మన దేశ జనాభా ఎంత..? ప్రస్తుతం 141 కోట్లు అని రఫ్ అంచనా… 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉండింది… కానీ కరోనా కారణంగా సాధ్యం కాలేదు… ప్రతి పదేళ్లకు తీస్తుంటారు… ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఓ దిక్కుమాలిన సర్వే గురించి… ఈ సర్వే పేరు The Sample Registration System (SRS) Statistical Report…
కేంద్ర ప్రభుత్వం నిర్వహించేదే… హోం శాఖ ఆధీనంలోని సెన్సస్ కమిషనర్ ఈ బాధ్యతల్ని చూస్తాడు… నిజానికి ఇది ఫర్టిలిటీ రేట్, మరణాల రేటు, సగటు ఆయుష్షు, బాల్యవివాహాలు వంటి అంశాల మీద సర్వే చేస్తుంది… మానవ జీవన నాణ్యత సూచికల పరంగా మనం ఎటువైపు అడుగులు వేస్తున్నామో సమీక్షించుకోవడానికి ఇలాంటివి అవసరమే…
వీళ్ల తాజా రిపోర్టులో ఓ అంశం ఓ ముతక సామెతను గుర్తుకు తెచ్చింది… దేశంలో సగం మందికి పెళ్లేకాలేదు అని తేల్చేసిందట… దాదాపు ప్రధాన మీడియా మొత్తం రిపోర్ట్ చేసింది… హాస్యాస్పదంగా ఉంది అని ఎందుకు చెబుతున్నాను అంటే… ముందుగా ఆ వార్తలోని ఓ బేసిక్ మెయిన్ పాయింట్ చదవండి…
Ads
67 కోట్ల మందికి పెళ్లిళ్లు కాలేదట… అందులో అన్నిరకాల వయస్సుల వాళ్లు ఉన్నారట… అంటే దేశం మొత్తం జనాభాలో సగం… ఇది ఎంత దిక్కుమాలిన ప్రాతిపదిక అంటే… దేశంలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 19 ఏళ్ల వరకు ఉన్న పిల్లల శాతం 40 శాతం… మరి సగం మందికి పెళ్లే కాలేదు అని ఓ ప్రభుత్వ సర్వే సంస్థ తేల్చేయడం నవ్వులాట గాక మరేమిటి..? ఇప్పుడు చదువులు, కొలువుల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నయ్… సరే, 20- 24 ఏళ్ల వయస్సున్న యువతను కూడా కలుపుదాం… అంటే మొత్తం 49.9 శాతం… అంటే సగం…
Structure of the population
Structure of the population (9 February 2011) (Census) age wise are shown below:
Age group | Male | Female | Total | Percentage (%) | Cumulative Percentage |
---|---|---|---|---|---|
0–4 | …. 58,632,074 | —— 54,174,704 | —–112,806,778 | ………… 9.32 | 9.32 |
5–9 | ….. 66,300,466 | —— 60,627,660 | ——126,928,126 | …….. 10.48 | 19.8 |
10–14 | ….. 69,418,835 | —- 63,290,377 | —–132,709,212 | ………10.96 | 30.76 |
15–19 | ….. 63,982,396 | —- 56,544,053 | —–120,526,449 | ………. 9.95 | 40.71 |
20–24 | ….. 57,584,693 | —- 53,839,529 | —–111,424,222 | ………. 9.20 | 49.91 |
మరి సగం మందికి పెళ్లేకాలేదు సుమీ అని పెద్ద అధికారిక కసరత్తు చేసి, తేల్చారట ఈ ఘనులు… నిజానికి ఇందులో ఆసక్తికరమైన పాయింట్ 4 కోట్ల మంది ఒంటరి బతుకులు గడుపుతున్నారు… ఒకరకంగా చూస్తే తక్కువే అనిపిస్తోంది… రీసెంటుగా పెరుగుతున్న విడాకులు, బ్రేకప్పుల సంఖ్యతో పోలిస్తే తక్కువే.., భర్తలు వదిలేసినవాళ్లు, భర్తలు మరణించిన మహిళలు, భార్యల్ని కోల్పోయిన భర్తలు ఎట్సెట్రా ఈ కేటగిరీ అన్నమాట… నిజానికి వీళ్లలో పేదవాళ్ల మీద ప్రభుత్వ పథకాల ఫోకస్ ఉండాలి… అందరికీ నగదు పంచే బటన్లు నొక్కుడు కాదు… తమిళనాడులో 8.8 శాతం ఒంటరి మహిళలున్నారనే అంకె ఆందోళనకరమే…
బీహార్ పల్లెల్లో 7.3 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి… కేరళలో సహజంగానే జీవనప్రమాణాల స్థాయి మిగతా రాష్ట్రాల్లోకన్నా ఎక్కువ… సంస్థాగత ప్రసవాలు, మాతాశిశు సంరక్షణ, కుటుంబనియంత్రణ, అక్షరాస్యత వంటి సూచికల్లో వాళ్లు నెంబర్ వన్… సహజంగానే ఆయుష్షు కూడా ఎక్కువ… అయితే అదేసమయంలో ముసలివాళ్ల సంఖ్య పెరుగుతోంది… వయస్సులో ఉన్నవాళ్లు గల్ఫ్ కంట్రీస్ వెళ్లిపోతుంటారు… ఇక్కడ ముసలి తల్లిదండ్రులు ఒంటరిగా ఇళ్లల్లో… ఇలాంటివి కదా పత్రికలు విశ్లేషించాల్సిన రీతి… వాడేదో అంకెలు చెప్పాడు, నేను అచ్చేశాను అంటే ఎలా..? అన్ని మీడియా సంస్థలూ అదే టైపు…!
Share this Article