కొన్ని విశేషాలు చదువుతుంటే ఆశ్చర్యమేస్తుంది… అదితి అశోక్… ఒలింపిక్స్‌లో మరో భారతీయ యువకెరటం… గోల్ఫ్‌లో మొట్టమొదటి ఒలింపిక్స్ పతకాన్ని సాధించే భారతీయ మహిళ కాబోతున్నదనే ఆశ నెలకొంది ఇప్పుడు… నిజానికి ఆమె వరల్డ్ ర్యాంకింగ్ ఎంతో తెలుసా..? 200 స్థానం… ఒలింపిక్స్ ర్యాకింగ్ చూసుకున్నా తక్కువే… 45… అంతేకాదు, డబుల్ వీసా కోసం ఆమె పాస్‌పోర్టు చాలారోజులు కాన్సులేట్‌లో ఇరుక్కుపోయింది… మే నుంచి జూన్ నడుమ కరోనాతో బాధపడింది… కీలకమైన ప్రాక్టీస్ లోపించింది… అసలు ఈసారి ఒలింపిక్స్‌కు వెళ్లిన క్రీడాకారుల జాబితాలో ఉన్న అదితి పేరును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా… ఎందుకంటే..? ఆమె 2016 ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నది… 18 ఏళ్ల చిన్న వయస్సులోనే గోల్ఫ్ ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్న రికార్డు ఉంది, కానీ ఏ ప్లేసులో ఉండిపోయి, తిరిగి వచ్చేసిందో కూడా ఎవరికీ పట్టలేదు, అంత పూర్ పర్‌ఫామెన్స్… అలాంటి అదితి ఈసారి టోక్యోలో పతకం తెస్తుందని ఎవరైనా ఎందుకు అంచనా వేస్తారు…. కానీ సీన్ మారింది… ప్రకృతి కరుణిస్తే ఆమెకు రజతకం దక్కే చాన్సుంది… అదే మరి డెస్టినీ అంటే…
ఇప్పుడు రెండో ప్లేసులో ఉంది… వర్షసూచనల కారణంగా మరో రెండు రోజులు గనుక ఆట సాగకపోతే ఆమెకు పతకం ఖాయం… మరి ఆట సాగితే..? ‘‘ఏమవుతుంది..? రెండో ప్లేసు కాకపోతే, మూడు, లేదా నాలుగు… ఏదో ఒకటి… కానీ మన ప్రజలు ఇప్పుడు గోల్ఫ్ అనే ఆట గురించి కూడా చర్చించుకుంటున్నారు కదా… దీన్ని కూడా ఓ ఆటగా గుర్తిస్తున్నారు కదా… అది చాలదా ఏం…?’’ అంటున్నది నవ్వుతూ… నిజమే… ముందస్తు అంచనాల్లేవ్, అలాంటప్పుడు ఒత్తిడి ఏముంటుంది..? వాస్తవానికి అదితి స్టోరీ కాస్త ఇంట్రస్టింగే… ఈమెది బెంగుళూరు… తండ్రి గుడ్లమాని అశోక్… తల్లి మహేశ్వరి… అనుకోకుండా అయిదేళ్ల వయస్సు నుంచే ఆమె గోల్ఫ్ ఆట పట్ల ఆకర్షితురాలైంది… గోల్ఫ్ నేపథ్యమేమీ లేని సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్లది… ముందు సరదాగానే ఆమెను ఎంకరేజ్ చేసినా, తరువాత ఆమె దీన్నే కెరీర్‌గా ఎంచుకుంది… గోల్ఫ్ ఖరీదైన క్రీడ తెలుసు కదా… ఒక దశలో డబ్బు లేకపోవడంతో తన ఇంటిని తాకట్టు పెట్టాడు అశోక్… తనే క్యాడీగా ఆమె వెంట ఉండేవాడు… (క్యాడీ అంటే ప్లేయర్ వెంట ఉండి, బ్యాగులు ఎట్సెట్రా చూసుకునే వ్యక్తి)
Ads
ఈసారి క్యాడీ తండ్రి కాదు, తల్లి… నిజానికి ఆమె కెరీర్ మీద బాగా శ్రద్ధ చూపించేది తల్లే… రియో ఒలింపిక్స్ తరువాత కూడా అదితి పలు మంచి విజయాలు సాధించింది… కానీ గోల్ఫ్ ఆట మీద మనవాళ్లకు పెద్దగా ఆసక్తి ఉండదు… మీడియా గానీ, అధికారులు గానీ లైట్ తీసుకుంటుంటారు… అందుకే అదితిని కూడా ఎవరూ పట్టించుకోలేదు… మనవాళ్ల దృష్టి రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ మీద కాన్సంట్రేట్ అయి ఉంది… ఈమె సైలెంటుగా ఇప్పుడు సెకండ్ ప్లేసులోకి వచ్చి నిలబడింది… అసలే పతకాల కరువులో ఉన్నాం కదా, ఇదుగో ఇక్కడ ఓ పతకం వచ్చే చాన్స్ ఉంది అని తెలిసి ఇప్పుడు అకస్మాత్తుగా అందరి దృష్టీ అదితిపైకి మళ్లింది… ఆల్ ది బెస్ట్ అదితి… నమ్మ బెంగుళూరు, నమ్మ ఇండియా, నమ్మ అదితి..!! ನಮ್ಮ ಬೆಂಗಳೂರು, ನಮ್ಮ ಇಂಡಿಯಾ, ನಮ್ಮ ಅದಿತಿ..! @aditigolf
Share this Article