.
ఫాఫం మిరయ్… నిర్మాతలు ఎవరో గానీ… తక్కువ ఖర్చుతోనే కల్కి, హరిహరవీరమల్లు, ఆదిపురుష్ తదితర సినిమాల క్వాలిటీలను మించిన గ్రాఫిక్స్ సినిమాను నిర్మించారు సరే…
ఆ దర్శకుడు ఎవరో గానీ… గతంలో ఏం తీశాడో, ట్రాక్ రికార్డు ఏమిటో గానీ… గ్రిప్పింగ్ కథనం, కథనంపై గ్రిప్పు సూపర్బ్… ప్రతి సీనులోనూ తన ప్రతిభ కనిపించింది… ఈ దెబ్బకు మరికొన్ని సినిమాలు గ్యారంటీ, తన లైఫ్ సెటిల్…
Ads
ఫాఫం అని ఎందుకు అన్నానంటే..? అమెరికా వంటి దేశాల్లో ఆల్రెడీ అన్నిభాషల మిరయ్ నెట్‌లో పెట్టేశారు… మంచి క్వాలిటీతో… మరీ థియేటరికల్ ఎక్స్‌పీరియెన్స్ కోరుకునే ప్రేక్షకులు అక్కడ వీకెండ్స్ రిలాక్స్ కోసం ఫ్యామిలీలతో వెళ్తారేమో… సీన్ కట్ చేస్తే…
ఆ సినిమాలోని హై సీన్లు… అంటే పక్షి (జటాయువు), ట్రెయిన్ ఫైట్, ఫైనల్ ఫైట్ ఎట్సెట్రా అన్నీ ఫేస్‌బుక్‌లో కూడా దర్శనమిస్తున్నాయి… కొందరేమో అవర్ మనోజ్ అంటూ మంచు మనోజ్ హైలైట్ అయ్యే సీన్లను పెట్టేస్తున్నారు… మరికొందరు జున్నుముక్కలాంటి ముద్దు హీరోయిన్ అంటూ ఆమె సీన్లు పెడుతున్నారు…
ఫుల్ వైరల్ అవి… నిజం ఎంత నిష్టురం అంటే… దాదాపు సినిమా మొత్తం ముక్కలు ముక్కలుగా ఫేస్‌బుక్‌లో కనిపిస్తోంది ఇప్పుడు… అవన్నీ చూస్తే ఇక సినిమా చూడనక్కర్లేదు అనేలా…. ఎలాగూ జనం థియేటర్ వెళ్లి సినిమా చూడాలంటేనే, ఆ దోపిడీకి వణికి చస్తున్నారు కదా… మీ దుంపతెగ…
నన్నే తీసుకుందాం… దాదాపు 12, 14 సీన్లు… మరీ కీలకమైనవి ఫేస్‌బుక్‌లో చూశాను… మరిక నాకు థియేటర్ వెళ్లి అవి చూడాల్సినంత ఆసక్తి ఏముంటుంది..? పైగా థియేటర్ల నిలువు దోపిడీకి గురికాావాలని ఎందుకు ఉంటుంది..?
అశోకుడు- 9 గ్రంథాలు… అనే కథ నాకు తెలుసు… Nine Unknown Men పేరిట చాలామంది రాశారు… అదొక ఫిక్షన్… ఆ కథకు అనుసరణే ఈ సినిమా కథ… పైగా తేజా సజ్జా పాపులర్ హీరో కాదు… ఇంకా నటనలో పరిణతి రావాలి… అదే కనిపిస్తోంది… కాకపోతే..?
నటి శ్రియా శరణ్ బాగా చేసింది… ప్రత్యేకించి మంచు మనోజ్… నువ్వు సూపర్‌రా బాబూ… ఆ మంచి మార్కు అపఖ్యాతులు, ఓవరాక్షన్ల నుంచి బయటపడగలిగితే… నీ హీరోయిజం భ్రమల నుంచి బయటకొచ్చి జగపతిబాబులాగా ఏ పాత్ర దొరికినా చేసే పక్షంలో నీ కెరీర్ బాగుంటుంది… ఈ సినిమా పాత్రే ప్రబల ఉదాహరణ… పలుచోట్ల మనోజ్ ముందు తేజ వెలతెలా పోయిండు…
బ్యాలెన్స్‌డ్‌గా చేశాడు మనోజ్… నిర్మొహమాటంగా చెప్పాలంటే ఈ సినిమాకు వాడే హీరో… అఫ్‌కోర్స్, ముద్దుముద్దుగా అందంగా ఉన్న రితిక హీరోయిన్… ఆమె తెలుగులో మంచి కెరీర్ ఉంది, సరిగ్గా వినియోగించుకుంటే..! దర్శకుడికీ ఫ్యూచర్ ఉంది… అయితే ఓటీటీలో చూడొచ్చు అంటారా..? భలేవారే… ఆల్రెడీ సినిమా పైరేట్ సినిమా సైట్లలోనే కాదు, ఫేస్‌బుక్ షార్ట్ వీడియోల్లో కూడా వచ్చేసింది..!!
Share this Article