Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈయన ఆస్తి రూ.1700… గత ఎన్నికల్లో ఖర్చు రూ. 14.75 లక్షలు…

July 25, 2023 by M S R

నిజమే ఏదో వార్తలో చెప్పినట్టు… ఒక ఊరికి సర్పంచి కావాలన్నా… అంతెందుకు వార్డు సభ్యుడు కావాలన్నా లక్షల్లో ఖర్చవుతోంది… గ్రామ స్థాయి నాయకుడు అంటేనే అట్టహాసాలు, ఆడంబరాలు, ఆస్తులు, అనుచరులు ఎట్సెట్రా… కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఎన్నికల సంఘానికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు సమర్పించిన ఆస్తులు, అప్పుల లెక్కల్ని క్రోడీకరించింది… పశ్చిమ బెంగాల్, ఇండస్ నియోజకవర్గ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ అత్యంత పేద ఎమ్మెల్యేగా తేలింది… ఎంత అంటే, మరీ నమ్మలేనంత…

తనకు ఇల్లు లేదు… కారు లేదు… అప్పుల్లేవు… ఆస్తుల్లేవు… చేతిలో ఉన్న 1700 రూపాయల్నే అఫిడవిట్‌లో చూపించాడు… బీమా పథకాలు లేవు… ట్యూషన్లు చెప్పడం తన వృత్తి… భార్య అనురాధ, బిడ్డ అన్వేషల పేర్లతో కూడా ఆస్తులేమీ లేవు… ఇదీ ఆయన ఇచ్చిన అఫిడవిట్… తనపై క్రిమినల్ కేసులు కూడా ఏమీ లేవు… MSc చదివాడు… https://myneta.info/WestBengal2021/candidate.php?candidate_id=359

nirmal kumar

Ads

వోకే, వోకే… మరి రెండో అతి పేద ఎమ్మెల్యే ఎవరు..? ఆయన ఒడిశాకు చెందిన రాయగడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే… పేరు మకరంద ముదిలి… ఈయన ఆస్తుల విలువ 15 వేల రూపాయలు… ఎంఏ, ఎల్‌ఎల్‌బీ… సోషల్ వర్కర్… ఈయనకు కూడా క్రిమినల్ కేసుల్లేవు, ఆస్తుల్లేవు, అప్పుల్లేవు, బీమా పథకాల్లేవు, సేవింగ్స్ ఏమీ లేవు… ఇదీ ఆయన అఫిడవిట్… https://myneta.info/odisha2019/candidate.php?candidate_id=4778

దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva kumar) నిలిచారు. రూ.1400 కోట్ల విలువైన ఆస్తులతో శివ కుమార్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. అఫ్‌కోర్స్, ఇది కేవలం అధికారిక ఆస్తి… శివ కుమార్ తర్వాతి స్థానంలో కర్ణాటకకే చెందిన ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1267 కోట్లు… వీళ్లను కాసేపు వదిలేస్తే… నిర్మల్ కుమార్ ఎంత ఖర్చు చేశాడో తెలుసా..?

6.4 లక్షలు ర్యాలీలు, బహిరంగసభల కోసం ఖర్చు… https://myneta.info/WestBengal2021/expense.php?candidate_id=359  స్టార్ క్యాంపెయినర్ ఖర్చు 82 వేలు… 1.26 లక్షలు ప్రచారసామగ్రి, లక్ష రూపాయల యాడ్స్, 2.88 లక్షలు వెహికిల్స్ ఖర్చు, 2.39 వర్కర్స్ కోసం ఖర్చు… 14.75 లక్షలు… (ఇందులో పార్టీ ఓవరాల్ స్టేట్ ఖర్చు నుంచి కొంత ఈయన పేరిట నమోదు చేస్తారు…) మరి 1700 రూపాయల ఆస్తి ఉన్న ఆయన ఇంత ఖర్చు ఎలా భరించాడు..? సింపుల్… ఈయన బీజేపీ అభ్యర్థి… పార్టీయే 15 లక్షలు ఇచ్చింది… పోనీ, ఇచ్చినట్టు చూపించారు అధికారికంగా… మరి మకరంద ముదిలి ఖర్చు ఎంత..?

ఆయన ఖర్చు 5.29 లక్షలు మాత్రమే… ఇండిపెండెంట్… ఏ పార్టీ తన ఖర్చు భరించదు కదా… మొత్తం స్నేహితుల నుంచి సమీకరించినట్టు చూపించాడు… ఈయన ఇచ్చిన యాడ్స్ విలువ 2600 రూపాయలు కాగా వెహికిల్స్ ఖర్చు 1.29 లక్షలు… https://myneta.info/odisha2019/expense.php?candidate_id=4778   సభలు, ర్యాలీల ఖర్చు 4.07 లక్షలు… ఈ ఇద్దరి ఆస్తులు, ఎన్నికల ప్రచార వ్యయం లెక్కలు ఇంట్రస్టింగు కదా… ఒక్కసారి మన రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగిన మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికల అధికారిక, అనధికారిక ఖర్చులు ఒక్కసారి మనసులోనే బేరీజు వేసుకొండి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions