Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!

July 21, 2026 by M S R

.

ఓ మిత్రుడు అడిగాడు… మోడీషా ఫెయిల్యూర్ లేదా బొద్దింకల పార్టీ విషయంలో అని..! ఖచ్చితంగా ఉంది… భయం, పిరికితనం… ఖలిస్థానీ మద్దతుదారులు ఢిల్లీని ముట్టడించి, అరాచకం క్రియేట్ చేసినప్పుడు… మోడీ కాన్వాయ్‌ను పంజాబ్‌లో ఆఫ్టరాల్ ఒక ట్రాక్టర్ అడ్డుపెట్టి, భయానక పరిస్థితి క్రియేట్ చేసినప్పుడు… అనేక మెట్లు దిగివచ్చి, ప్రయోజనకరమైన వ్యవసాయ చట్టాల్ని సారీ చెప్పి ఉపసంహరించుకున్నప్పుడు… ఏ బ్లండర్స్ ఉన్నాయో… ఇప్పుడూ అవే బ్లండర్స్…

సీజేపీ అనేది ఓ నాన్సెన్స్ వేదిక… వాడెవడో గానీ వాడికి పొలిటికల్ అప్రోచ్ లేదు, గతం లేదు, వాడికి అసలు ఏ సిద్ధాంతమూ లేదు… కానీ ఎప్పుడైతే జాతి వ్యతిరేక శక్తుల గుప్పిట్లోకి వాడు వెళ్లిపోయాడో, వాంగ్‌చుక్ వంటి ద్రోహి అక్కడ చేరాడో… ప్రకాష్ రాజ్, లెఫ్ట్, అరుంధతీరాయ్, కేజ్రీవాల్, ఐఎస్ఐ-ఖలిస్థానీ శక్తులు ఎంటర్ అయ్యాయో అప్పుడే మోదీ కళ్లు తెరవాల్సింది…

Ads

సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్షను అన్నిరోజులపాటు కొనసాగనివ్వడమే ఓ బ్లండర్… సింపుల్‌గా చెప్పాలంటే ఈ దేశానికి మమత బెనర్జీ ఎంత ప్రమాదమో, అంతకు వందరెట్లు కేజ్రీవాల్ ప్రమాదం… ఢిల్లీ బయటి నుంచి జనాన్ని ఆర్గనైజ్ చేసి, ఆప్ కార్యకర్తలను ఢిల్లీకి రప్పిస్తున్నాడు, లాఅండ్ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ కాబోతోంది… అదీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు అనే సోయి మోదీకి లోపించింది…

లక్షలాది మంది ఆందోళనకారులు నగరంలోకి ప్రవేశించే వరకు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) గుర్తించడంలో విఫలమవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి… కేజ్రీవాల్ గురించి, పంజాబ్ నుంచి ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో గతంలో వ్యవసాయ ఆందోళనల్లాగే విషమ పరిస్థితులను క్రియేట్ చేసే ప్రమాదం గురించి ఏమాత్రం అంచనా లేదు, అరికట్టే చర్యలు లేవు…

సీజేపీ

దాదాపు లక్ష మందికి పైగా బయటి వ్యక్తులు నగరంలోకి చేరుకునే వరకు ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. చివరి నిమిషంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి మరింత దిగజారి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేసింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం దేశ ప్రతిష్టను మంటగలుపుతోంది…

కొత్త సీపీ నియామకం – “రాంగ్ టైమింగ్” విమర్శలు

ఈ సంక్షోభ వేళ, కేంద్ర ప్రభుత్వం 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ కుమార్ను ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న సతీష్ గోల్చాను పదవీకాలం పూర్తికాకముందే తప్పించి, ఐబీ (IB)లో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేసిన అనురాగ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.

అయితే, పార్లమెంట్ సమావేశాలకు కేవలం కొన్ని రోజుల ముందు, అది కూడా సోనం వాంగ్‌చుక్ నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ జరగనున్న తరుణంలో ఈ మార్పు చేయడం సరైన నిర్ణయం కాదు… ఇంత క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్న అధికారికి కేవలం మూడు రోజుల్లోనే మొత్తం పరిస్థితిని అద్భుతంగా కంట్రోల్ చేయమంటే ఎలా సాధ్యమవుతుంది..?

సోనం వాంగ్‌చుక్ డిమాండ్లు – కేంద్రంపై ఒత్తిడి

గత 18 రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్‌చుక్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టాడు. ఈ ఉద్యమంలో తనకు తోడుగా ఉన్నవారిలో సగం మందికి పైగా ‘ఆప్’ (AAP) పార్టీ మద్దతుదారులు… పంజాబ్ ఆప్ అంటేనే పక్కా ఖలిస్థానీ బాపతు… దానికితోడు లెఫ్ట్, యాంటీ హిందూ యాక్టివిస్టులు, జేఎన్‌యూ… ఐనా మోదీ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది…

నిజానికి బెంగాల్ ఎన్నికల విజయం తర్వాత బీజేపీ వరుసగా తప్పుడు అడుగులు వేస్తోందనే విమర్శలు వస్తున్నాయి…. ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపకపోతే ఇది దేశవ్యాప్తంగా పాకే ప్రమాదం ఉంది… ముఖ్యంగా పంజాబ్ సర్దార్లు ఇందులో జాయిన్ అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని, నిరసనకారుల ముసుగులో వేర్పాటువాద శక్తులు కూడా చొరబడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది…

బీజేపీ ముందున్న మార్గం ఏమిటి?

ఈ సంక్షోభాన్ని ముగించడానికి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడమా…? అస్సలు కాదు, ఎవరో ఒకరు నిరాహారదీక్ష చేస్తే కేంద్ర మంత్రిని తప్పిస్తే అది ఇండియా వంటి అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశానికే అప్రతిష్ట… రేప్పొద్దున ఇంకెవడో ఇదే ఆప్, ఇదే మమత ప్రోద్బలంతో మోదీ రాజీనామా కోరతారు, చేస్తాడా..? దేశంలో కోట్ల మంది ఎన్నుకున్న పార్టీ మరీ ఇంతగా బలహీనంగా, పిరికిగా వ్యవహరించడం నిజంగా విచిత్రమే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే
  • ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?
  • సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!
  • మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!
  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions