్చినవి తెలుగు సినిమాలే…
సో, ఫలానా పాత్ర చెత్త ఎంపిక అనే వ్యాఖ్య సరికాదు… అదీ ఇన్నేళ్ల తరువాత… నిజానికి ఆ గజిని పాత్రే రాకపోతే ఏమో… అక్కడే ఆగిపోయి, చివరకు మోడల్‌గానే ఉండిపోయేదేమో… ఎవరు చెప్పొచ్చారు..!!
Share this Article