నో, నో, ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదట, కరోనాకు పనిచేయదట, అందుకని మేం తయారు చేయబోం, ఒకవేళ కేంద్రం అనుమతిస్తే అప్పుడు సీఎంతో మాట్లాడి ఆలోచిస్తాం…….. ఇదీ టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పత్రిక ప్రకటన… ఇది చదివాక ఆశ్చర్యం, ఆనందం, ఆందోళన, అనుమానం గట్రా చాలా ఫీలింగ్స్…. జగన్ ఈయన్ని కేవలం టీటీడీకి పరిమితం చేయడం పట్ల ఒకింత ఆనందం, ఇప్పటికీ ఆయన అదేతరహాలో మాట్లాడుతున్న తీరు పట్ల ఆశ్చర్యం… టీటీడీ పరిస్థితి పట్ల ఆందోళన… ఇలాగన్నమాట…. లేకపోతే ఏమిటిది..? ఆనందయ్య మందు ఆయుర్వేదం అని ఎవరు చెప్పారు ఈయనకు మొదట్లో..? ఈయన తెర మీద లేనేలేడు… చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కొందరు ఆయుర్వేద వైద్యుల్ని తనే తీసుకువెళ్లి చూపించాడు, మేం టీటీడీ తరఫున తయారు చేసి, ప్రజలందరికీ ప్రసాదంలాగా పంపిణీ చేస్తాం అన్నదీ తనే… అక్కడ ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి ఉన్నాడని మరిచిపోయినట్టున్నాడు…
టీటీడీ బోర్డు అంటేనే ఓ రాజకీయ పునరావాసం ప్లస్ ఆబ్గిగేషన్ల వేదిక… పైగా అక్కడ సుబ్బారెడ్డియే కాదు, ఎవరున్నా సరే… రోజుకు ఎందరొచ్చారు, ఎంత ఆదాయమొచ్చింది, ఎందరు గుండ్లు గీక్కున్నారు అనే లెక్కలు తప్ప.., నిజంగా జనం మెచ్చే ఈ ధార్మిక కార్యక్రమం తీసుకున్నామనే లెక్కలు, జన్మలు సార్థకం చేసుకునే చర్యలూ ఏమీ ఉండవు… కావాలంటే టీటీడీ రోజూ విడుదల చేసే సంక్షిప్త సందేశాలు చూడండి… మరీ పనిలేకపోతే హన్మంతుడు ఎక్కడ పుట్టాడనే నిష్ప్రయోజన వాదులాటలకు తెరతీస్తారు తప్ప, ఆనందయ్య మందు మీద అడుగులు ఎందుకు ఉంటయ్..?
Ads
సరే, అది ఆయుర్వేదం కాదు, కరోనాకు పనిచేయదు… అంతెందుకు దాన్ని అడ్డుకోవడానికి సాక్షాత్తూ ప్రభుత్వ న్యాయవాదే హైకోర్టులో తెగ వాదించాడు… అది తింటే బ్లాక్ ఫంగస్ వస్తుందని డౌటుందన్నాడు… నెల్లూరు జీజీహెచ్‌లో వందల మంది చికిత్స పొందుతున్నారు అన్నాడు… మరెందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినట్టు..? ఇన్నిరోజులూ ఆనందయ్యను పోలీసులు ఎటెటు తిప్పినట్టు..? ఎందుకు..? అది ఎవరూ అడగొద్దు… అడిగే అధికారాలు, ఆపే అధికారాలు లేని లోకాయుక్త ఏదో అనగానే ఠాట్, దీన్ని ఆపేయండి అనేసిన అదే జిల్లా కలెక్టర్ ఇప్పుడు తనే యాప్ పెడతాడట, ఆన్లైన్లో వేల మందికి మందు పంపిస్తాడట, ప్రతి జిల్లా కలెక్టర్‌కు కోటాలు పెట్టి మరీ మందు పంపిణీ చేస్తాడట… మరి అది మందే కానప్పుడు, కరోనాకు పనిచేయనప్పుడు ఇదంతా ఎందుకట..? (ఇది ఉచితంగానే పంచుతారా..? కొరియర్ చార్జీలు, మందు తయారీ ఖర్చు ప్రభుత్వ బాధ్యతేనా..? తెలియదు,…)
ఇవన్నీ సరే, కేంద్రం గనుక అనుమతిస్తే అప్పుడు సీఎంతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటుందట టీటీడీ… ఆయుష్ అనేది కేంద్ర పరిధిలోని సంస్థ కాదా..? రాములు అన్నీ చెప్పాడు కదా… ఇంకా ఏముంది చెప్పడానికి..? ఆనందయ్య మందును మేం ప్రతి జిల్లాకు పంపిణీ చేస్తాం అంటూనే… ఇదయితే కరోనాకు పనిచేయదు, ఆయుర్వేదం కాదు అనే ప్రచారం పదే పదే దేనికి..? అల్లోపతి మందులు వాడటం ఆపేయొద్దు, ఇది కేవలం ఓ సప్లిమెంట్ మాత్రమే అనే టాంటాంలు దేనికి..? అవునూ, ఈ మందు తింటే బ్లాక్ ఫంగస్ వస్తుందనే డౌట్లున్నాయని అన్నాడు కదా ఓ ప్రభుత్వ లాయర్… మరి మొదట్లో మందుకు కాలడ్డం పెట్టిన సదరు నెల్లూరు కలెక్టర్ గారికి ఈ డౌట్లు లేనట్టేనా ఇప్పుడు..? అన్నట్టు… ఈ మందు పంపిణీని ఆపేయాలని ఎవరైనా ఉత్తర్వులిచ్చారా..? ఇస్తే ఎవరు..? ఎందుకు..? హైకోర్టు కూడా అదే అడిగినట్టుంది… దీనికి జవాబు తెలుసుకోవాలని జనానికీ ఆసక్తిగా ఉంది…! తెలిస్తే బాగుండు…!!
Share this Article