కోవాగ్జిన్ టీకాకు ముందస్తు అనుమతుల యవ్వారం రాజకీయంగా రచ్చరచ్చ చేస్తోంది… ఈ నేపథ్యంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నిన్న ఎక్కడో చేసిన ఓ వ్యాఖ్య ఇంట్రస్టింగు అనిపించింది… ‘‘అమెరికాలో ప్రెసిడెంట్-ఎలక్ట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్-ఎలక్ట్ కమలా హారిస్, ఇజ్రాయిల్ నెతన్యాహూ, రష్యా పుతిన్… అందరూ మొదటి టీకాకు మేం రెడీ అంటున్నారు… ఈ దేశ ప్రధాని మోడీ చప్పట్లు కొట్టమంటే కొట్టాం, దీపాలు పెట్టమంటే పెట్టాం, అది జనంలో ఓ భరోసాను నింపడానికే కదా… ఇప్పుడూ ఆ టీకా సురక్షితం అని చెప్పడానికి ప్రధాని ఫస్ట్ టీకా తీసుకుంటే బెటర్… అందరి అపోహలు, అన్నిరకాల సందేహాలకు జవాబు ఇస్తే తప్పేంటి..?’’….. ఇదీ తన అభిప్రాయం…
నిజమే కదా… తప్పులేదు,,, నిజానికి మంచి సలహా… రాజకీయ కోణంలో చూడాల్సిన పనే లేదు… భారత్ బయోటిక్ తయారుచేసే కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల ఫలితాలు రాకముందే, ముందస్తుగా అత్యవసర, పరిమిత వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇవ్వడం వివాదం… మన దేశంలో రాజకీయాలకు కొదువ ఏముంది..? ప్రజల ప్రయోజనాల్ని కూడా పట్టించుకోకుండా రాజకీయం చేయాల్సిందే కదా… కొందరు కాంగ్రెస్ నేతలు ఈ ముందస్తు అనుమతుల్ని తప్పుపట్టారు…
Ads
సీరం సీఈవో అయితే ఫైజర్, మెడెర్నా, ఆక్స్ఫర్డ్ తప్ప మిగతా టీకాలన్నీ నీళ్లతో సమానం అంటాడు… వేక్సిన్లు, ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి మన హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్‌కు మంచి పేరే ఉంది… ప్రొఫెషనల్స్… ఏ పార్టీ రంగూ లేదు… ఎండీ ఎల్ల కృష్ణ ఏమంటాడంటే..? ‘‘16 టీకాలు తయారు చేశాం, 123 దేశాలకు సేవలందిస్తున్నాం… ఏటా 70 కోట్ల టీకాలు తయారు చేయగలం… మన దేశప్రయోజనాల్ని మనమే దెబ్బ తీసుకునేందుకు తప్ప ఇలాంటి వివాదాలు దేనికీ అక్కరకు రావు… ఎబోలా వైరస్ ముందుస్తు, అత్యవసర వినియోగానికి గతంలో WHO కూడా రెండు దేశాలకు అనుమతించింది… ఇదేమీ కొత్త కాదు, అసాధారణం కాదు’’
మరీ తమ వేక్సిన్‌ను మంచినీళ్లతో పోల్చడం పట్ల బాధపడ్డాడు ఆయన… నిజమే, అత్యవసర వినియోగానికి అనుమతి అనేది మరీ బెంబేలెత్తాల్సినంత ప్రమాదకరం ఏమీ కాదు… అలాగని ఇప్పటివరకు ఈ టీకా ప్రతికూల ఫలితాలు కూడా ఏమీ కనిపించలేదు… పలు దేశాల్లోని 25 వేల మంది మీద ప్రయోగాలు సాగుతున్నయ్ కదా… ఇక్కడ అసలు విషయానికొద్దాం…
మరీ అఖిలేష్ విమర్శలు నాసిరకం, చిల్లర… అది బీజేపీ టీకా అంటాడు… టీకాలకు పార్టీల రంగులు కూడా ఉంటాయా..? ఇలాంటి నాయకులే దేశానికి అతిపెద్ద శాపం… తను అధికారంలోకి వచ్చాక ఫ్రీగా టీకాలిస్తాడట… తను టీకా మాత్రం వేసుకోడట… పక్కా మూర్ఖపు వాదన… మోడీ స్వయంగా తయారు చేయించిన టీకా, కాషాయం రంగులో ఉంటుంది, అది తీసుకోగానే బీజేపీ కార్యకర్తగా మారిపోతాడు అన్నట్టుగా ఉంది తన మాటల తీరు…
ఇక్కడ మన సైంటిస్టులను మనం అవమానించాల్సిన అవసరం లేదు, మన కంపెనీల ఉత్పత్తుల్ని మనం అనుమానించాల్సిన పనీ లేదు… ఫార్మా మాఫియాలో అనేక రాజకీయాలుంటయ్… విదేశీ కంపెనీల టీకాలకు కొమ్ముకాయాల్సిన గతీ అక్కర్లేదు… నిజంగానే భారత్ బయోటెక్ టీకా సురక్షితమే అని దేశప్రజలందరికీ అని చాటిచెప్పాలంటే ప్రధాని మోడీ ఆ ఫస్ట్ టీకా వేయించుకుంటే మంచిదే… కోవిషీల్డ్ అయినా పర్లేదు… ఇప్పటికే రాజకీయ పక్షాలు వేక్సిన్లకూ రాజకీయ రంగులు పూసి, జనంలో బోలెడన్ని అనుమాన విష బీజాలు నాటాయి… పోనీ, మోడీని పక్కన పెట్టేసి, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు మొదటి టీకా వేయండి… పర్లేదు…!!
Share this Article