.
Pardha Saradhi Upadrasta … అన్నా, టర్కీ – సౌదీ – పాకిస్థాన్ మధ్య అదేదో ఒప్పందం జరిగింది అట. భారత్ కు ముప్పు లేదా? ముగ్గురు కలిసి భారత్ మీద దాడి చేస్తే ఎలా? : ఒక అమాయక ప్రశ్న.
భారతదేశం – పాకిస్తాన్ యుద్ధంలో సౌదీ గాని టర్కీ పాల్గొనవు. టర్కీ ఆయుధ సహాయం, సౌదీ అరేబియా ధన సహాయం చేస్తాయి. అది కూడా పాకిస్తాన్ మీద భారతదేశం మొదట యుద్ధం ప్రకటిస్తేనే… పాకిస్తాన్ వాడు భారతదేశంలో టెర్రరిస్ట్ దాడులు చేసిన తర్వాత భారతదేశం తిరిగి దాడి చేస్తే సహాయాలు ఏమీ ఉండవు .
Ads
అందుకే ఒప్పందాలు పూర్తిగా చదవాలి. మీడియా రాసే పొట్టి, వేగవంతమై చిన్న చిన్న వార్తలు చూసి ఏదేదో అయిపోతోంది అనుకోకూడదు.
ఇంకొకటి … పాకిస్థాన్‌కు సౌదీ అరేబియాతో ఇప్పటికే, అంటే 2025 నుంచే Strategic Mutual Defence Agreement ఉంది. ఆ ఒప్పందం తర్వాత 2026లో ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ సౌదీకి సైనిక సహాయం కూడా అందించింది.
Reuters వార్తల ప్రకారం…, సౌదీ భద్రత కోసం పాకిస్థాన్ వేలాది సైనికులు, ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా మోహరించింది. అంటే ఇక్కడ టర్కీ గానీ, సౌదీ గానీ పాకిస్థాన్ ని ఈ ఒప్పందంలో చేర్చుకున్నది పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ని వాళ్ళు వాడుకోడానికి తప్పితే సౌదీ, టర్కీ వచ్చి పాకిస్థాన్ కి మద్దతు ఇవ్వడానికి కాదు…
ఇప్పటికే పాకిస్థాన్ ఆర్మీని నెల జీతానికి ఇరాన్ దాడి నుండి సౌదీ ఎయిర్ బేస్ లను కాపాడుకోవటానికి, ఎమెన్ సరిహద్దులో సౌదీ తరుపున పోరాడటానికి వాడుతున్నారు. ఐటీ అవుట్సోర్సింగ్, సర్వీస్ అవుట్సోర్సింగ్ లాగా ఇది ఆర్మీ జవాన్ ల కిరాయికి సర్వీస్ అవుట్సోర్సింగ్ అన్న మాట.
అందుకే దేశ రక్షణ వంటి విషయాల్లో వాట్సాప్ హెడ్‌లైన్లు కాదు… అసలు ఒప్పందంలోని నిబంధనలు చదవాలి.
వార్త చిన్నదైనా… విషయం చాలా పెద్దది.
హెడ్‌లైన్ చూసి భయపడకండి. పూర్తి విషయం తెలుసుకుని మాట్లాడండి.
#PardhaTalks #India #Pakistan #SaudiArabia #Turkey #Defence #Geopolitics #NationalSecurity #IndiaPakistan #StrategicAffairs #MeccaDefenceAgreement
Share this Article