బహుశా ఈమధ్యకాలంలో ఇంతగా సూపర్ హిట్టయిన ఫోటో మరొకటి లేదేమో… అత్తారింటికి దారేదీ సినిమాలో హేమ ఆంటీ బుగ్గల్ని పిండుతూ ఏదో సెటైర్ వేస్తాడు బ్రాహ్మీ… ఆ పార్టీలో నేను లేను అని చెప్పడానికి బిర్యానీ వండుతూ, నేనిక్కడే ఉన్నానంటూ ఫేక్ వీడియోలు పెట్టింది కదా… ఆ ఫోటో వాడుతూ హేమ, రేవ్ పార్టీకి లింక్ పెడుతూ… మీమ్స్, సెటైర్లు, జోకులు, పోస్టులు భలే పేలుతున్నయ్…
అబ్బే, ఆమె మామిడి కాయ పచ్చడి పెట్టడానికి పోయింది, కాదు, అట్ల తద్ది ఆట పెట్టారట, ఆడటానికి వెళ్లింది వంటి సెటైర్లు బోలెడు… దాదాపు 80 మందికి పైగా డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది కదా, మరి హేమనే మీడియా ఎందుకు టార్గెట్ చేసింది..? ఆమె పెడుతున్నవి ఫేక్ వీడియోలు అని అందరికీ తెలుసు… ఏదో బుకాయిస్తున్నదనీ తెలుసు… కానీ హేమ మీద తెలుగు మీడియా చాన్నాళ్లుగా గుర్రుమీద ఉంది… ఎప్పుడు దొరుకుతుందా, ఆడుకుందామా అని నిరీక్షిస్తోంది… దొరికింది బిడ్డ…
అప్పట్లో మా ఎన్నికలప్పుడు కావచ్చు, పిచ్చి థంబ్ నెయిల్స్ రెచ్చిపోతున్న తొలిరోజులు కావచ్చు… హేమ ఎడాపెడా మీడియా మీద విరుచుకుపడింది, కేసులు పెడతానంది… తరువాత హైదరాబాద్ పబ్బులో దొరికిందని కొందరు వార్తలు రాస్తే, నాకు బిడ్డ ఉంది, అబద్ధాలు రాసినవాడిని వదిలిపెట్టేది లేదంటూ ఎగిరింది… ఆమె నోరు పెద్దది, అంటే అలాంటి డ్రగ్స్ ఏవైనా హరాయించుకోగలదు అని కాదు, తిట్టేస్తుంది…
Ads
ఇప్పుడిక దొరికింది… అందుకే పెద్ద పెద్ద టీవీ చానెళ్లు సైతం ఫుల్లు నెగెటివ్ లైన్ తీసుకుని వార్తల్ని కుమ్మేశారు… పైగా ఆ మిగతా 80 మందిలో పెద్దగా పేరున్న తారల్లేరు, హేమ పేరున్న తార అని కాదు, కానీ ఆది నుంచీ కంట్రవర్సీ… రేవ్ పార్టీ నిజం… వాడెవడో రోజూ వీడియోల్లో కనిపిస్తూ ఆ చెవుల్లో వెంట్రుకల తాతగారు, ఆ రేవ్ పార్టీలో హేమ లేదు, ఇదొక కుట్ర అంటూ అరుస్తున్నాడు… కానీ ఆమె తన సొంత ఒంటి పేరు కృష్ణవేణి పేరుతో వెళ్లింది, పోలీసులు ఆమె ఫోటో రిలీజ్ చేశారు, ఆమె వెళ్లిన విమానం టికెట్లు కూడా ముద్రించి మీడియా ఆమెను భలే బుక్ చేసింది…
గతంలో నీహారిక దొరికినప్పుడు కూడా ఇలాగే మీడియా ఆడుకుంది, దొరికిండు నాగబాబు అనుకుని కుమ్మేశారు… మీడియా ఎప్పుడూ ఓ టైమ్ కోసం వెయిట్ చేస్తుంది… ఇదుగో ఇలా పట్టేసుకుంటుంది… 20 లక్షల ఫీజు అనేది తప్పు… 2 లక్షలు అనేది ఈ రేవ్ పార్టీలకు తక్కువ మొత్తమే… మన హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ ప్లయిట్స్ వేసి, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాల్లో రేవ్ పార్టీలు ఆర్గనైజ్ చేసిన కథలూ చదివాం కదా… ఈ పార్టీ ఆర్గనైజర్ బెజవాడ వాసు కూడా అంతేనట…
అక్కడ పేకాట దగ్గర నుంచి సాండ్ విచ్ మసాజుల మీదుగా… ఏవేవో సౌకర్యాలు, విలాసాలు గట్రా దొరుకుతాయి… 2 లక్షలు అనేది అలా వెళ్లేవాళ్లకు నథింగ్… మొన్న బెంగుళూరులో జరిగింది కూడా ఇలాంటి ఆర్గనైజ్డ్ పెయిడ్ ఈవెంటే… అసలు ఎవరు ఈ హేమాంటీ…?
రాజకీయాలంటే మక్కువ ఎక్కువ. అందుకే సినీ రాజకీయాల్లో కూడా ప్రవేశించి, మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్- MAA)లో కార్యవర్గ సభ్యురాలిగా, సంయుక్త కార్యదర్శిగా ఎంపికయింది. ఏ ప్యానెల్లో లేకుండా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి కూడా గెలుపొందింది. ఆ తర్వాత అసలైన రాజకీయాలలోకి 2014లో ప్రవేశించి, సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట (Mandapet) శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. ఇక అక్కన్నుంచి వైఎస్సార్సీపీకి 2019లో, మళ్లీ 2021లో బిజేపీలోకి జంప్ చేసింది. ప్రస్తుతం ఎందులో ఉందో తెలియదు… అవునూ, అన్సి ఆంటీ ఎక్కడైనా దొరికే చాన్సుందా బ్రో…
Share this Article