.
తెరపైకి సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు వచ్చింది… ఇంట్రస్టింగు… ఆషురెడ్డి కథ తెలుసు కదా… టీవీ సెలబ్రిటీ… ఎవరో లండన్ సాఫ్ట్‌వేరుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 10 కోట్లు రివర్స్ కట్నం తీసుకుందనేది కదా కేసు… ఇప్పుడు చెబుతున్నాడు తను… ఎనిమిదేళ్ల తరువాత… ఆషురెడ్డి చెల్లెకు 75 లక్షల విలువైన డాలర్లు ఇచ్చాడట, ఆమె తండ్రికి 92 లక్షల డబ్బులిచ్చాడట, ఈమెకు ప్రాపర్టీలు కొనిచ్చాడట…
ఇప్పుడు కేసులు, రాద్ధాంతం జరుగుతుంటే… సరే, కోటిన్నర వాపస్ ఇస్తా, నిన్నెవడు చేసుకుంటాడు, మిగతా సొమ్ము నాకు కుదిరినప్పుడు ఇస్తాపో అంటున్నదట… కావాలంటే వేణుస్వామిని, నటి ప్రవీణను మధ్యవర్తిగా పెట్టి మాట్లాడుకుందాం అని చెబుతోందట… నడుమ వేణుస్వామి ఎందుకొచ్చాడు ఇందులోకి..? అదో కథ…
Ads
వీళ్లిద్దరి జాతకాలూ తనే చూశాడట… ఇదెక్కడో ఘోరంగా బెడిసికొడుతుందని తను ముందే చెప్పాడో లేదో తెలియదు గానీ… మధ్యవర్తిగా తనేం చేయగలడు..? ఇద్దరూ తన కస్టమర్లే… జరిగేది జరగకమానదు.,. చివరకు పోలీసులు చేసేది కూడా ఏమీ ఉండదు చట్టబద్దంగా… ఎందుకంటే..? సదరు ధర్మేంద్రుడు డబ్బులు ఇచ్చింది నిజమే, అవును నిజమే అంటోంది ఆమె కూడా… ఇష్యూ చేస్తే కేసు పెడతానని కూడా బెదిరించిందట…
బకరా అయింది వరుడు కాలేకపోయిన అబ్బాయి… రెండుమూడుసార్లు పెళ్లి కేన్సిల్ అని ఆమె చెబుతున్నా, ఎవరో బాయ్‌ఫ్రెండ్‌తో ఫోటోలు కనిపిస్తున్నా, నిలదీయకపోగా, ఇంకా ఇంకా డబ్బు ఇస్తూనే వెళ్లాడు… ఇల్లు, కారు, బంగ్లా కొనిచ్చాడట… మొన్నామధ్య తన ఆమెకు ఎంతెంత డబ్బు ఇచ్చాడనే వివరాలు సోషల్ మీడియాలో కనిపించాయి… చివరకు 4 వేలు, 5 వేల బిల్లులు కూడా అబ్బాయి ఖాతా నుంచే తెప్పించుకున్నట్టు, ఖర్చు చేసినట్టు కనిపిస్తున్నాయి…
చీటింగ్ కేసు కూడా నిలబడదు, గట్టి లాయర్ దొరికితే… మరో సెలబ్రిటీ కేసు కూడా చెప్పుకున్నాం కదా… ముత్తంశెట్టి కుటుంబంలో పెళ్లి రగడ… కోటి నగదు, బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన గిఫ్టులు ఇచ్చారట అబ్బాయికి… తీరా ఎక్కడో తేడా కొట్టింది, అమ్మాయి తరఫున 70 మంది వెళ్లి అబ్బాయి ఇంట్లో వీరంగం వేశారు… ఇరుపక్షాలూ కేసులు పెట్టుకున్నాయి… అసలది కట్నం కిందకే రాదు, నిరూపించడం కష్టం… వాళ్లకు వేణుస్వామి తెలుసో లేదో తెలియదు…
మూడో సెలబ్రిటీ కేసు మంగ్లీది… కోట్లకుకోట్లు అమాయకుల నుంచి అక్రమంగా వసూళ్లు చేసిందనేది కేసు… ఓ పోస్టు కనిపించింది… ఇప్పటికే బాధితులు 9 మంది మరణించారని..! కేసు ఎక్కడివరకు వచ్చిందో క్లారిటీ లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకో పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోంది, కారణాలేమిటో గానీ… ఆమెతో సజ్జనార్ ఫోటో దిగడం జనంలోకి రాంగ్ మెసేజ్ పంపించినట్టే… ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్‌కు ఎవరు చెప్పాలి..? ఆమధ్య అన్వేష్ అనే వెధవ విషయంలోనూ సజ్జనార్ తప్పులో కాలేశాడు… ఇక ఓ లాయర్ స్టేషన్‌కు వచ్చినప్పుడు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయించిన తీరు కూడా బాగా విమర్శల పాలైంది…
సో, ఇవీ రీసెంట్ మూడు సెలబ్రిటీ కేసులు… మూడు ఫాలోఅప్స్… సర్లెండి, మరో సెన్సేషన్ న్యూస్ దొరికితే, అందులోనూ సెలబ్రటీ కేసు దొరికితే అవన్నీ ఇక ఎవరూ పట్టించుకోరు… లోకసహజం…
Share this Article