గత సీజన్‌లో ముందుగా పృథ్వి ఎలిమినేట్ అయినట్టు ముందుగా లీకులు… జస్ట్, ముందుగానే ఎలిమినేషన్ల గురించి రాసేస్తున్న మీడియాను తప్పుదోవ పట్టించడానికి … నిజానికి లీస్ట్ వోటింగుల్లో ఉన్నది గౌతమ్, మణికంఠ…
నేనే పోతా నేనే పోతా అని ఏడ్చాడు కదా మణికంఠ, సరే పో అని పంపించేశారు హౌజు నుంచి… ఈసారీ అంతే… నిన్న మధ్యాహ్నం నుంచే లీకులు… నయని పావని ఎలిమినేట్ అయిపోయింది అని… గతంలో తొలి వారమే ఎలిమినేట్, ఈసారీ అంతే త్వరగా వెళ్లిపోతోంది అని విశ్లేషణలు కూడా…
నిజానికి ఈవారం వోటింగ్ సరళి చూసినప్పుడు… నిఖిల్, ప్రేరణ టాప్‌లో ఉన్నారు… విష్ణుప్రియ మధ్యస్థం… ఎటొచ్చీ పృథ్వి, నయనిపావని, మెహబూబ్ కాస్త ఇటూఅటూ సేమ్ వోటింగుల్లో ఉంటున్నారు మొదటి నుంచీ… శుక్రవారం రాత్రి వచ్చేసరికి పృథ్వి కూడా కాస్త సేవ్ అయినట్టుగా… నయనిపావని, మెహబూబ్ మాత్రమే ఎలిమినేషన్ కోసం పోటీపడుతున్నట్టుగా మారింది… (దిగువ ఉన్నది గురువారం వోటింగు)
Ads
దాదాపు అన్ని అనధికార పోల్స్‌లోనూ నయని పావని, మెహబూబే దిగువ స్థానాల్లో ఉన్నారు… నయనిపావని పేరు లీక్ చేసి, చివరకు మెహబూబ్‌ను ఎలిమినేట్ చేశారు… నిజానికి మెహబూబ్ మీద హౌజులో నెగెటివిటీ ఉంది… బయట కూడా అంతే…
పైగా కమ్యూనిటీ వోట్లు విపరీతంగా పడతాయనే మాట తనకు మైనస్ అయినట్టుంది… ఎవరైనా సరే ఆట చూస్తారు… అందుకే మెహబూబ్ నమ్మకం, ఆశ, ధీమా నెరవేరకుండా పోయాయి… పైగా తను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పటి నుంచీ పెద్దగా ఇంప్రెసివ్ పర్‌ఫార్మెన్స్ ఏమీ లేదు… అఫ్‌కోర్స్ నయని పావని కూడా అంతే…
ఏమో… నయని, మెహబూబ్‌కు దాదాపు సేమ్ వోట్లు వచ్చినా సరే… గతంలో ఆమెకు అన్యాయం జరిగిందనే ఫీలింగ్ కొంత బిగ్‌బాస్ టీమ్‌లో ఉందేమో… ఆ స్వల్పమైన ఎడ్జ్ ఆమెను సేవ్ చేసి, మెహబూబ్ ఎలిమినేట్ కావడానికి కారణమైందేమో..!
ప్రతి శనివారం షోలో నాగార్జునకు అందరికీ క్లాస్ పీకడమే పని కదా… ఇప్పుడూ అదే చేశాడు… కాకపోతే పెద్ద సీరియస్ విమర్శలు లేవు ఈసారి ఎవరి మీదా… కంగువ ప్రమోషన్ కోసం సూర్య వచ్చాడు… తన మాటతీరు, బాడీ లాంగ్వేజీ నచ్చుతాయి… డౌన్ టు ఎర్త్ కనిపిస్తాడు… తను ఉన్నంతసేపూ షో బాగనిపించింది… ఆదివారం దీపావళి స్పెషల్…
అమరన్ టీమ్ ప్రమోషన్ కోసం వచ్చినట్టుంది… సాయిపల్లవి వస్తుంది కదా… అదొక ఆకర్షణ… క సినిమా ప్రమోషన్, దుల్కర్ సల్మాన్ రాక… సహజంగానే పండుగ స్పెషల్ కాబట్టి కాస్త అట్టహాసం, ఆడంబరం, ఫన్, డాన్సులు ఎట్సెట్రా ఉంటాయి కదా… చూద్దాం…
Share this Article