Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేడారం ఆదివాసీ సంస్కృతిపై… అర్ధ జ్ఞానపు తిక్క రాతలు- కూతలు…

January 3, 2026 by M S R

.

(   గుర్రం సీతారాములు  )  …… డి ‘వైన్’ ఎక్కువ అయితే అభాసుపాలు అవుతారురా అబ్బాయిలూ…

నిన్న మొన్న జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఎన్ని ఆదివాసీ పుస్తకాలు ఉన్నాయి, కొన్నారు… ఎంతమంది కోయ గోండులను బుక్ ఫెయిర్ వేదిక మీదికి పిలిచారు..?

Ads

ఆదిమ జాతులకు రాతలు కోతలు ఉండవు , మనం మాట్లాడుకుంటున్న ఆధునిక భాష లిపి లేని కాలంలో కూడా భిన్న సమాజాల తెగల మధ్య భావ ప్రసారాలు ఉన్నాయి. ఒకసారి ఈజిప్ట్ పిరమిడ్ల మీద ఉన్న భాషను చూడండి, అవి కేవలం బొమ్మలు మాత్రమే. అన్ని ప్రాచీన భాషలు అంతే.

ఈ మధ్య మేడారం జాతర పునర్నిర్మాణం గురించి మేధావులు తెగ ఆందోళన పడుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా అక్కడ శాశ్వత నిర్మాణాల మీద మరీ వ్యతిరేకత. అది వారి మీద ప్రేమనా,  వారి సంస్కృతుల మీద ప్రేమనో అర్ధం కావడం లేదు. కానీ ప్రతీ ఒక్కడు ఆ సమాజాల మీద ఏదో పరిశోధన చేసినట్టు మాట్లాడుతున్నారు.

medaram

వాళ్ళ అజ్ఞానానికి చింతిస్తూ నా పరిశోధనతో బాటు అక్కడ ఉన్న పూజారులు, గిరిజన పరిశోధకులతో మాట్లాడి ఇది చెబుతున్నా… వినికిడి జ్ఞానం మీద తీర్పులు ఇవ్వడం, పాత పుట్‌పాత్ మీద యే శిధిల పుస్తకామో దొరికితే, దాని అట్ట మీద పేరు మార్చి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం పెద్ద పరిపాటి. అలా వేయాలి అనుకుంటే నా దగ్గర ఒక ఐదు వేల పేజీల అరుదయిన సాహిత్యం ఉంది.

కానీ అసలు విషయానికి వస్తున్నా. ఇప్పుడు మాట్లాడుకుంటున్న మేడారం జాతర పరిసర ప్రాంతాలు ఒకనాటి బస్తర్ ఆదివాసీ రాజ్యాల సమాహారం. కొన్ని మద్రాస్ ఇంకొన్ని సెంట్రల్ ప్రావిన్స్ కు ఆనుకుని ఉన్నాయి.

తిరునామాలు, శంఖు చక్రాలు, శివలింగం, స్వస్తిక్ మనకి మనం ఆపాదించుకున్న దైవిక ఆనవాళ్ళు. అక్షరం ముక్క రాని ఆదిమ సమాజాలు తన దగ్గర ఉన్న గుడ్డల మీద లిఖించుకున్న ఈ ఆకారాలు మనకున్న ఆధునిక జ్ఞానంతో చూడడంకన్నా ఆ సమాజ గమనాలకు గుర్తులుగా గుర్తించాలి. అవసరం అయితే ఆ లిపి మూలాలు తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకోవాలి. అనవసరంగా తీర్పులు ఇవ్వకూడదు.

medaram

భద్రాచలం మేడారం ప్రాంతాలు కొంత నైజాం, మరి కొంత మద్రాస్ ప్రావిన్స్ లో ఉన్నప్పటికీ ఆదివాసీ గోండ్వానాలో ఒకనాడు మన ఉత్తర తెలంగాణ భాగం. ఆ సమాజాలను సరిగా చదివి అర్ధం చేసుకునే జ్ఞానం విజ్ఞత మనకు లేదు .

ఏకాడికి ఎక్కడ వెనకబడి పోతామో అని అడ్డగోలు రాతలు రాయడం మినహా మేడారం పరిసర గ్రామాలలో ఉన్న ఆదివాసీలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పరిభాషలో ఏడు గొట్లు, అంటే మన పరిభాషలో గోత్రాలు లేదా తెగ నామాలు వాళ్ళు.

medaram

ప్రతి ఆదివాసీ ఆ గొట్లు నామాన్ని పచ్చ బొట్లుగా మొఖం మీదనో, చేతి మీదనో పొడిపించు కుంటారు. మనిషిని చూడగానే వీడు ఫలానా జాతి గోత్రం వాడు అని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళ ఆచారంలో భాగం అది. అవి తరాలుగా పచ్చబొట్లు గానో లేదా గుడ్డ (పడిగే ) దాలు గుడ్డ మీద ఆ ముద్రలు తరాలుగా ఉన్నాయి .

