పంజాబ్ సీఎం దిమాక్‌లోని చటాక్ కూడా తగ్గిపోయినట్టుంది చూడబోతే..! నిజానికి పంజాబ్ ప్రజలు ఆటలు, సైన్యం విషయాల్లో బ్రాడ్‌గా వ్యవహరిస్తారని పేరు… కానీ అమరీందర్ సింగ్ వ్యవహారశైలిలో బాగా తేడా కొడుతోంది… నవజోత్ సింగ్ సిద్దూ కొడుతున్న సిక్సర్లు అమరీందర్‌ను బాగానే డిస్టర్బ్ చేస్తున్నట్టున్నయ్… విషయం ఏమిటంటే..? భారతీయ పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది… గ్రేట్… 49 ఏళ్ల తరువాత మళ్లీ మనం ఆనందించే ఓ విశేషం ఇది… సెమీస్ దాటడమే కాదు, స్వర్ణమూ కొట్టాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటాడు… ఈసారి మహిళల హాకీ జట్టు కూడా ఆశలు రేకెత్తించేలా ఆడుతోంది… అయితే జట్టు గెలవాలని కోరుకుంటాం, దేశం గెలవాలని కోరుకుంటాం… ఒక ఘనత సాధిస్తే మా దేశ పతాకం, మా జాతి గౌరవం అంటాం… మా జట్టు అంటూ ఓన్ చేసుకుంటాం… కానీ అమరీందర్ చిల్లర ట్వీట్ వదిలాడు…
Stellar performance by the Indian Men’s Hockey team at #TokyoOlympics to beat Great Britain by 3-1 & entering Olympic top 4 after 41 years. Happy to note that all 3 goals were scored by Punjab players Dilpreet Singh, Gurjant Singh & Hardik Singh. Congratulations…go for Gold! 🇮🇳 pic.twitter.com/MgQiLFOf8K
— Capt.Amarinder Singh (@capt_amarinder) August 1, 2021
Ads
‘‘మస్తు ఆడారురా అబ్బాయిలూ… సెమీ ఫైనల్స్‌లోకి వెళ్లేందుకు గ్రేట్ బ్రిటన్ జట్టుపై 3-1 స్కోర్‌తో గెలిచారు… ఆ మూడు గోల్స్ కూడా మా పంజాబ్ ప్లేయర్సే కొట్టారు… దిల్‌ప్రీత్‌సింగ్, గుర్జంత్‌సింగ్, హార్దిక్ సింగ్… ఇక గోల్డ్ కొట్టండిరా బాయ్స్’’ అని ట్వీటాడు… అభినందన వరకూ మంచిదే… కానీ ఆ మూడు గోల్సూ మావాళ్లే కొట్టారు అని చెప్పుకోవడం మరీ సంకుచితంగా, ముఖ్యమంత్రి హోదాకు తగని రీతిలో ఉంది… హాకీ అనేది ఓ టీం ఆడే ఆట… వ్యక్తిగతంగా ప్రతిభ చూపే ఆట కాదు… ఓ గోల్ కీపర్, పది మంది ప్లేయర్లు టీం స్పిరిట్‌తో ఆడితేనే విజయం… దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లు ఉంటారు… అది మన జట్టు విజయం… అంతే… విడదీసి మావాడు గోల్ కొట్టాడు, మావాడు గోల్ ఆపాడు, మావాడు ప్రత్యర్థి చేసే గోల్‌మాల్ బ్రేక్ చేశాడు, మావాడు గోల్ కొట్టేందుకు వీలుగా బాల్ పుష్ చేశాడు… ఇలా చెప్పుకుంటూ పోతే ఎలా..?
అందుకే నెటిజన్లు కూడా బాగానే చురకలు వేశారు… చివరకు పంజాబ్ సిక్కులు కూడా సీఎం ట్వీట్‌తో విభేదించారు… ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పుకోవాలి… మరి మనం సింధు గెలిస్తే తెలుగుతేజం అని ప్రశంసిస్తున్నాం కదా… ఇది సంకుచితం కాదా అనడిగేవాళ్లూ ఉన్నారు… ఒక కోణంలో అది కరెక్టు వాదనే… సింధు ఒలింపిక్స్ బరిలో నిలబడి కొట్లాడుతున్నప్పుడు ఆమె ఇండియన్… ప్రతి ఇండియన్ ఆమె గెలుపును ఓన్ చేసుకుంటాడు, చేసుకోవాలి… ఎక్కడో మణిపూర్ అమ్మాయి, మీరాబాయ్ చాను రజతం కొడితే మన బంగారం, మన మణిపూస అని మనం సంబరపడిపోవడం లేదా..? ఇదీ అంతే… కానీ బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి వ్యక్తిగత ప్రతిభ చూపే ఆటలు… ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల ప్రజలు మా అమ్మాయి, మా అబ్బాయి అని సంబరపడటంలో పెద్ద తప్పు అనిపించదు… కానీ హాకీ, ఫుట్‌బాల్ వంటి ఆటల్లో గోల్స్ కొట్టేది ఎవరైనా… ప్రతి గోల్‌లో దాదాపు టీం మొత్తం భాగస్వామ్యం ఉంటుంది… అందుకని జట్టును విడదీసి ఆటగాళ్లను ప్రాంతాల వారీగా ప్రశంసించడం అనేది కరెక్టు కాదు… మహిళల హాకీ టీంలోని వందన వరుసగా మూడు గోల్స్ (హ్యాట్రిక్) కొట్టడం వల్లే మొన్నటి గెలుపు సాధ్యమైంది… మరి ఉత్తరాఖండ్ సీఎం వెంటనే మా వందన బంగారం, ఆ మూడు గోల్సూ మా అమ్మాయి కొట్టినవే అని ట్వీట్ పెట్టలేదు… ఆ టీంను ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తోంది… సీఎం నవీన్ పట్నాయక్ మా రాష్ట్ర జట్టు గ్రేటోయ్ అని ట్వీటలేదు… ఎందుకంటే… వాళ్లు అమరీందర్ సింగ్‌లు కాదు కాబట్టి…!!
అప్ డేట్….. భారతీయ మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారిగా సెమీస్‌లోకి చేరింది… గ్రేట్… అభినందనలు… ఆస్ట్రేలియాపై జరిగిన పోరులో గోల్ కొట్టి మన పతాకం ఖ్యాతిని ఎగరేసింది… కొంపదీసి పంజాబ్ సీఎం వెంటనే ఇంకో ట్వీట్ చేయలేదు కదా…. మా పంజాబీ బిడ్డ పుణ్యమే ఇది అని…!!
.
.
ఇలా రాశానో లేదో పెట్టేశాడు… ఇలా…
Proud of our Women #HockeyTeam for making it to Olympic Semi-Finals by beating three-time Olympic Champions Australia. Kudos to Gurjit Kaur from Amritsar who scored the lone goal of the match. We are on the threshold of history. Best of luck girls, go for the gold. 🇮🇳 https://t.co/vvk1TLftFR
Share this Article