పార్ధసారధి పోట్లూరి ……….. Modi Vs George Soros! Rare Earth Elements or Minerals [REE]- అరుదయిన భూ ఖనిజములు! లిథియం ! రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేదా మినరల్స్ – REE గురుంచి ఆసక్తికరమయిన కధనం ! జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా [GSI] ఇటీవలే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసి [Reasi District ] జిల్లాలో కల సలాల్ [Salal Village] అనే గ్రామంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుక్కుంది !
నిజమా ? 2023 లో భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుక్కున్నారు అనేది పచ్చి అబద్ధం ! 1996 లోనే లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుక్కున్నారు ! కానీ ఈ విషయం చాలా జాగ్రత్తగా దాచిపెట్టడం జరిగింది ! దాచిపెట్టడం దేనికోసం ? రహస్యంగా ముడి లిథియం ని చైనాకి తరలించడానికి గాను విషయాన్ని రహస్యంగా ఉంచారు !
1996 నాటికి లిథియం వాడుకలో ఉంది కానీ చాలా ఖరీదు అప్పట్లో. శాటిలైట్ మరియు మిలటరీ ఎక్విప్మెంట్ లో మాత్రమే వాడేవారు ! నిజానికి 1996 నాటికి ప్రపంచ వ్యాప్తంగా నికేల్ కాడ్మియం [Ni-Cad] బాటరీలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. ఇవి రీచార్జ్ చేసుకోవచ్చు దీర్ఘకాలంగా. అయితే Ni Cad బాటరీల జీవిత కాలం 2 ఏళ్లు. కానీ అప్పట్లో ఇదే చవకగా దొరికేది. అప్పటికి ఇంకా లెడ్ యాసిడ్ బాటరీలు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి.
Ads
************************
1996 నాటికి లిథియం గనుల తవ్వకం, దానిని శుద్ధి చేసి లిథియం కార్బైడ్ గా మార్చి వాడుకునే టెక్నాలజీ మన దేశంలో లేనే లేదు. ఇప్పటికీ లేదనుకోండి ! కానీ చైనాకి లిథియం గనుల తవ్వకంతో పాటు దానిని బురద, రాళ్ళ నుండి విడదీసి శుద్ధి చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది అమెరికా సహాయంతో ! చైనాకి తెలుసు 2000 తరువాత ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ, అమ్మకాలు జోరు మీద ఉంటాయని. వాటికి లిథియం బాటరీల అవసరం ఉంటుంది !
అంటే లిథియం ప్రాసెసింగ్ లో చూస్తే చైనాకి 30 ఏళ్ల అనుభవం ఉంది. కానీ లిథియం అనేది అంత విస్తృతంగా దొరికే మినరల్ కాదు. లిథియం అరుదుగా దొరికే ఖనిజం [Rare Earth Element]. కానీ ప్రాసెసింగ్ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. భూమి, వాయువులు కలుషితం అవుతాయి ప్రాసెసింగ్ చేసే దశలో ! అసలు ఇది లిథియం అని గుర్తించే టెక్నాలజీ అప్పట్లో అమెరికా, చైనాల దగ్గర తప్పితే వేరే దేశాల దగ్గర లేదు. ముందు చూపు లేని మన పాలకుల సంగతి చెప్పేది ఏముంటుంది ?
**************************
కాశ్మీర్ – ఉగ్రవాదం అడ్వాంటేజ్ !
1996 లో కాశ్మీర్ తో పాటు జమ్మూలో కూడా పరిస్థితి అంత బాగుండేది కాదు. కాబట్టి అక్కడ ఎలాంటి తవ్వకాలు చేసినా బయటి ప్రపంచానికి తెలిసేది తక్కువ ! అవసరం అయితే జమ్మూ నుండి PoK ద్వారా చైనాకి తరలించవచ్చు ఎవరికీ తెలియకుండా ! కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఎంత బలంగా ఉంటుందో మనకి తెలియనిది కాదు. 2004 తరువాత లిథియం విషయంలో కదలిక వచ్చినా దానిని మరుగునపెట్టి రహస్యంగా తరలించాలని ప్రయత్నాలు జరిగాయి కానీ ఎందుకో అది సాధ్యపడలేదు.
UPA రెండవ టర్మ్ మొదలయ్యాక లిథియంని తరలించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. 2011 లో చాలా విలువ అయిన ఖనిజాలని చైనాకి తరలించారని వార్తలు వచ్చాయి కానీ అవి ఏమిటో బయటపడలేదు. కొంతమంది సెమీ కండక్టర్ పరిశ్రమకి అవసరం అయిన సముద్రపు ఇసుకని [సముద్ర తీరంలో దొరికే ఇసుకలో సిలికాన్ ఎక్కువగా ఉంటుంది ] చైనాకి తరలించారని అనుకున్నారు. మరి కొంతమంది ముడి యూరేనియంని కాంగ్రెస్ చైనాకి అమ్ముకుంది అన్నారు కానీ ఇతమిద్ధంగా ఇదీ అని ఎవరికీ తెలియదు. కానీ మొత్తానికి ఏదో తరిలిపోయింది చైనాకి…
********************************
2008 లో చైనాలో జరిగిన ఒలంపిక్స్ గేమ్స్ కి చైనా సోనియాకి ఆహ్వానం పంపింది కానీ మన్మోహన్ సింగ్ కి కాదు ! కానీ అనుమానం రాకుండా సోనియాతో పాటు మన్మోహన్, రాహుల్ బీజింగ్ కి వెళ్లారు. వీళ్ళు వెళ్ళింది పేరుకే బీజింగ్ ఒలంపిక్స్ కి… కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తో కాంగ్రెస్ పార్టీ MoU కుదుర్చుకుంది అన్న సంగతి బయటపడ్డది. దేనికోసం MoU చేసుకున్నారు ? ఎవరికీ తెలియదు.
భారత ప్రధాని అయిన మన్మోహన్ వెనక నిలబడి ఉండగా, దర్జాగా కుర్చీలో కూర్చొని రాహుల్ చైనా అధ్యక్షుడితో సంతకాలు చేయడం ఆ వెనుకనే అప్పటి చైనా వైస్ ప్రెసిడెంట్ జింగ్ పింగ్ లు ఉండడం ఫోటోలలో స్పష్టంగా ఉంది. 1996 లో బయటపడ్డ లిథియం నిక్షేపాల తరలింపు కోసమేనా ఆ MoU ? 2008 తరువాత UPA 2 ప్రభుత్వంలో ఒక్కో కుంభకోణం వరసగా బయటపడం వలన లిథియం తరలింపులో ఆలస్యం అయ్యిందా ? 2014 ఎన్నికలలో మళ్ళీ UPA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ధీమాతో కాలయాపన చేశారా లిథియం తరలింపులో ? చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు దొరకనివి !
*****************************
2019 నుండి ప్రపంచవ్యాప్తంగా ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ జోరు అందుకుంది. యూరోపులో 2030 కల్లా 50% ఎలెక్ట్రిక్ వాహనాలని వాడకంలోకి తీసుకురావాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మన దేశంలో అయితే మోడీ 2025 కల్లా డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే మారుతి సుజుకి తన డీజిల్ ఇంజిన్ వర్షన్స్ తగ్గించుకుంటూ వస్తున్నది. రెండేళ్ల క్రితం సుజుకి డీజిల్ ఇంజిన్ R&D ని ఆపేసింది. టొయోటాతో కలిసి సుజుకి ఇంజిన్ల ని తయారుచేయాలని ఒప్పందం కూడా చేసుకుంది. 2030 ల నాటికి భారత్ లో 50% ఎలెక్ట్రిక్ వాహనాల వాడకం ఉండాలి అని నిర్దేశించుకుంది. దీని మీద మోడీ ప్రకటన కూడా చేశారు.
నిజానికి లిథియం అయాన్ బాటరీల ఉత్పత్తి లో 2018 నాటికే చైనా అగ్ర స్థానంలో ఉంది. 2020 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాలకి కావాల్సిన లిథియం అయాన్ బాటరీలని సప్లై చేయడానికి కావాల్సిన ముడి సరుకుని సిద్ధం చేసింది. ఆర్డర్ ఇచ్చిన నెల రోజులలోపే ఎన్ని బాటరీలు కావాలంటే అన్ని సప్లై చేయగల స్థితిలో ఉన్నాము అని చైనా ప్రకటించింది ! ప్రపంచం మొత్తానికి కావాల్సిన లిథియం అయాన్ బాటరీలకి కావలసినంత లిథియం చైనా దగ్గర ఉందా ? చైనా దగ్గర అంత పెద్ద మొత్తంలో లిథియం ఎక్కడి నుండి వచ్చింది ?
నిజానికి అమెరికా దగ్గర లిథియం నిల్వలు ఉన్నాయి. దశాబ్దాలుగా అమెరికాకి అనుభవం ఉంది లిథియం సేకరణ, ప్రాసెసింగ్ విషయంలో ! అమెరికా లిథియంని సప్లై చేస్తున్నది అన్ని దేశాలకి కానీ బాటరీలు కాదు. ఎలాన్ మస్క్ తన టెస్లా ఎలెక్ట్రిక్ కార్ల తయారీ కోసం చైనాని ఎంచుకోవడం వెనుక చైనాలో Li సప్లై చైన్ చాలా వేగంగా ఉండడమే కారణం. బాటరీ గ్రేడ్ లిథియం కార్బొనేట్ ఒక టన్ను ధర అంతర్జాతీయ మార్కెట్ లో $74,000 డాలర్లు పలుకుతున్నది! ఇది 2022 లో ఉన్న ధర మాత్రమే ! డిమాండ్ సప్లై సూత్రం ఆధారంగా ముందు ముందు ఒక టన్ను లిథియం కార్బొనేట్ ధర ఒక లక్ష డాలర్ల వరకు వెళుతుంది అని అంచనా ! (ఈ కథనంలో అంశాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)
Share this Article