Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!

May 10, 2026 by M S R

.

విద్వేషం లేదు… విషం లేదు… పరస్పరం విమర్శల్లేవు… నిన్న మోడీ, రేవంత్ పాల్గొన్న అఫిషియల్ కార్యక్రమం నిజంగా అభినందనీయంగా సాగింది… బీఆర్ఎస్ క్యాంపు కుళ్లుకుంటూ ఉండవచ్చుగాక… చూశారా, చూశారా, తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని వక్రబాష్యాలతో మాట్లాడవచ్చుగాక… కానీ ఒక రాష్ట్రం, ఒక కేంద్రం నడుమ ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉండాలో ఒక మోడీ, ఒక రేవంత్ ప్రత్యక్షంగా జనానికి చూపించారు… సూపర్…

ఒక్కసారి గతంలోకి వెళ్దాం… మోడీ వచ్చినా, కేంద్ర ముఖ్యులు వచ్చినా కేసీయార్ కలిసేవాడు కాదు… గడీభవన్ కదిలేవాడు కాదు… ఏ తలసానియో ఓ బొకే పట్టుకుని వెళ్లేవాడు… ఈలోపు మోడీని, కేంద్ర బీజేపీని బదనాం చేయడానికి… ఎమ్మెల్యేల కొనుగోలు నాటకాలు రచించి, కేసీయార్ విఫల ప్రయత్నం చేసేవాడు… ఫలితంగా రాష్ట్రం- కేంద్రం నడుమ అభివృద్ధి- నిధుల యవ్వారం ఎక్కడికక్కడ స్థంభించిపోయేది… మళ్లీ తనే ఇప్పుడు పరిస్థితులు అడ్డం తిరిగి, అదే మోడీ కరుణ కోసం దేబిరింపులు…

Ads

వర్తమానంలోకి వద్దాం… రేవంత్ రెడ్డి కాంగ్రెస్, మోడీ బీజేపీ… కానీ తెలంగాణ ప్రయోజనాల కోణంలో, డెవలప్‌మెంట్ స్కీమ్స్, నిధుల విడుదలకు సంబంధించి చాలా స్పష్టతతో ఉంటున్నాడు… మోడీ ప్రధాని, వయస్సులో పెద్ద… అందుకే తనను పెద్దన్న అంటూ కేంద్రం దగ్గర తెలంగాణకు రావల్సినవి సాధించుకునే ప్రయత్నం రేవంత్‌ది… తప్పు లేదు… రాజకీయానికీ- ప్రభుత్వ వ్యవహారాలకూ నడుమ ఓ విభజన రేఖ గీశాడు రేవంత్…

రాజకీయ విమర్శలు, సిద్ధాంతాల పోరాటం సరేసరి… అక్కడ తగ్గేది లేదు… కానీ కేంద్రం- రాష్ట్రం అనే సంబంధాల దగ్గర తను క్లియర్‌కట్‌గా ఒక ప్రధాని- ఒక సీఎం నడుమ సత్సంబంధాలు ఎలా ఉండాలో అలాగే వ్యవహరిస్తున్నాడు… నిన్న 9400 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభించిన వేదిక దగ్గర సీఎంగా మాత్రమే పాల్గొన్నాడు…

మోడీ

ఇక్కడ మరో విషయం… మోడీ ‘రేవంత్ జీ మేరేసేహీ జోడో’ అని నవ్వుతూ అన్నాడు రేవంత్‌ను ఉద్దేశించి… అదొక సరదా వ్యాఖ్య… పైగా అది డెవలప్‌మెంట్‌కు సంబంధించి… ‘రాజకీయాలు కాదు, కలిసి నడుద్దాం’ అనే ఓ పాజిటివ్ సూచన…

(దాన్ని పట్టుకుని ఇక బీఆర్ఎస్ క్యాంపు మళ్లీ ఓ విషప్రచారం ప్రారంభించింది… 1) బహిరంగంగానే రేవంత్‌ను బీజేపీలోకి రమ్మంటున్నాడు మోడీ 2) ఆల్రెడీ పవన్ కల్యాణ్ ఇంటికి, చంద్రబాబు ఇంటికి వెళ్లొచ్చాడు… ఇక ఆ టీడీపీ కూటమి ప్లస్ రేవంత్ కలిసి పనిచేస్తారు 3) తెలంగాణకు మరో డేంజర్…. ఇదీ ఆ నెగెటివ్ క్యాంపెయిన్…

నిజంగానే మోడీ గనుక రేవంత్‌ను బీజేపీలోకి రమ్మంటే… అంత బహిరంగంగా అడుగుతాడా..? దీనికి రేవంత్ రియాక్షన్ కూడా మోడీ సరదా వ్యాఖ్యకు దీటుగా ఉంది… ‘మీరు ‘వికసిత భారత్ 2047’ అని 30 ట్రిలియన్లు అంటున్నారు కదా, మేం కూడా దేశాభివృద్ధి విషయంలో  ‘రైజింగ్ 2047’ పేరిట మూడు ట్రిలియన్ల వాటా అందిస్తాం… మీరు సహకరించండి’ అన్నాడు…

అంతేకాదు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీ గుజరాత్‌కు ఇతోధికంగా నిధులిచ్చాడు, మాకూ అలాగే ఇవ్వండి, మేమూ డెవలప్ అవుతామన్నాడు… అదీ కాంగ్రెస్ నాయకుడి కోణంలో సమాధానం… పర్‌ఫెక్ట్… ఇదీ ఓ బీజేపీ నేతకూ, ఓ కాంగ్రెస్ నేతకూ నడుమ ఉండే విభజన రేఖ… రాజకీయాలకూ, ప్రభుత్వ వ్యవహారాలకూ నడుమ ఉండే విభజన రేఖ… ఫాఫం బీఆర్ఎస్… గత కేసీయార్ కాలం నాటి ఆ విద్వేషం కనిపించక, కడుపు రగిలిపోతున్నట్టుంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …
  • ఇది యూనివర్శల్… ఇంత భట్టీయం పుస్తకం మరొకటి లేదు…
  • ఖైదీకి మనసిచ్చింది… మనువాడింది… లవ్ జిహాద్ కాదు… రివర్స్…
  • మ్యాచులు పెద్దగా చూడటం లేదు… జియో ఆదాయానికి భారీ దెబ్బ…
  • వ్యూహకర్త నుంచి ‘మంత్రి’ వరకు.., విజయ్ కేబినెట్‌లో కీర్తన మెరుపులు..!
  • బాబు గారి పాలన అంటే అంతే మరి… జస్ట్, 9 సెకన్లకు ఓ ఫైల్ క్లియర్…
  • విజయ్‌లో ఓ సుగుణం… తక్కువ మాట్లాడతాడు… అవసరమైతే తప్ప…
  • ‘ఆపరేషన్ సిందూర్-2’ …. ఇదే సంభవిస్తే కథ పూర్తిగా వేరే ఉంటది..!!
  • ‘చక్రధారి’ స్టాలిన్..! పర్‌ఫెక్ట్ ‘చదరంగం’… మళ్లీ తన పెత్తనమే…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions