Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బొటిక్ ఎట్ హోం… బొచ్చు కత్తిరిస్తాం, స్నానాలు చేయిస్తాం…

November 7, 2024 by M S R

.

సంచార శునక సౌందర్యలహరి!

కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.

Ads

వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది.

అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండు కుక్కల వాళ్ల ఇల్లు అని కుక్కగుర్తుగా పనిమనుషులు, సెక్యూరిటీవారు చెప్పుకుంటూ ఉంటారు.

అలాంటి శునకాలకు ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్లు ఏనాటినుండో ఉన్నాయి. “కుక్క తోకను ఊపితే పర్లేదు కానీ… తోకే కుక్కను ఊపితే ప్రమాదం” అని మనుషులు ఎందుకంటారో కుక్కలకు తెలియకపోయినా… తోకే కుక్కను ఊపే రోజులు కాబట్టి ఆ బ్యూటీ పార్లర్లే కుక్కల దగ్గరికొచ్చి సేవలు చేసి వెళుతున్నాయి. సంపన్న శునకం బిజీగా ఉంటే కిక్కురుమనకుండా వేచి ఉంటున్నాయి.

కుక్కలకు బొచ్చు కత్తిరించడం;
గోళ్ళు తీయడం;
ఫేషియల్;
రంగులు వేయడం;
ఆవిరి స్నానాలు;
పరిమళభరిత ఎకో ఫ్రెండ్లి స్కిన్ ఫ్రెండ్లి ఆర్గానిక్ స్నానాలు;
తళతళలాడేలా పళ్ళు తోమడం;
నిగనిగలాడే అందమైన మెడ గొలుసులు వేయడం;
రుతువునుబట్టి బట్టలు కుట్టి తొడగడం;
యజమానులతో మ్యాచింగ్ డ్రెస్సులు తొడగడం…
లాంటి కుక్కల మేకోవర్ కు మొబైల్ సర్వీసులు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి.

మన కుక్కగారికి ఫార్మల్ గా మేకప్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోగానే ఆ మొబైల్ వ్యాన్ మన ఇంటిముందు వచ్చి వాలుతుంది. తాపీగా తోక ఊపుకుంటూ కుక్క గారు ఆ వ్యాన్ మెట్లెక్కితే చాలు… నఖశిఖపర్యంతం తనను తానే గుర్తుపట్టలేనంతగా కుక్క అందగిస్తుంది.

నిజమే.
“ఇంటిని చూడు- ఇల్లాలిని చూడు” అన్న సామెతకు కాలం చెల్లింది!
“కుక్కను చూడు- ఇంటిని చూడు” అన్నది కదా ఆధునిక శునక ప్రమాణోపమానం!

ఇది ఆధునిక సంచార శునక సౌందర్యలహరి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!
  • నడుమ వాళ్లేం తప్పు చేశారు..? ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారు..!!
  • చెరపకురా పాకీ… నువ్వే చెడేవు! అటు బెలూచ్- ఇటు పీఓకే..!!
  • హరీష్ భయ్… నో గురుదక్షిణ, నో నిర్లక్ష్యం – ఇది సిన్సియర్ ఎఫర్ట్ !!
  • మిస్టర్ క్లీన్ ! మీడియాకన్నా చరిత్ర బాగా అర్థం చేసుకుంది !!
  • “రూమ్ నం. 39… మూడేళ్లుగా ఎవరికీ అర్థం కాని రహస్యం!”
  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions