Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఢిల్లీ లిక్కర్ స్కాం ఛార్జ్‌షీటులోనూ కవిత పేరు… అరెస్టు తప్పదా..?

February 3, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి……  BRS MLC కవిత పేరుని ED చార్జ్ షీట్ లో చేర్చింది ! ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 02-02-2022 గురువారం రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద 400 పేజీలతో కూడిన చార్జ్ షీట్ ఫైల్ చేసింది ! ED ఫైల్ చేసిన చార్జ్ షీట్ లో BRS MLC కవిత పేరుని చేర్చింది ! హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త అభిషేక్ రావు బోయినపల్లి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి సన్నిహితుడు అయిన విజయ్ నాయర్ కి 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా ED పేర్కొంది !

100 కోట్ల రూపాయలని కవితతో పాటు సౌత్ గ్రూప్ AAP నాయకులకి ఇచ్చినట్లు పేర్కొంది. చార్జ్ షీట్ లో కవిత పేరుని చేర్చిన ED సౌత్ గ్రూప్ అనే కోడ్ నేమ్ ని తమలో తాము వాడుకున్నామని ED విచారణలో నిందితులు చెప్పినట్లుగా రికార్డ్ అయ్యింది. అభిషేక్ బోయినపల్లి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి మనీష్ సిసోడియా సన్నిహితుడు అయిన దినేష్ ఆరోరా తో కలిసి కుట్ర పన్ని[conspired అనే పదం వాడింది ed తన చార్జ్ షీట్ లో ] సౌత్ గ్రూపు గా పిలవబడ్డ కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ రెడ్డి లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగస్వాములుగా పేర్కొంది ED.
********************************
సౌత్ గ్రూపు తరుపున రాయబారాలు చేసింది అభిషేక్ బోయినపల్లి ! సౌత్ గ్రూప్ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తమని భాగస్వాములుగా చేసినందుకు 100 కోట్ల రూపాయలని అభిషేక్ బోయినపల్లి, బుచ్చి బాబు, విజయ్ నాయర్ ద్వారా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిశోడియా ముఖ్య అనుచరుడు దినేష్ ఆరోరాకి లంచంగా ఇచ్చినట్లు చార్జ్ షీట్ లో పేర్కొంది ! ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన చార్జ్ షీట్ లో లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల రూపాయాలని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిందని పేర్కొంది!
ఇది గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కర్ణాటకలో బిజేపిని ఓడించడానికి చంద్రబాబు 400 కోట్ల రూపాయలను ఇచ్చినట్లు వచ్చిన వార్తలని గుర్తు చేస్తున్నట్లుగా ఉంది ! ఆఫ్కోర్స్ గోవా చాలా చిన్న రాష్ట్రం కాబట్టి 100 కోట్ల రూపాయలు సరిపోతాయి ! గోవా అసెంబ్లీ ఎన్నికలప్పుడు సర్వే చేయడానికి గాను ఒక సంస్థకి నేరుగా 70 లక్షల రూపాయాల్ని నగదు రూపంలో ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ! దీనికి సంబంధించిన ఆధారాలని ed సేకరించింది ! ఈ 70 లక్షల రూపాయలు సౌత్ గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల నుండి ఇచ్చినవే !
చార్జ్ షీట్ లో మరో అంశం చేర్చింది ed … విజయ్ నాయర్ తన ఐఫోన్ తో ఫేస్ టైమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేశాడు ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ల మధ్య ! ఈ ఇండో స్పిరిట్స్ ఢిల్లీ లోని వైన్ షాపులకి మద్యం సరఫరా చేసింది. ఆ మద్యం షాపులు సౌత్ గ్రూపుకి చెందినవి అన్న సంగతి తెలిసిందే ! ‘’ విజయ్ నాయర్ మనవాడే. అతనిని మీరు [సమీర్ మహేంద్రు ] నమ్మవచ్చు ‘ అంటూ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పినట్లుగా వీడియో ఆధారాలని సేకరించింది ED! ఓహ్ ! ఇది కూడా ‘మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ ‘ అని చంద్రబాబు వోటుకి నోటు ఫోన్ సంభాషణని గుర్తు చేస్తున్నట్లుగా ఉంది కదా ?
*****************************************
తన వీడియో కాల్ మీద ed ఫైల్ చేసిన సంగతిని విలేఖరులు కేజ్రీవాల్ ని ప్రశ్నించినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 వేల కేసులని నమోదు చేసుకోమనండి, నాకేమీ కాదు అని సమాధానం ఇచ్చాడు ! ED ఫైల్ చేసిన కేసు ఊహా జనితమయినది అన్నాడు. 2022 లో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వెలుగు చూసిన తరువాత సిబిఐ విచారణ చేపట్టింది. తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ విషయంలో ఈ కేసులోకి ప్రవేశించి విచారణ చేసి ఈ రోజున తన చార్జ్ షీట్ ని సమర్పించింది !
చార్జ్ షీట్ ని ఫైల్ చేసింది కాబట్టి ఇక మిగిలిన నిందితులలో అరెస్ట్ చేయాల్సింది కవిత ఒక్కరే ఉన్నారు ! ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తే బెయిల్ దొరకడం చాలా కష్టం ! గత 6 నెలలుగా అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ అయి ఇంకా జైల్లోనే ఉన్నాడు ! వోటుకి నోటు కేసులోలాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా పలచబడి పోతుందా ? లేక విచారణ పూర్తి అయిపోయి శిక్షలు పడతాయా అన్నది ముందు ముందు తెలిసిపోతుంది !
అసలు ఇంతకీ కవిత ని అరెస్ట్ చేస్తుందా ED ? విచిత్రం ఏమిటంటే బిజేపి కంటే కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి వివరాలు వివరంగా ఢిల్లీ వెళ్ళి మరీ ED ఆఫీసులో ఇచ్చాడు ! అందుచేత ఈ కేసు విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినట్లు కనిపించినా తెలంగాణ కాంగ్రెస్ మాత్రం బిజేపి తో పాటు brs మీద దాడి తీవ్రం చేసే అవకాశాలు ఉన్నాయి !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ జ్యోతి సరే… మరి పేరులో తెలంగాణనే కత్తిరించుకున్న పార్టీ..?!
  • వయాగ్రా..! అడ్డగోలుగా వాడితే పోతార్రోయ్… అసలుకే ధ్వంసమైపోతారు…
  • నర్గీస్ ఫక్రీ..! తన మొహం కాదు, తన ఉపవాస అడుగులూ వికృతమే…
  • ఈ కాళేశ్వర కదనం దేనికి..? కదం, కవాతు దేనికి..? బీఆర్ఎస్ రాంగ్ స్ట్రాటజీ..!!
  • కాపీ వీడియోల వడబోత సరే… కంటెంట్ స్టాండర్డ్స్ మాటేమిటి మరి..?!
  • హీరో మహేశ్ బాబును వదలని సాయి సూర్య ‘రియల్’ తలనొప్పి…
  • మార్ మత్ చోడో …. పండుగ సాయన్న కథలో కీలకమైన ట్విస్టు ఇదే…
  • ఆల్ ఇండియా ర్యాంకర్స్… ఆ సీన్… వివాదం పెరిగి దర్శకుడి క్షమాపణ…
  • కామాఖ్య గుడిలో తెలుగు నాయకుల భగాలాముఖి గుప్త పూజలు..!!
  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions