.
నాన్సెన్స్… పెద్ద నోట్లు బ్లాక్ మనీకి కారణం అంటాడు ఓ మేధావి… వాడికి అంతకన్నా ఏమీ తెలియదు… ఇంకెవరో అవన్నీ రద్దు చేస్తాడు… అంతా ఆన్‌లైన్, యూపీఐ, ఫోన్ పేమెంట్స్…
ఖాతాలు లేనోడు ఏం చేయాలి..? మీ ఖర్మ అనుభవించండి… నాకు చదువు రాదు, ఈ యూపీఐ ఎలా మేనేజ్ చేయాలి… నీకు ఈ దేశంలోనే బతికే హక్కు లేదుఫో…
Ads
అయ్యో, సారూ, నాకు ఫోనే లేదు, స్మార్ట్ ఫోన్ ఎలా కొనుక్కోను..? చావు, నీకు అంతకు మించి శరణ్యం లేదు…
నిజం… ఇలాగే ఉంది పరిస్థితి… Faafam మోడీకి ఉన్న బుర్రే పరిమితం… ఎవడెంత గింజుకున్నా సరే, అదే నిజం… ఫార్మా డ్రగ్స్ రేట్ల దగ్గర నుంచి యూపీఐ చెల్లింపుల దాకా తనకు ఓ దిశ లేదు, ఓ దశ లేదు… తనకు ఏమీ తెలియదు… చివరకు టోల్ చెల్లింపుల దోపిడీ దాకా… సగటు మనిషి తనకు పట్టడు…
ప్రతి కేంద్ర మంత్రిత్వ శాఖలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఉంటారంటారు… మరీ ఘోరం… రోజురోజుకూ దిగజారడమే ప్రస్తుత సిట్యుయేషన్… సరే, ఆన్‌లైన్ చెల్లింపులకు వద్దాం… అందరూ ఆ చెల్లింపులకే అలవాటు పడ్డారు… బ్యాంకు నుంచి లక్ష తీస్తే ఛార్జీలు కట్… వేస్తే కట్… దిక్కుమాలిన దరిద్రం…
ఇది బ్లాక్ మనీ పెంపునకే ఉపయోగపడుతుందిరా అంటే ఎవడూ వినడు… అర్థమయ్యేవాడు అసలు ఎవడున్నాడని..! ఇది అక్షరాలా సైబర్ క్రైమ్‌కు ఉపయోగపడుతోంది… ఈ మాటంటే ఎవడికీ రుచించదు… ఒరేయ్, ఫిజికల్ కరెన్సీని మించిన ద్రవ్యవినిమయం ఏదీ లేదురా లోకంలో… దాన్ని నమ్మింది కాబట్టే, ఇండియా ఈరోజుకీ ఇంకా నిలబడింది…
పోనీ, ఈ డిజిటల్ కెరెన్సీ, ఆంక్షలతో బ్లాక్ మనీ తగ్గిందా..? అది నమ్మే మూర్ఖుడు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మూర్ఖుడు… ఛల్, నిర్మలా సీతారామన్‌ను వదిలేయండి, మోస్ట్ హోప్‌లెస్ కేరక్టర్… సైబర్ క్రిమినల్స్‌కు అతి పెద్ద ఛాన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్… పోనీ, సైబర్ క్రైమ్ విభాగాలకు ఏమైనా చేతనవుతుందా..?
ఆ క్రిమినల్స్ తెలివిలో వీళ్లకు ఉన్నది ఒక వంతు… పైగా క్రిమినల్స్ ఎవరెవరో బ్యాంకు ఖాతాల్ని హ్యాక్ చేసి వాడేసుకుంటున్నారు,., ఆ ఖాతాల లావాదేవీలను స్థంభింపజేసి బాధితులకు రిటర్న్ ఇవ్వాలి అంటే… బ్యాంకర్లు కోఆపరేట్ చేయరు… అక్కడెవడో ఆర్బీఐ దరిద్ర చైర్మన్ ఉన్నాడట… తొక్కలో అంబుడ్స్‌మెన్ మన్నూమశానం అన్నీ హోప్‌లెస్…
కేంద్రంలో ఒక్కడికీ సోయి లేదు, స్ట్రీమ్ లైన్ చేసే తెలివి లేదు… పోనీ, ఈ డిజిటల్ పెత్తనాల్ని తగ్గించండర్రా అంటే ఎవడూ వినడు… దిమాకులో చటాక్ ఉంటే కదా ఎవడికైనా..? ఏటా కొన్ని లక్షల కోట్ల సైబర్ నేరాలు… రాష్ట్రాలకు చేతనయ్యేది ఏమీ లేదు… కేంద్రానికి ఏమాత్రం సోయి లేదు… అక్షరాలా దురవస్థ ఇదే… అంతటి మేఘా ఇంజనీరింగ్ వాడే కోట్లు పోగొట్టుకున్నాడు సైబర్ క్రైమ్‌తో… మామూలు ప్రజలెంత..?
సోషల్ మీడియాలో ప్రచారాలే ఈ సైబర్ క్రైమ్‌కు ఆలవాలం… కానీ నియంత్రణ ఏది..? దిక్కుమాలిన ప్రభుత్వం… చివరకు సుప్రీంకోర్టు కూడా మీరు సాయం చేస్తారా..? మమ్మల్ని చర్యలు తీసుకొమ్మంటారా అనడిగింది… మోడీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి…!! మోడీ వానాకాలం చదువుకు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు, కనీసం ఆ నిర్మలమ్మను తరిమేసి కాస్త బుద్ధీజ్ఞానం ఉన్నవాళ్లను ఆర్థికమంత్రిగా చేస్తే జనానికి మేలు…!!
Share this Article