Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంబానీ ఐపీఎల్ జట్టుకు ఇక సెలవు… కొత్త ఆటగాళ్లే శరణ్యం…

April 30, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta …. MI కి IPL 2026 దాదాపుగా ముగిసిపోయింది. వారు 2027 కోసం ప్రణాళికలు మొదలుపెట్టాలి. ఎవరిని జట్టులో ఉంచుకోవాలో, ఎవరిని వదిలేయాలో ఆలోచించాలి. గత ఒకటిన్నర సంవత్సరాలుగా SKY ప్రదర్శన చూస్తుంటే, వచ్చే ఏడాది MI అతన్ని నిలుపుకోకపోయినా నేను ఆశ్చర్యపోను. అతని ప్రస్తుత ఫామ్‌తో భారత జట్టులో అతని T20I స్థానం కూడా ఖాయంగా లేదు.

భారత టీ20 జట్టు మిడిల్ ఆర్డర్ లో బోలెడంత పోటీ ఉంది. శ్రేయాస్ జట్టులోకి వచ్చి నాయకత్వం తీసుకున్నా ఆశ్చర్యం లేదు లేదా భారత T20 జట్టులో నాయకులకు కొదవ లేదు. సంజు, ఇషాన్ లాంటి వారు T20 జట్టులో రెగ్యులర్ గానే ఆడుతున్నారు, ఎప్పుడో ఒకప్పుడు వారి వారి జట్టులకు నాయకులుగా పని చేశారు.

Ads

రేపు ఐర్లాండ్, జింబాబే లాంటి పర్యటనలకు కొంత మంది కొత్త ఆటగాళ్లు, కొత్త నాయకత్వం ప్రయత్నించవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే కొత్త కాంబినేషన్లు ప్రయత్నించటానికి అవకాశం ఉంటుంది.
నన్ను అడిగితే జింబాబ్వేకు, ఐర్లాండ్ కు వెళ్ళే జట్టు ఇలా వుండచ్చు…

mi

వైభవ్ , అభిషేక్, సంజు, ఇషాన్, తిలక్, పాండ్య, అక్షర్, దూబే, ముగ్గురు బౌలర్లు లుండచ్చు. బూమ్రాకు కూడా విశ్రాంతి ఇవ్వచ్చు.. నాయకుడిగా సంజు, ఇషాన్ లలో ఒకరికి అవకాశం ఇవ్వచ్చు.

గిల్ ను జట్టులోకి తెచ్చి నాయకుడిని చేసే ఆలోచనలు చేస్తారు కానీ T20 జట్టు top order లో గిల్ కు దురదృష్టవశాత్తూ స్థానం లేదు. కనీసం 5, 6 లలో కూడా స్థానం లేదు. గిల్ ODI, test లు ఆడుకోవలసిందే. కనీసం జైస్వాల్ లాంటి ఆటగాడికి స్థానం లేదు. అంత పోటీ ఉంది జట్టులో…

ipl

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్ ఇది… కింది నుంచి అయిదు జట్ల పరిస్థితి ఇది… ముంబై లక్నో, కలకత్తాలతో పోటీపడుతోంది దిగువన ఉండిపోవడానికి… ఇక వరుసగా అన్ని మ్యాచులు గెలిచినా లాభం లేదేమో ఇక… ఆల్రెడీ పంజాబ్, హైదరాబాద్, బెంగుళూర్, రాజస్థాన్ దూసుకుపోతున్నాయి… గుజరాత్, ఢిల్లీలను కూడా తేలికగా తీసేయలేం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…
  • ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!
  • రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ వద్ద జవాబు లేదు..! కిక్కుమనరు..!!
  • KCR పాలన బాపతు ఆ గ్లోబరీనా… కొత్త పేరుతో మళ్లీ పిల్లల జీవితాలతో ఆటలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions