.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే… మొదలైంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వివక్ష..! ప్రధానిని పెద్దన్న అంటూనే… పార్టీపరమైన పోరాటం వేరు, కేంద్రం- రాష్ట్రం సంబంధాల విషయంలో నిక్కచ్చిగా, పద్ధతిగా, తెలంగాణ వృద్ధికి అవసరమైనట్టుగా వ్యవహరిస్తానని రేవంత్ రెడ్డి మొదటి నుంచీ ఓ క్లారిటీని ప్రదర్శిస్తూనే ఉన్నాడు…
కానీ… తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, బీజేపీ వివక్షను చూపిస్తూనే ఉంది… ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు అక్షరాలా ప్రేక్షక పాత్రలు పోషిస్తున్నారు… పూర్వపరాల్లోకి వెళ్దాం…
Ads
లోకసభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ… 2019 నుంచి 2025 వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి జమ అయిన మొత్తం, తిరిగి తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందనే వివరాల్ని వెల్లడించాడు… (నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తరువాత వివరాలు విడివిడిగా ఇస్తే అసలు వివక్ష ఇంకా తేటతెల్లం అయ్యేది…)

రాజకీయంగా… బీజేపీని బదనాం చేయడానికి కేసీయార్ పైపైన గాయిగత్తర చేసినా… లోలోపల బీఆర్ఎస్, బీజేపీ రహస్య దోస్తీ కొనసాగింది… బీఆర్ఎస్‌ను ఎలాగూ బీజేపీలో విలీనం చేస్తాడని నమ్మకం, ఆ ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహాయకారిగానే నిలిచింది… ఇప్పటికీ ఆ విలీనం జరుగుతుందనే నమ్ముతున్నారు చాలామంది…

ఇదీ లెక్క… 2019 నుంచి 2023 వరకు పన్నుల రూపంలో తెలంగాణ చెల్లించిన సొమ్ముకన్నా కాస్త ఎక్కువే ఇచ్చింది కేంద్రం… చివరి రెండేళ్లు చూడండి… మనం ఇచ్చినదానికీ, కేంద్రం చెల్లించినదానికీ ఎంత తేడా భారీగా మారిపోయిందో…!
ఎస్, సైన్యం, కేంద్రం పాలన ఖర్చులు ఎట్సెట్రా ఉంటాయి… రాష్ట్రం నుంచి వసూలైన మేరకు తిరిగి ఇవ్వాలని ఏమీ లేదు, అలా ఇస్తే కేంద్రం బండి నడవదు… కానీ తమ పాలన ఉన్నచోట ఒకలా… కాంగ్రెస్, ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నచోట మరొకలా ఉండటం ఏమిటనేదే ప్రశ్న…
Year-wise Contribution Ratio (₹ given for every ₹1 received)
2019–20
• Funds received: ₹48,873 cr
• