Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేం వార్త..? పెళ్లానికి కారు కొనిస్తే ఇంతటి బబ్రాజమానం స్టోరీయా..?!

December 4, 2022 by M S R

అనుకోకుండా ఓ వార్త చదవబడ్డాను… ఖర్మకాలి అన్నంత సీరియస్ ఏమీ కాదు, కానీ చికాకు పుట్టించేదే… ఒకప్పుడు ఈనాడు వెన్నులో చలి పుట్టించిన వార్త డెయిలీయేనా ఇది అని ఆశ్చర్యమేసింది… ఫాఫం, ఇప్పుడు మరీ మిర్చి బజ్జీలు, కారా చుడువా కాగితం అయిపోయింది… దాని సినిమా పేజీలో ఓ వార్త… ‘భార్యకు ఖరీదైన కారు బహుమతిగా అందించిన త్రివిక్రమ్’… ఇదీ శీర్షిక…

ఈ వార్తకు త్రివిక్రమ శ్రీనివాస్ ఎంత ఘనుడో, ఎంత కీర్తిమంతుడో, ఎంతటి కార్యశూరుడో, ఎంతటి నిత్యస్మరణీయుడో, తెలుగు ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్ ఎలా అయ్యాడో కూడా రాసేసి, ఐనా ఆయన్ని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనేముంది అంటూ పాఠకులపైనే ఓ చెణుకు విసిరాడు సదరు రచయిత…

స్టేజీలపై ఆయన స్పీచులకు లక్షల మంది ఫ్యాన్స్ ఫిదా అట… సరే, రాస్తే రాశారు, ఎవరికీ నష్టం లేదు… కానీ తరువాత వాక్యాలు చదవండి… ‘‘త్రివిక్రమ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఫార్చ్యూన్ ఫోర్ ప్రొడక్షన్ బాధ్యతలను ఆయన భార్య సౌజన్య చూసుకుంటోంది… ఆమె స్వతహాగా డాన్సర్ కాబట్టి, సినిమాలపై ఆసక్తి ఉంది కాబట్టి, ఈ ప్రొడక్షన్ బాధ్యతల్ని ఆమే చూసుకుంటోంది…

Ads

vartha

ఇక్కడి వరకూ కాస్త అర్థమైంది వార్త… పర్లేదు… ఆ తరువాత చదవండి… సితార బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ మూవీస్ చేస్తున్నారు… సోలోగా కూడా త్వరలో సినిమాలు చేస్తారట… హారిక హాసిని బ్యానర్ సపోర్ట్‌తోనే సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు… అకస్మాత్తుగా సితార, హారిక హాసిని ఎక్కడి నుంచి వచ్చారబ్బా… ఇంతకీ ఎవరు ఎవరితో కలిసి పనిచేస్తున్నారు..? ఏమైనా అర్థమైందా..? అంతా బబ్రాజమానం, భజగోవిందం వార్త…

ఇన్ని చూసుకుంటోంది కాబట్టి ఆమెకు శ్రీనివాసుడు ఓ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడట… సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ అట… భార్యకు ప్రేమతో ఆయన ఈ భారీ కానుకను బహుమతిగా ఇవ్వడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట కూడా… ఒక డైరెక్టర్ తన భార్యకు కారు కొనిస్తే ఇంత పెద్ద వార్తా..? ఇదుగో ఇలాంటివే రాసీ రాసీ, వాళ్లను మునగచెట్టు ఎక్కిస్తాం మనం… తరువాత ఏదైనా చిన్న నెగెటివ్ వస్తే కిందా మీదా పడి కొట్టుకుంటారు… అలా అలవాటు చేస్తున్నాం…

నిజంగా అసలు మీడియాలో సినిమా పేజీలన్నీ ఎత్తేస్తే… టీవీలు, సోషల్ మీడియా, ట్యూబ్ మీడియా కూడా సినిమాలు, టీవీలను కొన్నాళ్లు పూర్తిగా ఇగ్నోర్ చేస్తే… నెగెటివ్ గానీ, పాజిటివ్ గానీ ఏమీలేకుండా… ఏమైపోతారో ఈ దైవాంశ సంభూతులు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions