Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

72 ఏళ్లు… ఆధునిక ఫోరెన్సిక్ దర్యాప్తుల్లో దిట్ట… సొంతంగా పెద్ద లేబరేటరీ…

March 11, 2023 by M S R

క్రైం ఇన్వెస్టిగేటర్ అంటే సినిమాల్లో ఎలా చూపిస్తారు..? మీరు చూసిన ఏవైనా క్రైం సినిమాల్లో పాత్రల్ని ఓసారి గుర్తుతెచ్చుకొండి… నేను మరో భిన్నంగా కనిపించే వ్యక్తిని… అదీ మహిళను… వయస్సు మళ్లిన వ్యక్తిని చూపిస్తాను…

ఆమెకు 72 ఏళ్ల వయస్సు… రుక్మిణి కృష్ణమూర్తి ఆమె పేరు… మెత్తగా మాట్లాడుతుంది… తల్లిలా కనిపిస్తుంది… సంప్రదాయిక చీరె కట్టుకుని, నొసట బొట్టు పెట్టుకుని, తనకు తగిన ఏదో నగ కూడా ధరించి కనిపిస్తుంది… పొడుగైన రూపం… నేను వెళ్లినప్పుడు నీలం రంగ చీరె కట్టుకుంది… ఓ పాపిట… మధ్యలో సిందూరం, రెండు బంగారు గాజులు, ఓ ముత్యాల నెక్లెస్…

ఇంత సంప్రదాయంగా కనిపిస్తుంది కానీ ఆమె వృత్తి దానికి భిన్నం… ఇండియన్ క్రిమినల్ ఫోరెన్సిక్ సర్కిళ్లలో ఆమెకున్న పేరు పెద్దదే… మహారాష్ట్రలో టాప్ టెన్ క్రైం ఇన్వెస్టిగేటర్ల జాబితాలో ఉంటుంది… 93 బాంబే పేలుళ్లు, తెల్గీ స్టాంపు కుంభకోణం, 26/11 అటాక్స్, నాగపూర్ నక్సలైట్ మర్డర్ కేసు, కింగ్ ఫిషర్- ఎయిర్ లైన్ స్కామ్ వంటి బడా కేసులే గాకుండా బోలెడు గ్యాంగ్‌స్టర్ల కేసులు, కట్నం హత్యలు, అత్యాచారాలు, హత్యలు… ఎన్నో సాల్వ్ చేసిందామె…

50 ఏళ్ల క్రితం ఆమె కెరీర్ స్టార్టయింది… అనలిటికల్ కెమిస్ట్రీలో పీజీ చేసింది, తరువాత పీహెచ్డీ చేసింది… మహారాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీల డైరెక్టరేట్ బాస్ కుర్చీ దాకా తీసుకుపోయాయి అవి… 1993 బాంబే బ్లాస్ట్స్ దర్యాప్తులో ఈ లేబ్స్ కనిపెట్టిన అంశాలు ఇంటర్ పోల్ దర్యాప్తు అంశాలతో సరిగ్గా సరిపోలాయి… అదొక ఉదాహరణ…

2012లో రిటైరైంది… కేవలం సర్కారీ కొలువు నుంచే, వృత్తి నుంచి కాదు… సొంతంగా ప్రైవేట్ ఫోరెన్సిక్ లేబ్ పెట్టుకుంది… హెలిక్ అడ్వయిజరీ… ఇలాంటిది దేశంలోనే తొలిసారి… ‘‘ప్రభుత్వ ఫోరెన్సిక్ లేబ్స్ కేవలం పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థల కేసులే పరీక్షిస్తుంటాయి… కానీ మా లేబ్ ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఫిర్యాదులను కూడా సాల్వ్ చేస్తుంటుంది…’’ అంటుందామె…

‘‘ఓ పెద్ద ఫార్మా కంపెనీ నుంచి మేధోపరమైన అంశాలు బయటికి లీకయ్యాయి… వాళ్లకు భారీ నష్టం… మమ్మల్ని అప్రోచయ్యారు… 100 మంది కీలక విభాగాల్లో పనిచేస్తారు… అందరికీ లై డిటెక్టర్ పెట్టాం… ఆరుగురు సందేహాస్పదంగా తేలింది… తరువాత విచారిస్తే వాళ్లే దోషులని తేలింది… ఎవరికి ఏ ఆధునిక జ్ఞానాన్ని వాడాలో మనకు తెలియాలి…

ఇప్పుడు నేరాలు ఎక్కువగా సైబర్ రిలేటెడ్… సో, మా పనితీరు కూడా ఇప్పుడు ఎక్కువగా ఆ పరిజ్ఞానంపైనే కేంద్రీకరిస్తున్నాం… బ్యాంకు మోసాలు, ఆర్థిక నేరాలు వంటి కొత్త తరహా మోసాలతో నేరస్తుల స్ట్రాటజీలు వేగంగా మారిపోతున్నాయి…’’ అని చెప్పిందామె… తన నేతృత్వంలో మహారాష్ట్రలో 2002 నుంచి 2008 మధ్యలో ఆరు అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ లేబ్స్ ఏర్పాటు చేశారు…

వాటిల్లో డీఎన్ఏ టెస్టింగ్, సైబర్ ఫోరెన్సిక్, స్పీకర్ ఐడెంటిఫికేషన్, టేప్ అథెంటికేషన్, లై డిటెక్టర్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ సిగ్నేచర్ ప్రొఫైలింగ్… ఇలాంటి పద్ధతులన్నీ సమకూరాయి… ఈమె110 రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేసింది… 12 నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులొచ్చాయి… ముంబైలో ఓ కార్పొరేట్ ఫోరెన్సిక్ ట్రెయినింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది…

‘‘టీవీ షోలు, మూవీస్‌లో కథలన్నీ క్రైం ఇన్వెస్టిగేషన్ మీద మిస్‌లీడింగ్… నిజానికి చాలాదూరంలో ఉంటాయి… ఇప్పుడిప్పుడే కొందరు దర్శకులు వచ్చి, తమ సందేహాలు తీర్చుకుని వెళ్తుంటారు… త్వరలో ఈమె బయోపిక్ రాబోతోంది… గుడ్… 72 వయస్సులో ఇంకా క్రైమ్ ఫైల్స్ ముందర వేసుకుని కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ కనిపించే ఆమె ఖచ్చితంగా ఓ అభినందనీయమైన వ్యక్తి…!! (టైమ్స్ సౌజన్యంతో…)

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
  • హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…
  • జగన్ భయ్యా… రాష్ట్ర పరిస్థితులన్నీ ఏమిటిలా ఎదురుతంతున్నాయ్…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions