.
కొన్ని ఆలయాల్లో మనకు అంతుపట్టని మిస్టరీలు… హేతువుకు అందవు… వాటిని మహిమలుగా నమ్మలేకపోవచ్చు మనం, కానీ అవెలా సాధ్యమో అర్థం కాదు… అలాంటి మిస్టరీల ఉదాహరణలన్నీ ఇక్కడ చెప్పుకోలేం గానీ… అలాంటి మరో విశేషాన్ని చెప్పుకుందాం…
జగన్నాథ దేవాలయం అంటే పూరి… అదే కదా మనకు గుర్తొచ్చేది… కానీ మరో విశేషమైన జగన్నాథ దేవాలయం ఉంది… అది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఉంది… బెహతా బుజుర్గ్ ఏరియాలో… ఉత్తరప్రదేశ్ రాజధాని నుంచి 120 కిలోమీటర్లు…
Ads
ఓ్ మామూలు గుడి… వాస్తు నిర్మాణం గట్రా చూస్తే మన ఊళ్లల్లో ఉండే ఓ చిన్న ఆలయంలా ఉంటుంది… కానీ దీని విశేషం ఏమిటంటే..? వర్షాల రాకను, మరీ ప్రత్యేకించి రుతుపవనాల రాకను సరిగ్గా అంచనా వేస్తుంది… అవును, మీరు చదివింది నిజమే… మన వాతావరణ శాఖలు, యాప్స్ చెప్పే వర్షం రాకడ అంచనాలు అనేకసార్లు బోల్తా కొడుతుంటాయి కదా… కానీ ఈ గుడి అంచనాలు తప్పడం అనేదే ఉండదు…
రైతులు కూడా దీన్నే నమ్ముతారు… గుడి చెప్పే అంచనాలను బట్టే విత్తనాలు వేయడం వంటి వ్యవసాయ పనులు స్టార్ట్ చేస్తుంటారు… వర్షం రాకను మాత్రమే కాదు, వర్షం ఎంత పడుతుందో కూడా సూచిస్తుంది… చాలావరకూ నిజాలు అవుతుంటాయి, అదీ విశేషం…
ఆలయంలో నీటి చుక్కలు (ఆలయం పైకప్పు నుంచి…) పడటం స్టార్టయితే రుతుపవనాలు వస్తున్నాయని అర్థం… అదీ రుతుపవనాల రాకకు వారం ముందు…
బౌద్ధవిహారం తరహాలో ఉండే ఈ గుడి గోడలు కూడా మరీ మందం… 14 అడుగుల మందం.,. ఆలయంలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి… ఈ విగ్రహాలు నల్లని జిగట రాతితో తయారు చేయబడ్డాయి… ఆలయ ప్రాంగణంలో సూర్య భగవానుడు, పద్మనాభం దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి… ఆలయం వెలుపల నెమలి మూలాంశం, చక్రం… ఈ ఆలయం హర్షవర్ధన చక్రవర్తి పాలనలో నిర్మించబడిందట…
నిజంగా గుడి ఎప్పుడు నిర్మించబడిందో పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఖరారుగా చెప్పడం లేదు… కాకపోతే పాత గుడికి మరమ్మత్తులు మాత్రం 11వ శతాబ్దంలో చేసి ఉంటారని అంచనాకు వచ్చారు…
ఆలయంలో నీటి బిందువు ఆకారాన్ని బట్టి వర్షం ఎంత కురుస్తుందో రైతులు ఓ అంచనాకు వస్తారు.., చుక్క ఎంత పెద్దదైతే అంత భారీ వర్షం కురుస్తుంది… ఆలయంలో నీటి చుక్కలు పడగానే రైతులు పొలం దున్నడం ప్రారంభిస్తారు… ఆలయం చాలా శిథిలావస్థలో ఉంది… సాధారణంగా స్థానిక ప్రజలు మాత్రమే దర్శనం కోసం ఆలయానికి వస్తారు…
ఆశ్చర్యకరంగా వర్షం ప్రారంభమైన వెంటనే పైకప్పు లోపలి భాగం ఎండిపోతుంది… పురావస్తు శాఖ శాస్తవ్రేత్తలు వచ్చి ఎన్నిసార్లు పరిశోధించినా ఆలయం ఎంత పాతదో, వర్షాలకు ముందు నీటి చుక్కలు ఎలా పడుతున్నాయో చెప్పలేకపోయారని ఆలయ పూజారి చెబుతున్నాడు… ఇంట్రస్టింగు…
Share this Article