Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?

October 7, 2026 by M S R

.

Akula Sreenath …. అది 2002 వ సంవత్సరం…
నేను హైద్రాబాద్ నుంచి వరంగల్ ప్రజాశక్తి డెస్క్ ఇంచార్జీగా ట్రాన్స్ఫర్ పై వెళ్ళాను… నేను వెళ్ళిన కొద్దిరోజులకే భూపాలపల్లిలో ఎన్కౌంటర్ జరిగింది.. ముగ్గురు నక్సలైట్స్ మరణించారు.. ఈ వార్త తెలిసేసరికి రాత్రి 10.30 దాటింది..

అప్పటికే ఎడిషన్ టైమ్ పూర్తయింది.. మా ఎడిషన్ ఇంచార్జీ గారు ఫోన్ చేసి వార్తను మెయిన్ కోసం అర్జెంట్ గా హైదరాబాద్ పంపమన్నారు.. వెంటనే స్టాఫ్ రిపోర్టర్ కి ఫోన్ చేశాను.. ఆయన అందుబాటులోకి రాలేదు… ఆ విషయాన్ని హైదరాబాద్ కి కాల్ చేసి చెప్పాను.. నువు ఏంచేస్తావో తెల్వదు.. ఇంకో అరగంటలో వార్త కావాలి అని మా మాఫిసిల్ (నెట్వర్క్ ) ఇంచార్జీ ఖరాఖండిగా ఆదేశించి ఫోన్ పెట్టేసారు..

Ads

ఇక నేనే వార్త సేకరణ కోసం రంగంలోకి దిగాను.. ఎందుకంటే హైద్రాబాద్ నుంచి అప్పుడే కొత్తగా వరంగల్ కి వెళ్ళాను కాబట్టి మిగతా మీడియా మిత్రులు అప్పటికి పరిచయం కాలేదు.. భూపాలపల్లి పోలీసుస్టేషన్ కి కాల్ చేశాను.. ఎస్ఐ లైన్ లోకి వచ్చి ముగ్గురు నక్సలైట్స్ ఎన్కౌంటర్ అయ్యారు అని చెప్పాడు…

అదే ఎలా? అని నేను తిరిగి ప్రశ్నించాను.. అవతలి వైపు నుంచి కొన్ని క్షణాలు నిశ్శబ్దం.. ఆ తర్వాత అడిగాడు నువ్వు ఫీల్డ్ కి కొత్తా అని… కాదండీ, నేను సిటీ నుంచి ఇక్కడకు ట్రాన్సఫర్ అయ్యాను అని చెప్పాను… ఓహో.. అంటూ సరే రాసుకో చెబుతాను అని ఎన్కౌంటర్ వార్తను ఎలా రాయాలో ఎస్ఐ చెప్పారు..

అటవీ ప్రాంతంలో నక్సలైట్లు సమావేశం అవుతున్నారనే సమాచారం మేరకు మా పోలీసులు కూంబింగ్ మొదలు పెట్టారు.. కొద్ది దూరం వెళ్లాక నక్సలైట్స్ తారస పడ్డారు.. మా వాళ్ళు లొంగిపొమ్మని హెచ్చరించారు.. కానీ వాళ్ళు కాల్పులు జరపడం మొదలు పెట్టారు… ఆత్మ రక్షణార్ధం మా పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు.. కొన్ని గంటల తర్వాత అటు వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి.. వెళ్లి చూస్తే నక్సలైట్స్ శవాలు అక్కడ పడి ఉన్నాయి… అని చెప్పి ఫోన్ పెట్టేశాడు….

ఇదంతా ఇప్పుడు ఎందుకు రాస్తున్నానంటే.. ఈ మధ్య ఓ మిత్రుడు కాల్ చేసి.. నీకు సినిమా రివ్యూ ఎలా రాయాలో నేను చెబుతాను అని రెండు పాయింట్స్ చెప్పాడు.. అవి.. మొదటి హాఫ్ అదిరింది.. రెండో హాఫ్ దొబ్బింది అని రాయాలని సలహా ఇచ్చాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions