వాడొక పిచ్చోడు… పేరుకు కమ్యూనిస్టు దేశం… కానీ అక్కడంతా నియంతృత్వమే… అదీ ఉన్మాదపు పోకడ… పిచ్చి ప్రభుత్వం… తలతిక్క రూల్స్… అనుమానమొస్తే వేటు వేయడమే… ఎవడూ దేశంలోకి రావొద్దు, ఎవడూ దేశం వదిలిపోవద్దు… అక్కడ ప్రజల పరిస్థితులేమిటో కూడా ఎవరికీ స్పష్టంగా తెలియవు…
ఎవరైనా కష్టమ్మీద ప్రాణాలు అరచేత పట్టుకుని బయటికి వచ్చి ఒకటీ అరా నోరువిప్పితే కాస్త తెలిసేది… అదీ ఎంత నిజమో కన్‌ఫరమ్ చేసేవాళ్లు కూడా ఉండరు… ప్రజల మీద విపరీతమైన ఆంక్షలు, తన విలాసాలకు వందల మంది చీర్ గరల్స్‌గా పేర్కొనబడే వేశ్యలు…
తెల్లారిలేస్తే దక్షిణ కొరియాతో వైరం, అమెరికాను గోకడం… ఇటు ఓ రౌడీ కంట్రీ పాకిస్థాన్‌తో దోస్తీ… అత్యంతాధునిక మిస్సయిళ్లు, అణుబాంబులు గట్రా పరీక్షిస్తూనే ఉన్నాడు… ఆ దేశ సొంత మీడియా పబ్లిష్ చేసే వార్తల్లో నిజమెంతో కూడా ఎవరికీ తెలియదు… చైనాకు ఇలాంటివాళ్లే కదా దోస్తులు.,. ఎస్, ఈ ఉత్తర కొరియా కిమ్ కూడా చైనాకు దోస్తే…
Ads
తాజాగా ఓ వార్త ఇంట్రస్టింగు అనిపించింది… తాలిబన్ల రాజ్యం అయితే ఆడవాళ్ల చదువు, వీడియోలు, ఫోటోలు గట్రా కుదరవు… ఇక్కడ మరో వైపు… ఫ్యాషన్ల మీద రూల్స్ ఉంటాయి, ఆంక్షలుంటాయి… ఉల్లంఘిస్తే తాట తీసేయడమే… చాలా గ్లోబల్ ఫ్యాషన్, పాపులర్ కాస్మెటిక్ బ్రాండ్లు ఉత్తర కొరియాలో నిషిద్ధం… ప్రత్యేకించి ఎర్రటి లిప్ స్టిక్ మీద పరిమితులున్నాయి…
అంటే వేరే షేడ్స్ వేసుకోవచ్చా అనడక్కండి అమాయకంగా… అసలు పెదాలకు ఎర్రటి లిప్‌స్టికే ముఖ్యం… నిజానికి ఎరుపు అంటే విప్లవానికి సంకేతం, చైతన్య వర్ణం కదా… ప్రపంచవ్యాప్తంగా ఎర్రదనాన్ని విముక్తి పోరాటాలకు ప్రతీకగా చెప్పుకుంటాం కదా… కానీ ఈ పాలకుడు కిమ్‌కు అది స్వేచ్ఛకు, నైతిక పతనానికీ ప్రతీక అట… ఇలాంటి ఆ దేశ సంస్కృతికి మచ్చలు అట…
అందుకని తమ దేశ మహిళలు లైట్ మేకప్ తప్ప దట్టంగా రంగు పూసుకుంటే, మరీ ప్రత్యేకించి ఎర్రెర్రని లిప్ స్టిక్ పూసుకుంటే బుక్కయిపోయినట్టే… టైమ్స్ నవ్ కథనం ఏం చెబుతున్నదంటే… ఈ ప్రభుత్వం మేకప్పుల పరిశీలనకు కూడా కొందరు ఉద్యోగులను నియమించిందట ప్రత్యేకంగా… వాళ్ల పని ఎవరైనా హద్దులు దాటి మేకప్పులు వేసుకున్నారా చూడటం, తాటతీయడం…
ఇదేకాదు, ఆ దేశపాలనలో హెయిర్ స్టయిల్ మీద కూడా రూల్స్ ఉన్నయ్… దాటితే గుండు గీకేస్తారు, అంటే భారీ జరిమానాలు తప్పవు అని… ప్రత్యేకించి మహిళలు పొడుగ్గా ఉంచకూడదు, ఇష్టమొచ్చినట్టు కట్ చేయించొద్దు, కొన్ని నిర్ణీత మోడల్స్‌లో మాత్రమే కట్ చేయించుకోవాలి… పురుషులకు 10, మహిళలకు 18 రకాల హెయిర్ స్టయిల్స్ మాత్రమే అనుమతిస్తారు… నా జుత్తు నా ఇష్టం అంటే, ఆ జుత్తున్న తలే ఎగిరిపోవచ్చు… చెప్పలేం… అదసలే ఉత్తర కొరియా మరి..!!
Share this Article