ఓ వ్యక్తి ఓ ఫోటో పంపించాడు… ఇది నిజమేనా సారూ అనడిగాడు… ఫోటో చూడగానే నాకు విషయం ఏమిటో అర్థమైంది… కానీ నీకెక్కడిది ఈ ఫోటో అనడిగాను… బోలెడు వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది… ఫోటోతోపాటు బోలెడు వ్యాఖ్యలున్నాయి… ‘‘ఒకవైపు లక్షలాది మంది రైతులు రాజధానిని ముట్టడించి, మా పొట్టగొట్టకు, ఆ అంబానీకి దోచిపెట్టకు అని మొరపెట్టుకుంటున్నారు… దేశమంతా సంఘీభావంగా నిరసనలు సాగుతున్నాయి… అవేమీ పట్టని మన మోడీ గారు తన ప్రియమిత్రుడైన అంబానీకి మనమడు పుడితే, వెంటనే హాస్పిటల్ వెళ్లి, చూసి, అభినందించి, ఆశీర్వదించి వచ్చాడు… ఇంత అన్యాయమా..?’’ ఇలా సాగుతున్నాయి ఆ వ్యాఖ్యలు అని చెప్పాడు…
మరి నువ్వేం అనుకుంటున్నావ్ అనడిగాను… ‘‘నాకయితే నిజమే కదా అనిపించింది చదవగానే… రైతుల సందేహాలను తీర్చి, రైతుల కోరికను మన్నించని పాలకుడు దుర్మార్గుడే కదా’’ అన్నాడు.. ఓసారి ఆ ఫోటో చూడండి…
Ads
జస్ట్, ఒకసారి అలాగే చూడగానే మనకూ అలా అనిపిస్తుంది ఓసారి… కానీ నిజం కాదు… ఫేక్… ఫేకర్… ఫేకెస్ట్… జస్ట్, ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి మోడీ మొహాన్ని… హిమాలయ రుషుల్లాగే అడుగు పెరిగిన గడ్డం… అడవిలా జుత్తు… తెల్లటి గుబురు నడుమ మొహం… మరి ఈ ఫోటో చూడండి… జస్ట్, ట్రిమ్ చేసిన గడ్డం, జుత్తు… అంటే ఇది ఎప్పటిదో పూర్వకాలం నాటి ఫోటో అని ఇట్టే తేలిపోతుంది కదా…
అన్నింటికీ మించిన ప్రబలమైన సూచిక ఏమిటంటే…? మోడీ వెనుక చేతులు కట్టుకుని మన విద్యాసాగరుడు నిలుచుని ఉన్నాడు… అంటేనే మనకు అర్థం కావాలి… విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు ముంబైలో ఏదో వేరే కార్యక్రమంలో మోడీ పాల్గొన్న చిత్రం అయి ఉండవచ్చునని…!
నిజమే… ఇది 2014 నాటి ఫోటో… రిలయెన్స్ సంస్థ నిర్మించిన HN Reliance Foundation Hospital ప్రారంభించడానికి వెళ్లినప్పటి ఫోటో… హాస్పిటల్‌లోని ఓ వార్డులో డాక్టర్లతో ఏదో మాట్లాడుతున్నప్పటి ఫోటో… ఫోటోలోనే నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నారు… అదీ అసలు నిజం…
అసలు ఇలాంటి ప్రచారాలకు వాట్సప్ యూనివర్శిటీ ఫేమస్… అది ఒక కళ… అందులో కాషాయిష్టులే మంచి నిష్ణాతులు… దాన్ని కాపీ కొట్టాలంటే కూడా కాస్త తెలివి కావాలి… नक़ल करने के लिए भी अक्ल की जरुरत हैं అంటారు అందుకే… ఎహె, ఊర్కోవయ్యా… ఈ ఫేక్ ప్రచారాల్లో ఏ రాజకీయ పార్టీ తక్కువ కాదు… అందరూ ఏక్సే బడ్కర్ ఏక్ అంటారా..? అవును, కరెక్టు… కాస్త గ్రేడ్లు తక్కువ, ఎక్కువ… అంతే తేడా… అందరూ అందరే… ఇది మాత్రం ఫేకే…!!
Share this Article