Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంతకీ ప్రధాని తన సెలవు చీటి రాస్తే… ఎవరు సాంక్షన్ చేయాలి..?

August 2, 2026 by M S R

.

ప్రధానికి సెలవా..? లీవ్ లెటర్ ఎవరికి రాయాలి బాస్..? ” ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు… దేశం కోసం కష్టపడుతున్నాడు, ఈ కొత్త తరానికి ఏం తెలుసు? తనను తిడితే బాధేసింది” అని పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం దగ్గర వ్యాఖ్యానించాడు…

సరే, నాలుగు మెచ్చుకోలు మాటలు… రాజకీయాల్లో సహజం… ప్రధాని కరుణాకటాక్ష వీక్షణాల కోసం చాలామంది చేసేదే… అయితే ఇక్కడే వెంటనే ఓ సరదా సందేహం వచ్చింది…

Ads

అసలు ప్రధానికి సెలవు ఉంటుందా? మనం లీవ్ కావాలంటే బాస్‌కి మెయిల్ పెడతాం. బాస్ లీవ్ కావాలంటే ఇంకో బాస్‌కి, అంటే తన పై బాస్‌కి పెడతాడు. కానీ దేశానికి బాస్ అయిన ప్రధాని సెలవు పెట్టాలంటే… ఎవరికీ రాయాలి?

“డియర్ రాష్ట్రపతి గారు… నాకు మూడు రోజుల క్యాజువల్ లీవ్ కావాలి. దేశాన్ని కాస్త చూసుకోండి. Yours faithfully, Prime Minister…” అలా రాస్తే రాష్ట్రపతి గారు “Leave Sanctioned” అని సంతకం పెడతారా?

లేక… “సెలవు మంజూరు చేయలేము. చైనా బోర్డర్ దగ్గర కాస్త టెన్షన్ ఉంది. దయచేసి డ్యూటీలో కొనసాగండి” అని రాస్తారా? ‘మీ సీఎల్ కోటా పూర్తయింది’ అంటారా..?

modi

అసలు ప్రధాని ఉద్యోగం టైమ్ ఆఫీస్‌లో వేలిముద్ర వేసి వెళ్లేది కాదు. 9 to 5 అసలే కాదు.  ఆయన ఎక్కడుంటే అక్కడే ప్రధాని కార్యాలయం. విదేశాల్లో ఉన్నా, విమానంలో ఉన్నా, సముద్రం మధ్యలో నౌక మీద ఉన్నా… ఆన్ డ్యూటీయే… పీఎంవో కంటాక్టులో ఉండాల్సిందే.

అందుకే “ప్రధాని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు” అనేది వినడానికి గొప్పగా ఉంటుంది. కానీ నిజానికి… ప్రధాని పదవికే సెలవు అనే ఆప్షన్ ఉందా? అనేదే అసలు ప్రశ్న. ఉండదు అనేది సమాధానం.

ఇంకా ఒక డౌట్… వేరే దేశాల్లో ఎవరైనా మీడియా ఇలా అడుగుతుందా? “బ్రిటన్ ప్రధాని ఈ ఏడాది ఎన్ని CL లు, ఎన్ని EL లు వాడుకున్నారు?”

“అమెరికా అధ్యక్షుడి లీవ్ బ్యాలెన్స్ ఇంకా ఎంత మిగిలి ఉంది?” అని హెడ్‌లైన్లు కనిపిస్తాయా? అందుకే… ఈ “సెలవు” చర్చ కంటే, ఆ పదవిలో ఉన్న వ్యక్తి పని ఎలా చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అన్నదే అసలు చర్చ కావాలి.

లేకపోతే… రేపు ఇంకొక నాయకుడు వచ్చి, “నేను 25 ఏళ్లలో ఒక్కరోజు కూడా లంచ్ బ్రేక్ తీసుకోలేదు!” అంటే… దానికీ చప్పట్లు కొట్టాల్సి వస్తుంది!



వాట్సాప్ యూనివర్సిటీలో వెతికితే నెహ్రూ , ఇందిరాగాంధీ , లాల్ బహుదూర్ శాస్త్రి ఎన్నేసి రోజులు సెలవు పెట్టారో ఆ జాబితా దొరకొచ్చు… మరీ వివరంగా అడిగితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హఠాత్తుగా విదేశాలకు మాయమైపోతాడు కదా, వాటినీ సెలవుల జాబితాలో చేర్చొచ్చు… కానీ సీఎంలు, పీఎంలకు సెలవులు ఉండవు బాసూ… నోట్ దిస్ పాయింట్!!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?
  • Awarapan-2 … అనూహ్యంగా హిట్ – భారీగానే వసూళ్లు !!
  • Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?
  • ఓడలు బళ్లు – బళ్లు ఓడలు … వెస్టిండీస్ – బంగ్లాదేశ్ మంచి ఉదాహరణ
  • షావుకారు జానకి ! ఆ అన్నపూర్ణ ఎందుకు గుర్తొస్తున్నదీఅంటే !!
  • రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం మోకాలడ్డు – ఎందుకంటే..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions