Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

25 ఏప్రిల్ 2026… ఐపీఎల్ హిస్టరీలో స్పెషల్ డే… ఎందుకో తెలుసా..?

April 26, 2026 by M S R

.

ఏప్రిల్ 25, 2026… ఈ తేదీ ఐపీఎల్‌లో స్పెషల్‌గా గుర్తుంటుంది… నిన్నటి మ్యాచులు చూసిన క్రికెట్ ప్రేమికులకు తెలుసు ఈ విశేషాలు, ఈ తేదీ ప్రాధాన్యత… జీవం లేని పిచ్‌ల మీద బ్యాటర్లు చెలరేగిపోగా, బౌలర్లకు సింహస్వప్నంగా మిగిలింది ఈ తేదీ… చివరకు గాయపడిన బౌలర్ Lungi Ngidi కోసం అంబులెన్స్ వచ్చింది…

39 ఓవర్లలో (పంజాబ్, ఢిల్లీ జట్ల నడుమ) 529 రన్స్… టీ20 హిస్టరీలోనే హయ్యెస్ట్ ఛేజ్… ఢిల్లీ కేపిటల్స్ 264 రన్స్ చేస్తే, ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా అన్ని లీగ్ మ్యాచులు గెలుస్తున్న పంజాబ్ దాన్ని ఛేదించింది… రికార్డు… అంతకుముందు కూడా 2024లో పంజాబ్ జట్టు 262 పరుగుల టార్గెట్ ఛేదించింది… కేకేఆర్‌పై… 2025లో ఇదే పంజాబ్ 245 రన్స్ చేస్తే దాన్ని హైదరాబాద్ ఛేదించింది…

Ads

నిన్న రెండు మ్యాచులు జరిగాయి… 1) పంజాబ్, ఢిల్లీ  2) రాజస్థాన్, హైదరాబాద్… ఈ రెండో మ్యాచులో కూడా తక్కువ పరుగులు ఏమీ రాలేదు… రాజస్థాన్ 228 రన్స్ చేస్తే, దాన్ని హైదరాబాద్ అలవోకగా ఛేజ్ చేసింది… రెండు మ్యాచుల్లోనూ కలిసి మొత్తం 986 రన్స్ (77.2 ఓవర్లు)… అందుకే నిన్నటి రోజు ఐపీఎల్, టీ20 హిస్టరీలో గుర్తుండిపోతుంది… 2024 ఏప్రిల్ 27న 899 రన్స్ పాత రికార్డు…

నిన్న కేఎల్ రాహుల్ 152 (67) రన్స్ చేశాడు… నాటౌట్… ఐపీఎల్ చరిత్రలో ఒక ఇండియన్ క్రికెటర్ వ్యక్తిగత అత్యధిక స్కోర్ ఇది…

ఒకేరోజు దాదాపు 15 క్యాచ్ డ్రాప్స్… ఇదీ ఓ రికార్డే… పరుగుల సునామీలో, బ్యాటర్లు ఎక్కువగా భారీ షాట్లకే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇన్ని డ్రాప్స్… ప్రత్యేకించి కరుణ్ నాయర్ రెండుసార్లు శ్రేయాస్ అయ్యర్ క్యాచులు డ్రాప్ చేసి, ఆ మ్యాచ్‌నే మలుపు తిప్పాడు… రవీంద్ర జడేజా కూడా ఓ సింపుల్ క్యాచ్ మిస్ చేసి ఆశ్చర్యపరిచాడు…

నిన్న ప్రభ్‌సిమ్రన్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు ఫోర్లు కొట్టాడు… అరుదైన రికార్డ్ ఇది… అంతకుముందు 2012లో అజింక్య రహానే, 2021లో పృథ్వి షా ఈ రికార్డులు నమోదు చేశారు… ముగ్గురూ ఇండియన్ ప్లేయర్లే…

నిన్న ఫస్ట్ ఓవర్‌లోనే వైభవ్ సూర్యవంశీ నాలుగు సిక్సులు బాదాడు… అంతకుముందు 2025లో రియాన్ పరాగ్ ఒకే ఓవర్‌లో అయిదు సిక్సులు కొట్టిందే రికార్డు…

37 బాల్స్‌తో సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ చరిత్రలో ఒక ఇండియన్ క్రికెటర్ సాధించిన వేగవంతమైన సెంచరీ ఇది…

ఒకేరోజు 59 సిక్సులు నమోదయ్యాయి నిన్న… ఇది ఓ రికార్డు… ఇందులో వైభవ్ బాదిన సిక్సుల సంఖ్య 12…

ఒకే ఓవర్‌లో నితిష్ రాణా ఏకంగా 28 పరుగులు చేశాడు, ఇదీ రికార్డే… 6,4,4,4,4,6 … పాపం, దానికి గురైన బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ … చివరకు తనే ఔట్ చేశాడు…

ఒకేరోజు 96 ఫోర్లు (రెండు మ్యాచులూ కలిపి) … ఇదీ రికార్డే… ఇందులో కేఎల్ రాహుల్ బాదినవే 16… ఇద్దరు సెంచరీలు చేస్తే, వాళ్ల జట్లు ఓడిపోయి, అవి వృథా అయిపోయాయి… (రాహుల్, వైభవ్)… ఇవీ గుర్తున్నవి… ఉద్దేశపూర్వకంగా ఎక్కువ రన్స్ కోసం, ప్రేక్షకుల కేకలు, జోష్ కోసం ఐపీఎల్ మ్యాచుల్లో జీవం లేని పిచ్‌లు ఎలా తయారు చేస్తున్నారో చెప్పటానికి ఏప్రిల్ 25, 2026 అనగా నిన్నటిరోజు ఓ ఉదాహరణ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 25 ఏప్రిల్ 2026… ఐపీఎల్ హిస్టరీలో స్పెషల్ డే… ఎందుకో తెలుసా..?
  • మన ప్రజావైద్యుడికి అరుదైన గౌరవం… ప్రౌడ్ ఆఫ్ యు డాక్టర్ సాబ్…
  • సర్పంచ్ సాబ్ @ శ్రేయాస్ అయ్యర్… నువ్వు నిజంగా తోపువురా…
  • కడుపు పంటలు కాదు… కన్న పిల్లలే కాటేసే విలన్లు… ఈ కథా అదే…
  • * కేసీఆర్ ఆత్మలేని ఓ మరబొమ్మ… తన చుట్టూ పందికొక్కులు…*
  • తెలుగుదేశం పార్టీ పదవులపై కేడర్‌లో కుతకుత… ఎందుకు..?
  • ఆప్ నుంచి బీజేపీకి షిఫ్ట్… అసలు గేమ్ ఏమిటి..?
  • చిన్న దూరాలకు ‘వందే’ భారత్ బెటర్… ఎందుకొచ్చిన ఫ్లయిట్ జర్నీలు…
  • ఓ ముసలి కేసు… ఇందులో న్యాయం లేదు, ఘనత అస్సలు లేదు…
  • RTC సమ్మె..! KCR అమానుషానికీ నేటి మానవీయతకూ ఎంత తేడా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions