సోషల్ మీడియాలో బొచ్చెడు పోస్టులు కనిపిస్తాయి… ఉప్మా మీద వెటకారంగా… అదేసమయంలో ఉప్మా ప్రియుల కౌంటర్లు కూడా..! మొన్న తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ‘నాకు తమిళ వంటకాల్లో ఇడ్లి, దోశకన్నా ఉప్మా ఇష్టం, త్వరగా జీర్ణమయ్యే పొంగల్ కూడా ఇష్టమే’ అని ఓ సరదా కామెంట్ చేశాడు… (తమిళ వంటకాల్లో మాత్రమే ఉప్మా ఇష్టం…) నిజంగా ఆయన ఇష్టపడే భారతీయ వంటకాలు సహజంగానే గుజరాతీ వంటకాలు… ఉప్మా మీద కామెంట్ కూడా స్ట్రాటజిక్…
సరే, చూశారా, ప్రధాని మోడీయే ఉప్మాకు సర్టిఫికెట్ ఇచ్చాడు అని ఉప్మా ప్రియులు సోషల్ మీడియాలో సరదాగా సంబరపడిపోతుంటే, ఆఁ చెప్పాడులే, తను ఎప్పుడైనా ఉప్మా తిని ఉంటే కదా అని కౌంటర్లూ స్టార్టయ్యాయి… (కొన్నాళ్ల క్రితం సేలంలో 10 రూపాయలకు 4 ఇడ్లీలు అమ్మే ఓ హోటల్ వాటికి మోడీ ఇడ్లీలు అని పేరు పెట్టింది, అదీ ఇప్పుడు ప్రస్తావనలోకి వస్తోంది… అన్నట్టు, ఏదైనా తెలుగు చానెల్ గనుక ఆయన్ని ఇంటర్వ్యూ చేయగలిగితే… నాకు తెలుగు వంటకాల్లో ఉప్పుడు పిండి ఇష్టం అనే అంటాడా..?)
అదే మోడీ తంతిటీవీ ఇంటర్వ్యూలోనే మరో సందర్భంలో… ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన భాష తమిళం, తమిళ వంటలు ఇడ్లీ, దోశలాగే తమిళం కూడా ప్రపంచవ్యాప్త ఆదరణ పొందాల్సి ఉంది, ప్రతి తమిళుడు తన భాష పట్ల గర్వంగా ఫీల్ కావాలి, అదే సమయంలో తమిళ భాషను రాజకీయాల్లోకి లాగడం కూడా సరికాదు అని అభిప్రాయపడ్డాడు…
Ads
ఎస్, తంతి టీవీ ఇంటర్వ్యూలో తను కావాలనే తమిళుల మెప్పు పొందే అంశాలనే ప్రస్తావించాడు… టాక్ట్ ఫుల్‌గా మాట్లాడాడు… అసలు మీడియా ఇంటర్వ్యూలంటేనే ఇష్టపడని మోడీ తంతి టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడమే ఓ ప్రచార ఎత్తుగడ… తను ఎలాగూ డీఎంకే బాపతు చానెళ్ల జోలికి వెళ్లడు కదా…
సరే, కాసేపు ఈ ఉప్మా గోల వదిలేస్తే… మోడీ స్ట్రాటజిక్ అంశాల్నే ప్రస్తావించాడు… ఇందిర హయాంలో (1974) శ్రీలంకు కచ్చతీవు దీవిని అప్పనంగా ఇచ్చేసిందనే వ్యాఖ్య ఎన్నికల లబ్ధి కోసం చేసిందే… ఆ దీవి వద్ద ఎప్పుడూ శ్రీలంక నేవీ మన జాలర్లను అరెస్టు చేస్తుంటుంది, అక్కడ చేపల వేటను అడ్డుకుంటూ ఉంటుంది… (కచ్చతీవు సరే, నువ్వు బంగ్లాదేశ్‌కు అప్పనంగా ధారబోసిన వేల ఎకరాల జాగా మాటేమిటి అని ఆల్‌రెడీ కాంగ్రెస్ కౌంటర్ చేసింది…)
తమపై హిందీని రుద్దుతున్నారు అనేది కదా ఏనాటి నుంచో తమిళనాడు నిరసన… అందుకని జాగ్రత్తగా మోడీ తమిళ భాష ప్రాచీనత్వాన్ని, గొప్పదనాన్ని పొగుడుతూ ఆ హిందీ వ్యతిరేకతను చల్లబరిచే ప్రయత్నం చేశాడు… ఎలాగూ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ హిందీ రుద్దుడును తిడతాడు కదా… ‘మాకు తమిళనాడులో ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ లేకపోయినా సరే తమిళనాడు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయలేదు, నాకు వోట్లే ముఖ్యం కాదు, తమిళనాడు అభివృద్ధికి ఇంకా పొటెన్సీ ఉంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాజకీయ కోణంలో చూడను, చూడొద్దు, చూడలేదు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అంతే కదా అన్నాడు…
ఈసారి తమిళనాడు ప్రజలు యాంటీ-డీఎంకే వోటు కాదు, ప్రొ-బీజేపీ వోటు వేస్తారని విశ్వసిస్తున్నాను, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలైకి డబ్బు, హోదాలు కావాలంటే డీఎంకేలో చేరేవాడు గానీ బీజేపీలోకి ఎందుకొస్తాడు అనే వ్యాఖ్య చాలా స్ట్రాటజిక్… కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్ని మళ్లీ మళ్లీ ప్రస్తావించడం డీఎంకేకు కూడా తగిలేలా అన్నమాట…!!
Share this Article