వాటిని కోయ చరిత్రగా తరాలుగా కాపాడుకుంటున్న ఒక పరంపర ఉంది. మౌఖికంగా మేడారం జాతర పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు అది గానం చేస్తున్న కళాకారులు, పూజారులు ఉన్నారు.. మాదిగలకు కూడా ఈ స్క్రోల్ సంస్కృతి ఉంది. ( నేను ఈ అంశం మీద సెంట్రల్ యూనివర్సిటీలో పదిహేను ఏళ్ల కిందనే పరిశోధన మొదలు పెట్టాను, పూర్తి చేశాను)

medaram

ఆదివాసులకు ఉన్న ఏడు గొట్లలో మొదటిది అండ రూపం. రెండు సూర్య చంద్ర రూపాలు. మూడు సారలమ్మ . నాలుగు పగిడిద్ద రాజు, గోవింద రాజు. ఐదు సమ్మక్క . ఆరో గొట్టు, ఏడో గొట్టు. ఇందులో నాలుగో గొట్టు పగిడిద్ద రాజు, గోవింద రాజు కాలంలో వాళ్ళ ఆచారంలో ఈ శంకు చక్రాలు, శివ లింగాలు ఉన్నాయి. బహుశా ఆనాటి మత మార్పిడిలో 4 వ తరం ఈ గుర్తులను తమ గోత్ర చిహ్నాలుగా ఎన్నుకున్నాయి అనుకోవచ్చు (నా అంచనా) ఎన్నుకునే స్వేచ్చ కూడా ఉంది .

medaram

ఆదిమ తెగల దగ్గరకు సమాజాల దగ్గరకు మీ మతాలు, నమ్మకాలు తీసుకుని పోయారు. బలవంతంగా వాళ్ళ బ్రతుకుల్లోకి వెళ్ళింది మీరే. ఇప్పుడు మీరేదో వారి అలవాట్లను అభిరుచులను గౌరవించినట్లు మాట్లాడతారు కానీ అంతా వంచన. మీలో నిజాయితీ లేదు,, వాళ్ళ అలవాట్ల మీద గౌరవం లేదు.

ఈ సమస్యను kcr-  రేవంత్ రెడ్డి మధ్య ఇరికించడం తప్ప మీ వాదన ఉట్టి డొల్ల. మీ ఆలోచన ఒక కంపు.

medaram

హిట్లర్ 1920 లో తన నాజీ పార్టీ గుర్తుగా ఎన్నుకున స్వస్తిక్ కి పది నుంచి పదిహేడు వేల ఏళ్ల చరిత్ర ఉంది. జర్మనీయేతర సమాజాలు దాన్ని చెడుగా చూస్తాయి కానీ మన వీరభక్తులు కూడా అందులో దైవికాన్ని చూస్తున్నారు. ఉదాహరణకు (Ψ, ψ) ఈ పైన ఉన్న ఈ గుర్తులు చూస్తే మనకు త్రిశూలం గుర్తుకువస్తది కానీ అది గణితంలో ఒక అంకె.

swastik

ఈ కోడ్ భాష సైన్ భాషల మీద Roland Barthes లాంటి వాళ్ళు గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు. మన పుట్‌పాత్ కోడి జ్ఞానంతో ప్రతిదాని మీద ప్రకటనలు, వ్యాసాలు, సిద్దాంతాలు చేస్తాం రాస్తాం అంటూ మీకెందుకయా జ్ఞానాలు? మీటింగ్లలో మా కుర్చీ వెనక వేశారు , ఆహ్వాన పత్రంలో మా గోత్రం లేదు, కులం ఆనవాళ్ళు లేవు. ఇంతకు మించి మనం ముందుకు మాత్రం సాగము .

రాంజీ గోండు నుండి కొమురం భీమ్ దాకా నిన్న చచ్చిన ఆదివాసీ హరి భూషణ్ నుంచి నిన్నా మొన్నా చస్తున్న వేలాది ఆదివాసీ అమరులు రక్తతర్పణ చేశారు. ఎన్నడన్నా ఆ వీరులను తలుచుకున్నారా ?

ఇన్నేళ్ల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయాలలో ఒక్క ఒకరిద్దరు కోయ గోండ్లు ప్రొఫెసర్ అయినా ఉన్నారా .? మీ మీటింగ్లకు ఒక్క కోయ స్కాలర్ ను పిలిచారా ? ఒక్క కోయ ఆచారం గురించి, నాయకుడి గురించి వ్యాసాలు రాసారా ?మేడారం గుడి గురించి ? వాటి మీద వక్ర బాష్యాలు రాసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ? థూ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పర్యావరణహితం… వన్యప్రాణ స్నేహితం… సక్సెస్ ఫుల్ మోడల్ హైవే..!
  • మేడారం ఆదివాసీ సంస్కృతిపై… అర్ధ జ్ఞానపు తిక్క రాతలు- కూతలు…
  • ఈ ఫోటోకు పులిట్జర్ ప్రయిజ్ వచ్చింది… ఈ సంఘటన ఏమిటో తెలుసా..?!
  • రాత్రి ప్రపోజ్ చేసినట్టు గుర్తు… కానీ ఆమె ఏమన్నదో చస్తే గుర్తురావడం లేదు…
  • My Old Neighbours- హఠాత్తుగా వాళ్ల ప్లస్ పాయింట్స్ కనిపించసాగాయి…
  • ఎన్నికల స్క్వాడ్ వేషాలు… వసూళ్ల దందాలో జర్నలిస్టులు…
  • ఇండియా చేతికి ఒమన్ పోర్ట్ డుఖం… పాకిస్థాన్‌కు కొత్త దుఖం…
  • అల్లుకు అవార్డు… లైవ్ కుదరడం లేదు.., ఆ అవసరానికి ఓ అబద్ధం…
  • ఏ పార్టీ ప్రభుత్వం ఐతేనేం…? పాలకుల్ని నడిపించేది ఆ కంట్రాక్టర్లేనా…!!
  • సౌందర్య మరణానికి ముందురోజు… అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions