Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్పెర్మినేటర్..! 165 మందికి వీర్యదాత… ఇక ఆపేస్తాడట విత్తనవ్యాప్తి..!!

June 17, 2024 by M S R

న్యూస్18 వాడు భలే పేరు పెట్టాడు… స్మెర్మినేటర్..! అంటే సీరియల్ వీర్యదాత… పేరు అరి నాగెల్… 48 ఏళ్ల అమెరికన్ యువకుడు… బ్రూక్లిన్‌లో ఉంటాడు… ఇప్పటికి తన వీర్యం ఇవ్వడం ద్వారా 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యాడు… ఇక చాలు, ఇక రిటైర్ అయిపోతాను అంటున్నాడు, అదేదో ఉద్యమం అన్నట్టు, అదేదో కొలువు అన్నట్టు..!!

ఇది చదువుతుంటే మొన్నామధ్య వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గుర్తొచ్చింది… మిస్ శెట్టి అంటే అనుష్క శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అంటే నవీన్ పోలిశెట్టి… అందులో అనుష్క ఓ తోడు కావాలని కోరుకుంటుంది, పెళ్లి వద్దు… సంభోగంతో సంబంధం లేకుండా, పెళ్లి అనే జంఝాటం లేకుండా… ఓ పిల్ల కావాలని ఓ వీర్యదాత కోసం వెతుకుతూ ఉంటుంది… ఆరోగ్యం, ఇతర లక్షణాలు బాగున్న యువకుడి వీర్యం కావాలి తనకు… (యాంటీ సెంటిమెంట్ కదా, సినిమా పెద్దగా ఆడలేదు)…

సరే, అదంతా వేరే సినిమా కథ… చాలామంది భర్తలకు వీర్యంలో కౌంట్ సరిపడా ఉండదు, మిగతావన్నీ వోకే… సో, పిల్లల్లేని ఆ వివాహిత మహిళలు వేరే పురుషుల వీర్యం మీద ఆధారపడి పిల్లలను కనడం ఏనాటి నుంచో ఉన్నదే… (పాత నియోగ పద్ధతి కాదు ఇది… దాత వీర్యం తీసుకోవడంలో సంభోగం ఉండదు…) వీర్యనిధి (సెమెన్ బ్యాంకు)లు చాలాచోట్ల ఉన్నవే… ఇప్పుడు అండాల్ని కూడా నిల్వ చేసుకునే ఏర్పాట్లూ వచ్చాయి… ఓ ఏజ్ దాటాక అండోత్పత్తి సరిగ్గా ఉండదనే భావనతో యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే తమ అండాల్ని నిల్వ చేసుకోవడం ఇది…

Ads

ఎగ్ డోనర్స్ కూడా ఉంటారు… సింగిల్ ఫాదర్స్ ఆ ఎగ్స్ తీసుకుని, తమ సెమెన్ ద్వారా ఫర్టిలిటీ సెంటర్లలో పిండాన్ని ఉత్పత్తి చేయించుకుని, సరోగేట్ మదర్స్ ద్వారా పిల్లలను కనడం… ఈ కథలూ ఉన్నాయి… సరే, ఈ స్మెర్మినేటర్ కథకు వద్దాం… పలుచోట్ల ప్రపంచంలో సెమెన్ డొనేట్ చేసిన దాత వివరాలు చెబుతారు… మన దేశంలో కొన్ని సెన్సిటివిటీస్, ఇగోస్ కారణంగా చెప్పరు…

అరి నాగెల్ ఏమంటాడంటే..? మరో రెండేళ్లు, ఇక 50 వచ్చాక ఆపేస్తాను… ఆ వయస్సులో ఆటిజం వంటి రిస్కులు, సమస్యలు వచ్చేస్తుంటాయి… సో, వీర్యం నాణ్యత బాగుండదు… అందుకని ఇక వీర్యం ఇవ్వను… (విత్తన వ్యాప్తి ఆపేస్తాడట, అది ఆ మీడియా భాష)…

ఇప్పుడు నాగెల్ ఎక్కడున్నాడో తెలుసా..? బహమాస్‌లో… తన ఫస్ట్ కొడుకు, 20 ఏళ్ల టైలర్, తన 33వ సంతానం, ఏడేళ్ల బిడ్డ టోపాజ్‌తో కలిసి విహరిస్తున్నాడు… బయోలాజికిల్ ఫాదర్ కమ్ డోనర్‌తో అలా పిల్లల్ని బయటికి పంపిస్తారా అంటే వాళ్లిష్టం… పిల్లల దగ్గర ఏదీ దాచరు కొందరు… అన్నీ తెలిసే ఉండాలని ముందే చెబుతారు… విశాల భావనలతో వ్యవహరిస్తుంటారు…

నాగెల్ పిల్లలు అమెరికాలోనే కాదు, కెనడా, ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాల్లోనూ ఉన్నారు… రీసెంటుగా కనెక్టికట్‌లో 165వ బిడ్డ పుట్టింది… ‘‘నా ద్వారా ఆమెకు నాలుగో సంతానం… ప్రస్తుతం మరో పదిమంది గర్భిణులున్నారు… జింబాబ్వే, లాంగ్ ఐలాండ్స్ తల్లుల ప్రసవం జూలైలో… ఇజ్రాయిల్, క్వీన్స్ తల్లుల ప్రసవం ఆగస్టులో…’’ అంటున్నాడు నాగెల్…

చాలాసార్లు క్లినిక్కుల్లోనే ఈ దానం ఉంటుంది… కొన్ని సందర్భాల్లో దాన స్వీకర్త మహిళల ఎదురుగానే… సంభోగంతో పనిలేదు… ‘ఎందరు ఎక్కువ మంది పిల్లలుంటే అంత ఆనందం… ఐనాసరే, 175 దాటనివ్వను ఇక… అందరికీ ఓ బెటర్ ఫాదర్‌గా ఉండాలని ఉంది… కానీ నా 34 మంది పిల్లల్ని నేనింకా కలుసుకోలేదు… (ఆ పేరెంట్స్ వీర్యదాత వివరాలను గోప్యంగానే ఉంచుకున్నారు… కొందరు ఆ వివరాల్ని వెల్లడించడానికి ఇష్టపడరు)…

56 మంది న్యూయార్క్‌లో, 20 మంది న్యూజెర్సీలో, 13 మంది కనెక్టికట్‌లో ఉంటారు… వాళ్లందరితోనూ టచ్‌లో ఉంటాను… కొందరు తల్లులు నేను ఆ పిల్లల జీవితాల్లో కనిపించడం ఇష్టముండదు, కానీ పిల్లలు పెరుగుతూ ప్రశ్నలు అడగడం మొదలెడితే వాళ్ల మనస్సులు మార్చుకుంటారేమో… అంటున్నాడు నాగెల్… ఫాదర్స్ డే సందర్భంగా ఈ మీడియా ఈ స్పెర్మినేటర్ ఫాదర్ గురించి ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది… అదీ కథ… మన దేశంలో ఈ కథను ఎక్స్‌పెక్ట్ చేయలేం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions