.
వైఎస్, చంద్రబాబు, కిరణ్‌కుమార్, రోశయ్య, కేసీఆర్… ఎవరూ పాత బస్తీకి ఏమీ చేయలేదనీ, రేవంత్ రెడ్డి మాత్రం సరైన రీతిలో వెళ్తున్నాడు… ఈ మాట అన్నది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ…
తను చెప్పింది పాత బస్తీకి మెట్రో పొడిగింపు గురించే కావచ్చుగాక… కానీ ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా… ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో మంచిగా ఉండి, కావల్సిన పనులు చేయించుకునే ఒవైసీకి ఇప్పుడు రేవంత్ హఠాత్తుగా మిత్రుడు కావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు…
Ads
పైగా హైడ్రా నోటీసులు, కన్ను కొంత పనిచేసి ఉంటాయేమో… ఇద్దరూ పరస్పరం విమర్శించుకున్నారు గత ఎన్నికల ముందువరకూ… అప్పుడంటే కేసీయార్ జాన్ జిగ్రీ కదా ఒవైసీకి… పాత బస్తీని మొత్తం మజ్లిస్‌కు వదిలిపెట్టేశాడు కేసీయార్…
పాతబస్తీకి వచ్చేసరికి మజ్లిస్‌కు బీఆర్ఎస్ అనుబంధ విభాగం అనిపించేది… ఇతర నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు మజ్లిస్ అనుబంధ విభాగం అన్నట్టుగా..! మరి పదేళ్ల దోస్తానాలో పాత బస్తీకి ఏం అభివృద్ధి చేయించుకున్నట్టు..? ఇప్పుడు ఏమీ చేయలేదనే నింద దేనికి..?
సరే, కిరణ్‌కుమార్‌రెడ్డితో ఉప్పునిప్పు యవ్వారమే… రోశయ్య ఉన్నది స్వల్పకాలమే… చంద్రబాబు ఇష్యూ బేస్డ్ దోస్త్… అప్పట్లో తన హయాంలోనే కావచ్చు ఒవైసీ 50 రోజులపాటు జైలులో ఉన్నది… (ఎవరిని ఉద్దేశించి అన్నాడో గానీ ఇంకా చాలామంది జైలుకు వెళ్తారు, వెళ్లాలి కూడా, వెళ్తేనే చాలా విషయాలు అర్థమవుతాయి అంటున్నాడు…)
నిజానికి హైదరాబాద్‌కు వైఎస్ పీరియడ్‌లోనే మహర్దశ… ఓఆర్ఆర్, మెట్రో, శంషాబాద్ ఎయిర్ పోర్టు, గోదావరి వాటర్ ఎట్సెట్రా అనేకం… అఫ్‌కోర్స్, కొన్ని సీమ ముఠాలు భూములను ఆక్రమించి అరాచకంగా వ్యవహరించిందీ తన కాలంలోనే…! ఇదే ఒవైసీతో వైఎస్ కూడా స్నేహభావంతోనే ఉన్నాడు… మరిక ఎవరూ ఏమీ చేయలేదు, రేవంతే తోపు అనే ప్రశంసలో అర్థమేముంది..?
ఎస్, చాంద్రాయణగుట్ట దాకా మెట్రో పొడిగింపు సాధ్యమయ్యేట్టుగానే కనిపిస్తోంది… భూసేకరణ స్టార్టయి కొందరికి చెక్కులు కూడా ఇచ్చేశారు… దీనికి ఖచ్చితంగా మజ్లిస్ సహకారం కూడా అవసరమే… మీరాలం చెరువు బ్రిడ్జి కూడా రేవంత్ హామీ ఇచ్చాడు…
చార్మినార్ దాకా స్కైవాక్ అడినట్టున్నాడు ఒవైసీ… రాజకీయంగా చూస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కటీఫ్ అయిపోయినట్టే… కేసుల ఒత్తిడిలో బీఆర్ఎస్ నేతలు… ఫామ్ హైజ్ వీడని, పార్టీ పట్టని అధినేత… కవిత, హరీష్, కేటీయార్ ఎంత తిరుగుతున్నా పార్టీ కేడర్‌లో నిర్లిప్తత మాత్రం ఇంకా పోవడం లేదు…
కాంగ్రెస్ సొంతంగా గెలిచిన సీట్లు ప్లస్ జంపింగ్ ఎమ్మెల్యేలు ప్లస్ కొత్తగా మజ్లిస్ రాజకీయ మద్దతు… సో, కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరమే… ఇప్పట్లో ఢోకా లేదు, వాళ్లలో వాళ్లు కుమ్ములాడుకుంటే తప్ప..! హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంత బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు…
కాంగ్రెస్, మజ్లిస్ అవగాహన ఉండేట్టు ఉంది… ముస్లిం వోట్లు బీఆర్ఎస్‌కు మైనస్… సెటిలర్ నేతలూ కాంగ్రెస్ వైపే ఉంటున్నారు ఇప్పుడు… సో, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ప్లస్ మజ్లిస్ బలంగా మొహరిస్తాయి… అందుకే రాబోయే హైదరాబాద్ నగరపాలక ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి… అఫ్‌కోర్స్, ఓఆర్ఆర్ పరిధిలోని మొత్తం ఆవాసాలు కలిపేసి, నాలుగు కార్పొరేషన్లు ఏదో చేస్తానంటున్నాడు కదా రేవంత్ రెడ్డి… అది పూర్తయ్యాకే..!!
Share this Article