‘‘గత సంవత్సరం ఒకే దేశం-ఒకే ఎన్నిక అనే అంశం మీద చర్చించేందుకు ప్రధాని మోడీ ఓ అఖిలపక్ష సమావేశం పెట్టాడు… అందరినీ రమ్మన్నారు… సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శిగా నేను వెళ్లాం… మోడీ విధానాన్ని పార్టీ లైన్‌కు లోబడి నేను ఘాటుగా విమర్శించాను… అందరూ తమ అభిప్రాయాలు చెప్పి వెళ్లిపోయారు… మీటింగ్ అయిపోయింది… హాలులో ఓ చివర నేను, ఒవైసీ మిగిలిపోయాం… ప్రధాని వెళ్లిపోబోతూ మావైపు వచ్చాడు… నేను ఆశ్చర్యపోయాను… తను నేరుగా ఒవైసీ వద్దకు వచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి, మిల్ తే రహో భాయ్ (కలుస్తూ ఉండండి) అని అభినందించి వెళ్లిపోయాడు…’’ ఇదీ సురవరం సుధాకర్‌రెడ్డి నిన్న ఆంధ్రజ్యోతి వ్యాసంలో, నేడు ప్రజాపక్షం వ్యాసంలో రాసుకున్న ఓ భాగం…
అది సరే కామ్రేడ్… ఒవైసీ పలు రాష్ట్రాల్లో పోటీకి నిలబడుతూ, సెక్యులర్ పార్టీల వోట్లు చీలుస్తూ… బీజేపీకి తెరచాటు మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణ చాలారోజులుగా ఉన్నదే… చాలామంది ఈ విమర్శలు చేశారు… కొత్తదేమీ కాదు… కానీ ఒక మీటింగులో ఒవైసీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, కలుస్తూ ఉండండి అని చెప్పడమే ఈ తెరచాటు దోస్తీకి ప్రబల నిదర్శనం అన్నట్టుగా నువ్వు రాయడమే విచిత్రంగా ఉంది… అత్యంత సీనియర్ నాయకుడు, పైగా ఒక జాతీయ పార్టీకి అప్పటి ప్రధాన కార్యదర్శి… వేగ్గా ఆరోపణలు దేనికి..? ఏదో మీటింగులో మర్యాదకు చేతులు కలపడం దుర్మార్గం కాదు, సందేహాస్పదం కూడా కాదు…
Ads
నిజంగా బీజేపీ, మజ్లిస్… ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు సహకరించుకుంటూ ఉంటారు, వాళ్లది లాలూచీ కుస్తీ మాత్రమే… తెరచాటు దోస్తీ అని బలమైన ఆరోపణ చేస్తున్నప్పుడు… దాన్ని అంతే బలంగా ఎస్టాబ్లిష్ చేయాలి… మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్‌లో ఎన్నిచోట్ల మజ్లిస్ పోటీచేసింది… ఎన్నిచోట్ల వోట్లు చీలడం వల్ల బీజేపీకి ఎంత ప్రయోజనం కలిగిందో వోట్ల లెక్కల్లో చెబితే పంచ్ బలంగా ఉండేది… మొన్న బీహార్‌లో మజ్లిస్ అయిదు గెలిచింది… రేపు బెంగాల్లో బాగా గెలవబోతోంది… అయితే…
ఢిల్లీలో పలు చట్టాలకు కేసీయార్ మద్దతు ఇచ్చాడు… ఆయనకు మజ్లిస్ మద్దతు హైదరాబాదులో… అంటే వీళ్లంతా ఒకటే అన్నట్టుగా రాశాడు కామ్రేడ్… ఇదీ వేగ్ ఆరోపణే… మతాల వారీ వోట్లు పోలరైజ్ కావడం బీజేపీకి, మజ్లిస్‌కు ఉభయతారకమే… డౌట్ లేదు… కానీ మొన్నటి గ్రేటర్ ఎన్నికలు లాలూచీ కుస్తీ కానేకాదు… మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీలది లాలూచీ కుస్తీయే… కానీ బీజేపీది సీరియస్, స్ట్రెయిట్ ఫైట్… ఎందుకంటే బరిలో ఉన్న ప్రధాన ప్రత్యర్థులు ఆ పార్టీలే…
మజ్లిస్, బీజేపీ లోపాయికారీగా సహకరించుకుంటాయీ అనేది నిజమే అనుకుందాం… రాజకీయాల్లో ఏదైనా సంభవమే… ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు… కానీ మజ్లిస్ వ్యూహాత్మకంగా, సందర్భాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి తన స్ట్రాటజీలలో మార్పులు చేసుకుంటోంది… అంతిమంగా తన బలం విస్తరించుకోవాలనేదే గోల్… బీజేపీకి కూడా అంతే… రెండింటికీ కావల్సింది మతాల వారీ పోలరైజేషనే… ఇక్కడ అడగాల్సింది టీఆర్ఎస్ను… బీజేపీ మతవిద్వేషాన్ని పెంచుతున్నదీ అని ఆరోపించే టీఆర్ఎస్కు మజ్లిస్ అంతకు భిన్నంగా ఎలా కనిపిస్తోంది..? అదెందుకు ఆమోదయోగ్యం అయ్యింది..? మీరు ఎందుకు అడగాలంటే..? మొన్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక స్టాండ్‌తో మీ సానుభూతిపరుల వోట్లు కూడా లోపాయికారీగా టీఆర్ఎస్కు పడ్డాయి కాబట్టి…! మిమ్మల్ని మీరు కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి… మనవాళ్ల స్టాండ్ కరెక్టేనా అని…!! రేప్పొద్దున యాంటీ-బీజేపీ ప్రత్యామ్నాయం నిర్మిద్దాం అని కేసీయార్ గనుక పిలిస్తే… ఈ మజ్లిస్ దోస్త్‌తో మీరు కలుస్తారా..? కలవరా..? అసలు పార్టీకి ఓ క్లారిటీ ఉందా..?
Share this Article