Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెయిజగన్… సత్యం సుందరం… మనవాళ్లకు కనెక్టయితే దేవరకు దెబ్బే..!!

September 27, 2024 by M S R

Meiyazhagan… అంటే తమిళంలో స్వీట్ హార్ట్… అమృత హృదయం… తెలుగులో మంచి టైటిల్ ఏదీ స్ఫురించనట్టుంది… మరీ కొన్ని తమిళ సినిమాల పేర్లను యథాతథంగా తెలుగులోనూ పెట్టేసినట్టు మెయిజగన్ అని పెట్టేయలేదు… సంతోషం… సత్యం సుందరం అని తెలుగులో టైటిల్ పెట్టారు…

96 అని ఆమధ్య ఓ సినిమా వచ్చింది తెలుసు కదా… దర్శకుడు ప్రేమ కుమార్… విజయ్ సేతుపతి, త్రిష ప్రధానపాత్రలు… ప్రేక్షకుడిని సున్నితమైన నాస్తాల్జిక్ అనుభూతుల్లోకి తీసుకెళ్లిన ఎమోషనల్ మూవీ… తెలుగులో కూడా ఎవరో రీమేక్ చేశారు గానీ సమంత, శర్వానంద్ కావచ్చు… కానీ తెలుగు ప్రేక్షకుడికి పెద్దగా ఎక్కలేదు…

ఇప్పుడెందుకు చెప్పుకోవడం అంటే… మెయిజగన్ సినిమా దర్శకుడు ఆ ప్రేమ కుమారే… తన పంథా డిఫరెంట్… తొక్కలో పాటలు, అడ్డమైన ఫైట్లు, బిల్డప్పులు, ఫార్ములా కథాకథనాలకు భిన్నంగా సినిమాను నడిపిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు కదా… ఇదీ ఆ తరహాలోనే ఉందట…

Ads

తమిళంలో కొన్ని ప్రీమియర్లు వేస్తే, మంచి టాక్ స్ప్రెడ్ అవుతోంది… మన రూట్స్, మన కల్చరల్ స్టాండర్డ్స్, సున్నితమైన ఎమోషన్స్‌తో సినిమా బాగా వచ్చిందనే బజ్ క్రియేటైంది… ఇది హీరో కార్తి సినిమా… తన అన్నావదినలు, అంటే సూర్య, జ్యోతిక నిర్మించిన సొంత సినిమా… దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తారు, ఇచ్చారు…

దీనికితోడు అరవింద్ స్వామి… అప్పట్లో రోజా తరువాత ఆ రేంజులో తనకు దొరికిన మంచి పాత్ర అంటున్నారు… అరవింద్ స్వామి హైలైట్ అయ్యే పాత్ర అయినా సరే కార్తి తనతో పోటీపడటానికే ప్రయత్నించాడు తప్ప అడ్డుకోలేదు… ఫీల్ గుడ్ డ్రామా… మొదట్లో ఏమో గానీ కార్తి సినిమా సినిమాకు కాస్త నటనను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు…

ఇప్పుడింతా ఎందుకు అంటే..? రేపు సత్యం సుందరం రిలీజు… ఒకవైపు ఈరోజు విడుదలైన జూనియర్ ఎన్టీయార్ సినిమా దేవరకు మిక్స్‌డ్ టాక్… మార్కెట్‌లో పెద్ద సినిమాలేవీ లేవు… ఒకవేళ సత్యం సుందరం సినిమాకు ఏమాత్రం మంచి మౌత్ టాక్ వచ్చినా సరే, దేవరకు పిడిపడ్డట్టే… తమిళం, మలయాళం భాషల్లో మాత్రమే కాదు… తెలుగులో కూడా…

ఎక్కువ రేట్లు, ఎక్కువ థియేటర్లు, ఎన్టీఆర్ అంటే క్రేజుతో సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందేమో గానీ… సత్యం సుందరంతో పోలిక వస్తుంది… మరోసారి తమిళ, తెలుగు ఇండస్ట్రీల సినిమా పోకడల మీద డిబేట్ జరుగుతుంది… ఎమోషన్ బేస్డ్ కథాకథనాలు కాబట్టి, ప్రేమకుమార్ దర్శకత్వ ప్రతిభ మీద ఆల్రెడీ మనకు 96 ఉదాహరణ ఉంది కాబట్టి… తెలుగు ప్రేక్షకుడు గనుక కనెక్టయితే దేవరకు దెబ్బే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…
  • పెద్ద థ్రిల్ ఏమీ లేదు… సినిమా మొత్తం చూడాల్సి రావడమే ఓ హారర్…
  • ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనగా… ప్రయోగశాలల్లో పెంచబడిన వజ్రాలు…
  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions