అంతకుముందు కొంత సదభిప్రాయం ఉండేది అనంత శ్రీరామ్ అనే సినిమా పాటల రచయిత మీద… దిగుదిగునాగ స్పిరిట్యుయల్ సాంగ్ పల్లవిని ఓ చిల్లర ఐటమ్ సాంగ్ కోసం భ్రష్టుపట్టించడం, సంగీత జ్ఞానం లేకపోయినా సరే తప్పుల సిధ్‌శ్రీరాంను వెనకేసుకురావడం, గరికపాటి వివాదంలో తలదూర్చి తలాతోకా లేని పిచ్చి సమర్థనకు ప్రయత్నించడం, ఈమధ్య ఒక సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీయడం…
హార్ష్‌గా అనిపించినా సరే… ఓ స్ట్రెయిట్ కామెంట్… ఏం పుట్టింది నీకు హఠాత్తుగా..? నువ్వు ఒక లిరిక్ రైటర్‌వు… నాలుగు పడికట్టు పదాలు తెలిసి, వాటినే అటూఇటూ సర్దుతూ, ప్రయోగిస్తూ ఏదో పొట్టపోసుకుంటున్నవ్… టీవీ ప్రోగ్రాముల్లో జడ్జిగా కూడా నాలుగు డబ్బులు వస్తున్నయ్… సరిపోదా..? ఎందుకు అన్నీ ముర్క చూడటం..? అంటే చెడు వాసన చూసి గెలకడం..? నువ్వు రాసే పాటల్లో అర్థం పర్థం లేకపోయినా సరే ప్రేక్షకులు వింటున్నారు, నిర్మాతలు డబ్బులిస్తున్నారు, సంగీత దర్శకులు ఎంకరేజ్ చేస్తున్నారు… సరిపోదా..?
నీకు సంబంధం లేని అంశాల్లో జోక్యం చేసుకోవడంతో వచ్చేదేముంది నీకు..? అవనసరంగా నీ అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం తప్ప..! సినిమా పాటలు రాస్తే అనంత జ్ఞాన విద్వత్తు సమకూరినట్టేనా..? ఇండస్ట్రీలో ఓవరాక్షన్ చేసిన చాలా మంది కొట్టుకుపోయారు అనంతుడా..? ఎగిరిపడకు… చివరకు జీవపరిణామంలోకి కూడా వెళ్లిపోతున్నావు, వేదాల వయస్సు దాకా వేళ్లు పెడుతున్నావు…
Ads
సరే, ఈమధ్య అనంత్ సేయింగ్స్ #ananthsayings అని ఏదో గీకుతున్నావుగా… అందరూ చెప్పేవాళ్లే అయిపోయారు… చార్ లెస్ అని ఇంత దారుణంగా ప్రయోగించిన వ్యక్తిని నిన్నే చూస్తున్నాం… చార్లెస్ డార్విన్ ఎప్పుడు పుట్టాడో తెలుసా..? 1809 సంవత్సరం… మరణించింది 1882లో… అసలు వేదాల వయస్సు నీకు తెలుసా శ్రీరామ్…? ఎట్టెట్టా… ‘చార్లెస్ డార్విన్ పరిణామ క్రమం ఎక్కడికొచ్చి ఆగుతుందో, చతుర్వేదసారం అక్కడి నుంచి మొదలవుతుందా..?’ దీనికి అధారాలు ఏమైనా ఉన్నాయా? వినడానికి గంభీరంగా ఉంటుందని ఏది పడితే అది చెప్పి మేధావిగా గుర్తింపు పొందాలనుకుంటున్నావా..? ఎక్కడి డార్విన్..? ఎక్కడి చతుర్వేదాలు..? ఏమైనా పొంతన ఉందా..?
అసలు డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికీ, వేదాల్లో జీవం పుట్టుక గురించి పరస్పర కంట్రడిక్షన్స్ బోలెడు… బోలెడు పీహెచ్‌డీలకు అవసరమయ్యే మెటీరియల్ అది… ఇప్పటికీ మనిషి పుట్టుక మీద శాస్త్రీయంగా, బలంగా నిలిచిన వాదన కేవలం డార్విన్‌దే… ఆ పరిణామక్రమం ఆగడం ఏమిటి..? చతుర్వేదసారం అక్కడ మొదలు కావడం ఏమిటి..? తెలియకపోతే తెలియనట్టుండాలి… వేదాలు డైనమిక్ కావు, అంటే చంచలమైనవి కావు… స్టాటిక్… అంటే స్థిరమైనవి… కానీ పరిణామ క్రమం డైనమిక్…
సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే వాక్యాలు అనంతమైన సబ్జెక్టును ప్రోదిచేసుకున్నవి… సో, ముందు వేదాల గురించి, పరిణామ సిద్ధాంతాల గురించి చదువు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఏమైనా లేశమాత్రం అర్థమయితే, అప్పుడు సేయింగ్సో, మరొకటో రాయి… లేదంటే కాస్త మూసుకుని కూర్చో… ఇప్పటికే జ్ఞానప్రవాహం చాలా ఎక్కువైపోయింది తెలుగు సమాజంలో…!!
Share this Article