.
Paresh Turlapati ……….. ఇందాక టీవీల్లో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం లైవ్ చూశా. అందులో ఒక దృశ్యం నన్ను ఆకర్షించింది
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన 12 రాష్ట్రాల బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లతో సహా అందరూ వేదిక మీద మోడీని రిసీవ్ చేసుకోవడానికి రెండు చేతులూ జోడించి లైను లో నిలబడి ఉన్నారు
Ads
మోడీ కూడా ఒక్కొక్కరికీ నమస్కారం చేస్తూ ఏక్ నాథ్ షిండే దగ్గరికి రాగానే ఆగి అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ మాట్లాడటం కనిపించింది
అప్పుడు మోడీ షిండేతో ఏం మాట్లాడి ఉంటాడు అని ఆలోచిస్తే నాకు సరదాగా ఇలా అనిపించింది … “ఏవయ్యా షిండే, క్రికెట్లో స్టాండ్ బై ప్లేయర్ మాదిరి .. అవసరమైనప్పుడు రాజకీయాల్లో నీలాంటి గేమ్ చేంజర్ ఒకడు ఉండాలయ్యా .. కీపిటప్” అని భుజం తట్టి ముందుకు సాగారు
ఈ మాటలు అంటున్నప్పుడు షిండే సిగ్గు పడుతూ మెలికలు తిరగ్గా పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బిగ్గరగా నవ్వారు
వరుస క్రమంలో కొంచెం ఆఖర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ను చూసి స్పీడుగా దగ్గరికి వచ్చి పవన్ చేతులను తన చేతిలోకి తీసుకొని వెనకనే ఉన్న రామ్మోహన్ నాయుడు వంక కూడా చూస్తూ మోడీ ఏదో జోక్ పేల్చారు, పవన్ మోడీ వంక చూస్తూ పగలబడి నవ్వాడు . ఆ జోక్ కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నవ్వాడు
పవన్ కళ్యాణ్ దీక్ష వస్త్ర ధారణ లో ఉన్నాడు
అప్పుడు నాకనిపించింది సరదాగా, ” ఏవయ్యా పవర్ స్టారూ.. ఇప్పుడే ఓ గేమ్ చేంజర్ తో మాట్లాడి వచ్చా.. ఇప్పుడు అసలు సిసలైన గేమ్ చేంజర్ తో మాట్లాడుతున్నా.. మొత్తానికి నీకు ఈ వస్త్ర ధారణ బావుందయ్యా.. చూస్తూ ఉండు.. యూపీలో యోగీలా త్వరలో ఏపీకి యోగీ అవుతావు… కీపిటప్ ” అని భుజం తట్టి ముందుకు కదిలారు
ముందుకు కదలాగానే బాబు కనిపించారు, “బాబూజీ నమస్కార్.. ఎలా ఉన్నారు? ఇప్పుడే ఇద్దరు గేమ్ చేంజర్లతో మాట్లాడి వచ్చాను.. మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడతారు” అని నవ్వుతూ అన్నారు. అప్పుడు మాత్రం బాబు కొంచెం కన్ఫ్యూజన్ గా మొహం పెట్టి ” ఉపయోగపడేది మీకా ? నాకా?” అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు అనిపించింది
ఈ కామెంట్రీ సరదాగా రాశాను కాబట్టి సీరియస్ అవకండి, మొత్తనికి ఒకటి మాత్రం నిజం. అంతమందిలో కూడా మోడీ చంద్రబాబుకూ.. పవన్ కళ్యాణ్ కూ అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ సుహృద్భావం ఏపీ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆశిద్దాం !
Share this Article