.
ఛల్, మీరందరూ దేశం వదిలేసి పొండి… అసలు కొన్ని దేశాల వాళ్లను దేశంలోకే రానివ్వను… వీసాలు రద్దు చేయండి, అదుగో ఆ దేశం నాదే, ఆ కాలువ నాదే… వాడి ఎగుమతులపై పన్నులు వేస్తా, వీడికి ఎగుమతులే రద్దు చేస్తా… యుద్ధం మానకపోతే తాట తీస్తా……….. ఇలా చెలరేగిపోతున్నాడు కదా ట్రంపు…
ఏ సార్వభౌమ దేశమైనా ఎందుకు తలొగ్గుతుంది… తన పాదాల దగ్గర మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థిస్తుందా..? బాబ్బాబు, కాస్త దయ చూడు అని…! ఎహెపోరా, మీ దేశానికి మా దేశం ఎంత దూరమో, మాకూ మీరంతే దూరం అని స్పందిస్తుంది… అదే జరిగింది…
Ads
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ భలే స్పందించింది… ట్రంపుకి ఘాటు రిప్లయి ఇచ్చింది… అమెరికన్లను, ట్రంపును ఉద్దేశించి ఆమె మాటలు…
‘‘సో, మీరు ఓ గోడను నిర్మించడానికి వోటు వేశారన్నమాట… ప్రియమైన అమెరికన్‌లారా, మీరు అమెరికాను ఓ దేశంగా భావిస్తున్నారు తప్ప, ఓ ఖండంగా చూడటం లేదు… మీరు తలపెట్టిన, మీరు మీ చుట్టూ నిర్మించుకుంటున్న గోడకు ఇవతల 7 బిలియన్ ప్రజలున్నారని గుర్తుందా మీకు..?
ఐనా మీకు ప్రజలు అనే పదానికి అర్థం తెలిస్తే కదా… సరే, మీ భాషలోనే ‘వినియోగదారులు’ అని పిలుద్దాం… ఏమో… ఈ 7 బిలియన్ల ప్రజలు రెండు రోజుల్లో iPhones నుంచి Samsung లేదా Huawei బ్రాండ్లకు మారిపోవచ్చని తెలుసా మీకు..?
levi’s నుంచి Zara లేదా Massimo Dutti కి… ఆరు నెలల్లోనే… Ford, Chevrolet ల నుంచి Toyota, KIA, Mazda, Honda, Hyundai, Volvo, Subaru, Renault, BMW బ్రాండ్లకు మారిపోలేరా ఈ వినియోగదారులు..? నాణ్యతలో మరింత బెటర్ కదా ఇవి…
వీళ్లు Direct TV రద్దు చేసి పారేసి, హాలీవుడ్ చిత్రాలను చూడటం మానేసి… ఎంచక్కా లాటిన్ అమెరికా, యూరప్ నుంచి మెరుగైన చిత్రాలను ఎంచుకుంటారేమో… ఊహించండి… అవి మరింత గొప్ప కథనాలు, మెరుగైన సినిమాటోగ్రఫీని అందిస్తాయి తెలుసు కదా…
మీ డిస్నీని వదిలేసి, జనం Cancun లోని Xcaret resort లేదంటే Mexico, Canada, South America Europe లలో కొత్త డెస్టినేషన్స్ అన్వేషిస్తారు… అంతెందుకు, మెక్సికోలో కూడా వీళ్లు మెక్‌డొనాల్డ్‌కన్నా పోషక విలువలు, టేస్ట్ అధికంగా ఉండే హాంబర్గర్లను కనుగొంటారు…
మీరు ఎప్పుడైనా యు.ఎస్.లో పిరమిడ్లను చూశారా? ఈజిప్ట్, మెక్సికో, పెరూ, గ్వాటెమాలా, సూడాన్ అన్నీ పురాతన అద్భుతాలను కలిగి ఉన్నాయి… అవి చరిత్రాత్మకాలు… ఒక్కటీ యు.ఎస్.లో లేదు… ఒకవేళ ఉంటే, ట్రంప్ బహుశా వాటిని కొని, అమ్మేసి ఉండేవాడు…
మాకు తెలుసు… Nike ఒక్కటే sneaker brand కాదని… Adidas తోపాటు Panam వంటి మెక్సికన్ బ్రాండ్లు పాపులర్ అని అందరికీ తెలుసు… మీకేే కాదు, మాకు కూడా మీరు ఊహించినదానికన్నా ఆర్థిక వ్యవస్థ గురించి ఎక్కువ అవగాహన ఉంది…
ఈ 7 బిలియన్ వినియోగదారులు అమెరికన్ ఉత్పత్తులను కొనడం ఆపివేస్తే, నిరుద్యోగం పెరుగుతుందని, మీ ఆర్థిక వ్యవస్థ తానే తన చుట్టూ కట్టుకుంటున్న గోడలో చిక్కుకుని… బాబ్బాబు, ఈ గోడను కూల్చేద్దాం, సహకరించాలని మీరే కన్నీటితో వేడుకునే దుస్థితి వస్తుందని కూడా మాకు తెలుసు…
మేము ఇలా చేయాలనుకోవడం లేదు, కానీ… మీరే ఒక గోడను కోరుకుంటున్నారు…’’ ఇలా సాగిపోయింది ఆమె నిరసన, వెటకారం… నిజమే, ప్రపంచ మార్కెట్ మీదనే కదా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి బతుకుతోంది… సరిగ్గా అది గమనించి ఆమె ట్రంపు ఆంక్షలు, పన్నులు, ఇంపోర్ట్ డ్యూటీల మీద దాడి ప్రారంభించింది…
ఆమెకు జనంలో మద్దతు ఉంది… దేశం ఆమె వెనుక ఉంది… ఓ రీసెంట్ పోల్ సర్వేలో ఆమెకు ఏకంగా 85 శాతం మద్దతు లభించింది…!! చివరగా… అసలు మెక్సికో డ్రగ్స్ లేకపోతే అమెరికన్లు ఉంటారా..?!
Share this Article