Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి అభిమానుల్లో ఎందరికి తెలుసు తన తొలినాళ్ల సినిమా..!?

November 7, 2024 by M S R

.
చిరంజీవి అభిమానుల్లో ఎంత మంది చూసారు జూన్ 1979 లో వచ్చిన ఈ ఐలవ్‌యూ సినిమాను !? చిరంజీవి సినీ రంగంలో నిలదొక్కుకోవటానికి కుస్తీ పట్టుతున్న రోజుల్లోని సినిమా . 1978 లో మూడు సినిమాలు నటిస్తే రెండే రిలీజయ్యాయి . మూడోది పునాదిరాళ్ళు 1979 లో రిలీజయింది . మరో ఏడు సినిమాలు కూడా 1979 లో రిలీజయ్యాయి . ఆ ఏడింటిలో ఒకటి ఈ ఐలవ్‌యూ సినిమా .

తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి తీసారు . కన్నడంలో అనంతనాగ్ చిరంజీవి పాత్రను వేసారు . హీరోయినుగా రెండు భాషల్లోను సువర్ణే నటించింది . 1978 లో ఏంగ్రీ యంగ్ మేన్ గా నటించిన చిరంజీవి 1979 , 1980 లలో ఎక్కువగా నెగటివ్ హీరోల పాత్రల్నే వేసారు . ఈ ఐలవ్‌యూలో కూడా నెగటివ్ హీరోనే .

ధనవంతుడు , జల్సారాయుడు , స్త్రీలోలుడు హీరో . కుటుంబాన్ని పోషించుకోవటానికి భరతనాట్యం నేర్చుకున్న ఓ మధ్య తరగతి అమ్మాయి హోటల్లో మోడరన్ డాన్సరుగా పనిచేస్తుంటుంది . ఆ అమ్మాయిని మభ్యపెట్టి కోరిక తీరాక వదిలేస్తాడు హీరో . హీరోయిన్ హీరోకు బుధ్ధి చెప్పి దారిలోకి తెచ్చుకుంటుంది . టూకీగా ఇదీ కధ .

Ads

మొదటి నుండీ చిరంజీవి బాగానే నటిస్తూ వచ్చారు . ఈ సినిమాలో కూడా నెగటివ్ హీరోగా , ప్రమాదంలో కాళ్ళు పడిపోయాక ఎమోషనల్ గా బాగా నటించారు . డాన్సుల గురించి చెప్పేది ఏముంది ! హీరోయిన్ గా సువర్ణ బాగా నటించింది . (తెలుగు, కన్నడ సినిమాల్లో కనిపించిన ఈ నటి గురించిన వివరాలు పెద్దగా తెలియవు- దొరకలేదు…)

ఇతర పాత్రల్లో ప్రసాద్ బాబు , కాకరాల , పి యల్ నారాయణ , సాక్షి రంగారావు ప్రభృతులు నటించారు . ప్రసాద్ బాబుది కీలక పాత్ర . చాలా బాగా నటించారు . చిరంజీవి , ప్రసాద్ బాబు , నారాయణరావు , హరిప్రసాద్ వీరందరూ చిత్రరంగంలో ఒకే సారి తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన వాళ్ళు .

యస్ భావనారాయణ సమర్పణలో వాయునందనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సంగీత దర్శకత్వాన్ని సత్యం అందించారు . సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కల చిరంజీవి అభిమానులు చూడవచ్చు . 1979 నుండి చిరంజీవి సినిమాలు ఆనాటి అగ్ర హీరోలతో సమానంగా వచ్చాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘తెలుగు మందు’ సీసా ‘అందుబాటు’ సైజుల్లో… ఖజానాకు మరింత కిక్కు…
  • పెద్ది… నటుడిగా రాంచరణ్‌‌కు పేరొస్తుంది… నిర్మాతకు డబ్బులొస్తాయి…
  • బెంగాల్ షిండే..! ఎవరు ఈ రితాబ్రత బెనర్జీ..? ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
  • తులం బంగారమూ అమ్మలేదు… రిజర్వ్ బ్యాంకు స్పష్టీకరణ…
  • తప్పో ఒప్పో… మాస్టారిని ఆరాధించటం… చివర్లో ప్రేక్షకుల చేత కంట తడి…
  • ‘మావోడి ధర్మ నిర్మూలన వ్యాఖ్యల్ని క్షమించి, వాడిని కాపాడు తల్లీ…’
  • లక్ష కోట్ల బంగారం అమ్మేశాడా మోదీ..! బ్లూమ్‌బర్గ్ కథనం- వార్తలు…
  • కళ్లు పొడిచే LED కాంతి..! రాత్రి ప్రయాణం ప్రాణాంతకమేనా..?
  • కాలం ఎవరినీ క్షమించదు… ఒక మమత పతనం, ఒక గుణపాఠం!
  • ఏ వర్ణం ఎవడబ్బ సొత్తు..? తమిళనాట ఓ ‘రంగు రాద్ధాంతం’..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions