.
భారత దేశ రాజకీయాల్లో అతి పెద్ద కంపు యవ్వారం… కుటుంబ పార్టీలు… వ్యక్తి కేంద్రిత పార్టీలు… అవినీతి, అక్రమాలు, అరాచకాలు, బంధుప్రీతి, తరాలకు సరిపడా కక్కుర్తి సంపాదన, శూన్య నైతికత… పైగా పెత్తనాలు, డాంబికాలు, పటాటోపాలు, చిన్న స్థాయి లీడర్ అయినా సరే… కాన్వాయ్స్, అనుచరగణం, అట్టహాసాలు, ఆడంబరాలు…
పైగా మగ వారసత్వాలు, యధావిధి వారస పోకడలు… కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా… ఈ దుర్వాసన మెజారిటీ ప్రాంతీయ పార్టీల్లో ఉన్నదే… ఈ నేపథ్యంలో ఓ ఫోటో మళ్లీ కాస్త వైరలవుతోంది… నచ్చింది… పైన చెప్పుకున్న లక్షణాలకు పూర్తి కంట్రాస్టు ఇది…
Ads
బీజేపీ అన్నా, బీజేపీ నాయకులన్నా… అకారణంగా ద్వేషించే వ్యక్తులు కోకొల్లలు… సిద్ధాంతం, రాద్దాంతం పక్కన పెడితే కొన్ని వ్యక్తిత్వ లక్షణాలను చెప్పుకోవాలి… అది చెప్పేదే ఈ ఫోటో… బహుశా ఇది రెండేళ్ల క్రితం నేషనల్ మీడియాలో వచ్చిందనుకుంటా…
ఉత్తరాఖండ్, నీలకంఠ మహాదేవ్ ఆలయం వద్ద ఇద్దరు మహిళలు ఆలింగనం చేసుకుంటున్న ఫోటో ఇది…
వీరిలో ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ సోదరి వసంతిబెన్, మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి దేవి…
ప్రధాని మోదీ చెల్లెలు వసంతిబెన్, రిషికేశ్ కు ప్రైవేట్ పర్యటనకు వెళ్లి దయానంద్ ఆశ్రమంలో బస చేసింది… ఆమె భర్త హన్సుముఖ్, కొంతమంది బంధువులు ఆమె వెంట ఉన్నారు… నీలకంఠ్ మహాదేవ్ ఆలయం, భువనేశ్వరి ఆలయం సందర్శించి, తిరుగు ప్రయాణంలో యోగి సోదరి శశి దేవిని ఆమె దుకాణంలో కలిసింది…
ఇదీ ఆ ఫోటో… ఓ పర్వత గ్రామంలోని ఆ దుకాణం ఎవరిదో కాదు, యోగి సోదరిదే… శశి దేవి పూజా సామాగ్రిని విక్రయించే ‘మా భువనేశ్వరి ప్రసాద్ భండార్’ అనే దుకాణాన్ని నడుపుతుంటే… ఆమె భర్త ‘జై శ్రీ గురు గోరక్షనాథ్ జీ’ పేరుతో చిన్న టీ దుకాణం నడుపుతున్నాడు… ఆమెది సాధారణ జీవితం… యోగి సోదరి కాదు, అక్కడ అందరికీ ఆమె శశి బెహన్…
యోగి తన కుటుంబసభ్యులను తన పదవి, తన హోదాలకు దూరంగా ఉంచేస్తాడు… తను సన్యాసి… నాథ్ పరంపరలో ఒక ఆశ్రమానికి అధిపతి… అలాగే మోడీ… ఏ కుటుంబసభ్యుడూ కనీసం తన అధికారిక నివాసానికి కూడా రారు… ఒకటీరెండుసార్లు అమ్మను తెచ్చుకున్నాడు… అంతే… ఆమె మరణించినప్పుడు కూడా సింపుల్‌గా కొన్నిగంటల్లోనే… ఏ పరామర్శల తంతులూ మొదలు కాకముందే అంత్యక్రియలు నిర్వహించారు…
పైన చెప్పుకున్న రాజకీయ కుటుంబాల పోకడకూ… ఈ ఇద్దరి కుటుంబసభ్యుల జీవితాలకూ తేడా గమనించండి… ఒక్కసారి మీ చుట్టూ ఉన్న అవినీతిమయ రాజకీయ కుటుంబాలను గుర్తుచేసుకొండి… విలువలు అంటే ఏమిటో… ఈ కంట్రాస్టు ఏమిటో అవగతమవుతుంది… అది చెప్పడానికే మళ్లీ ఈ ఫోటో, ఈ కథ..!!
ఏమాటకామాట… లెఫ్ట్ పార్టీల్లో ఈ జాఢ్యం కనిపించదు… అభినందనీయమే… ఒక్క పినరై విజయన్ తప్ప..!!
Share this Article