హాఫ్ పేజీ వార్త… ఓ కార్టూన్… ఏయే రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయో పాత ఉదాహరణలు… యువతతో చెలగాటం అనే శీర్షిక….. నమస్తే తెలంగాణ కరపత్రంలో ప్రత్యేక కథనం చదివితే… ప్రశ్నపత్రాల లీక్‌కు మించిన షాక్ తగుల్తుంది… ఇంకేముంది..? చాలా ఇష్యూస్‌లాగే దీన్ని కూడా దబాయింపు ధోరణితో తొక్కేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందనే సందేహాన్ని కలిగించింది పొద్దున్నే…
ఒకవైపు ప్రవీణ్ అనే గాడిద టీఎస్పీఎస్సీలో చేరి, అత్యంత సులభంగా ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకుని, ఎంచక్కా అనేకమంది అమ్మాయిలను ట్రాప్ చేస్తూ, మరోవైపు హానీ ట్రాపులు పనిచేస్తూ ఓ అరాచకానికి తెరతీశాడు… అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడమే తక్కువ… ఏవో కరెంటు, సింగరేణి, ఆర్టీసీ తదితర కంట్రాక్టు కొలువులను రెగ్యులరైజ్ చేస్తూ, వాటినే కొలువుల భర్తీగా చూపుతూ కథ నడిపించేస్తోంది అధికంగా…
ప్రవీణ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు పెద్ద షాక్… గతంలో నిర్వహించిన కొన్ని పరీక్షలలో ఏం జరిగిందో అనే ఆందోళనకు తెరదీసింది ఈ తాజా పరిణామం… ఇన్నేళ్లలో అవకతవకలకు ఆస్కారం లేని వ్యవస్థను నిర్మించుకోలేకపోయింది కమిషన్… పైగా దాని చైర్మన్ నమ్మినవాళ్లే మోసగించారు అంటున్నాడు… ఎవరిని నమ్మాడు..? ఎవరు మోసగించారు..? ఆ మోసం తీవ్రత ఎంత…? ఇవి ఈ రాష్ట్ర నిరుద్యోగులకు తెలియాల్సిన నిజాలు…
Ads
సిట్యుయేషన్ ఇలా ఉంటే… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీకేజీలు లేవా..? కేవలం తెలంగాణలోనే ఉన్నాయా..? దీన్ని రాజకీయం చేస్తారా..? ఆయ్ఁ అని దబాయిస్తున్నట్టుగా నమస్తే హాఫ్ పేజీ స్టోరీ సాగింది… అవును, ఇతర రాష్ట్రాల్లో సాగుతున్నాయి, నిజమే, అయితే తెలంగాణలో కూడా సాగితే తప్పేమిటి అంటుందా ఈ పార్టీ..? అదేనా ఈ కథనం ఉద్దేశం… బీజేపీ విభాగాలు ఆందోళనలు చేస్తున్నాయనేది బీఆర్ఎస్ కోపానికి కారణం… బీజేపీ రాజకీయ పార్టీయే కదా, రాజకీయం చేయకుండా అదే కమిషన్ ఎదురుగా ఉన్న తమ రాష్ట్ర కార్యాలయంలో తలుపులు బిడాయించుకుని కూర్చుంటుందా..? నో, నో, అక్రమాల్లేవు, అన్యాయాల్లేవు, మన కేసీయార్ గొప్పగా పాలిస్తున్నాడు, కాబట్టి అక్రమాలకు చాన్సే లేదు అని ప్రెస్‌మీట్ పెట్టాల్సి ఉండిందా..?!
ఒకవైపు జాతీయ పార్టీగా అర్జెంటుగా ఎదిగిపోవాలనే రాజకీయాలు, కవిత అరెస్టు తప్పించడానికి నానా కష్టాలు, ఢిల్లీకి మంత్రుల పర్యటనలు తప్ప పాలన పట్టిందెక్కడ..? ఈ కమిషన్‌కు వేరే మంత్రిత్వ శాఖ ఉండదు, నేరుగా సీఎంవో సమాధానం చెప్పాలి… నిజానికి తక్షణం కమిషన్ చైర్మన్ నైతికంగా రాజీనామా చేయాలి… కార్యదర్శిని అక్కడి నుంచి తప్పించాలి… బీఆర్ఎస్ ఇది కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే సాగుతున్నట్టుగా ‘యువతతో చెలగాటం’ అని ఓ హెడింగ్ పెట్టింది నమస్తే తెలంగాణ… పరీక్షా వ్యవస్థ పరువు తీస్తున్న ఉదంతాలు అని రాసింది… ఇక్కడ ఎవరు ఏ యువతతో చెలగాటం ఆడుతున్నట్టు..? ఇక్కడ పరీక్షావ్యవస్థను కూడా తప్పుపడుతోందా..? పరోక్షంగా తమ ప్రభుత్వాన్నే నిందిస్తోందా..? అస్సోంలో నేరుగా ముఖ్యమంత్రే మొన్న లీకేజీలకు నాదే నైతిక బాధ్యత అని బాహటంగానే లెంపలేసుకుని, క్షమాపణ చెప్పాడు… అదీ ఓ నాయకుడికి ఉండాల్సిన నైతిక ధైర్యం…
(B.JanardhanReddy TSPSC Chairman)
మొదట్లో ఈ నేరానికి ఏదో మసిపూసి ‘అబ్బే, ఏమీ జరగలేదు’ అన్నట్టు కవర్ చేయబోయారు… కానీ దీని తీవ్రత పెద్దదే… ఎన్ని పరీక్షల్లో అక్రమాలు సాగాయో నిగ్గుదేలాలి… వేయక వేయక, ఏళ్లుగా ఆపీ ఆపీ… మొన్నామధ్య కష్టమ్మీద వేసిన గ్రూపు-1 ప్రిలిమ్స్‌ను కూడా రద్దు చేశారు ఇప్పుడు… అంటే పరోక్షంగా గతంలో జరిగిన పరీక్షల్లోనూ అక్రమాలు సాగినట్టు కమిషన్ అంగీకరిస్తున్నట్టే కదా..? మరో రెండు పరీక్షలు (ఏఈఈ, డీఏవో) కూడా తాజాగా రద్దు… ప్రవీణ్ అనేవాడి పెన్ డ్రైవ్‌లో ఐదు పరీక్షల ప్రశ్నపత్రాలు ఉన్నాయంటే టీఎస్పీఎస్సీ ఎంత దారుణంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు… నిరుద్యోగులతో ఆడుకుంటున్నది ఎవరో ఇప్పుడు చెప్పండి…!! తెలంగాణలో కొలువు దక్కాలంటే కంట్రాక్టు ఉద్యోగిగా చేరి ఉండాలి లేదా ‘రాసి పెట్టి’ ఉండాలి, బాగా పరీక్ష రాసి ఉండటం కాదు..!!
Share this Article