.
నడమంత్రపు సిరి అనే పదం వాడొచ్చో లేదో తెలియదు… ఈ సిరి మనిషిని ఎటో తీసుకుపోతుంది… ఆ సిరి సంపద ప్రదర్శన ఉబలాటానికి, తన సర్కిల్‌లో తానే వెరీ వెరీ అప్పర్ హ్యాండ్ అనే ఎగ్జిబిషనిజానికి దారి తీస్తుంది… ఇలాంటివాళ్లు సమాజంలో బోలెడు మంది… మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి ఎగ్జిబిషన్ కూడా ఇదే కోవలోకి వస్తుందా..? విజ్ఞులు చెప్పాలి…
అప్పుడెప్పుడో సాదాసీదా కంట్రాక్టర్ తను… తనకు నాయకులను ఎలా పట్టుకోవాలో తెలుసు… నాయకుల్ని ఎలా కొట్టాలో తెలుసు… ఏం చేస్తే వరదలా కంట్రాక్టులు వచ్చిపడతాయో తెలుసు… దాంతో ఎడాపెడా కంట్రాక్టులు వచ్చిపడ్డాయి… భిన్న రంగాల్లోకి వ్యాపారం విస్తరించాడు… వేల కోట్లకు ఎదిగాడు… ఇండియా రిచ్చెస్ట్ జాబితాలోకి చేరాడు…
Ads
మీరు చూస్తూ ఉండండి… ఆదానీ, అంబానీలు కూడా కుళ్లుకునే స్టేజ్‌కు వెళ్తాడు… స్టేట్ నుంచి సెంటర్ దాకా ప్రభుత్వాలు, నాయకులు అందరూ తన అస్మదీయులే కదా… సరే, సంపద ప్రదర్శన దగ్గరకొద్దాం… మొన్న మెట్ గాలా వేదిక మీద ఆమె 142 కోట్ల నగలతో కనిపించింది… చేతి వేళ్లకు కోట్ల విలువైన 30, 23 క్యారెట్ల రెండు డైమండ్ రింగ్స్…
మనీష్ మల్హోత్రా అని ఓ ముంబై సెలబ్రిటీ డిజైనర్ ఉన్నాడు తెలుసు కదా… తను ట్రీ ఆఫ్ లైఫ్ డ్రెస్ రూపొందించాడు… ఈ డ్రెస్ తయారీకి 90 మంది కళాకారులు 3400 గంటలు శ్రమించారట… ఎందుకీ ప్రయాస..? ఎందుకీ వ్యయం..? జస్ట్, కాసేపు ఆ ఫ్యాషన్ వేదిక మీద తళుక్కుమనడానికి..?
ఇదే డబ్బుతో ఎందరు పేదల జీవితాల్లో కాంతులు తీసుకురావచ్చు… కానీ దానికి మానవతా దృక్పథం కావాలి… మనసులో కాస్త తడి ఉండాలి… కృత్రిమమైన రంగుల హంగులపై మోజు కాదు… సుధారెడ్డిలో అది లేదు… ఇకపై రాదు… అట్టహాసం, ఆడంబరం, అతి విలాసం…

ఆమె మెడలోని నెక్లెస్ విలువ 100 కోట్లు… టాంజానియాలోని మెరెలాని పర్వతాల నుంచి సేకరించిన 550 క్యారెట్ల ‘క్వీన్ ఆఫ్ మెరెలాని’ అనే ముదరు వయోలెట్ డైమండ్ ఉందట ఆ నెక్లెస్‌లో… ‘నా కల్చర్ ప్రదర్శించే అభిరుచి ఇది’ అని చెప్పుకుందట… ఏదో విఫల సమర్థన…
అసలు ఇప్పుడే కాదు, ఆమె అభిరుచి మొత్తం ఫ్యాషన్ షోలే… సుధా రెడ్డి 2021లో మొదటిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించింది… అప్పట్లో కూడా ఆమె ప్రముఖ డిజైనర్ ఫాల్గుణి అండ్ షేన్ పీకాక్ రూపొందించిన ఖరీదైన దుస్తుల్లో కనిపించింది… కోట్లకుకోట్ల ఖర్చు…

పారిస్ హౌట్ కోచర్ వీక్ (Paris Haute Couture Week)…: పారిస్‌లో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్‌లో ఆమె క్రమం తప్పకుండా పాల్గొంటుంటుంది… అంతర్జాతీయ డిజైనర్ల ప్రదర్శనల్లో ఆమె ఫ్రంట్ రోలో కనిపిస్తుంటుంది… కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) వేదికపై కూడా ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌తో కనిపించింది… ప్చ్, డబ్బు సంపాదించడం కాదు… సంపాదనలో కొంత భాగాన్ని సొసైటీ కోసం వెచ్చించడం, తనకు ఎంతో ఇచ్చిన సమాజానికి కొంత ఇవ్వాలనే తపన కనబడాలి… మేఘా కృష్ణారెడ్డిలో ఏమాత్రం కనిపించని గుణం ఇది..!!
Share this Article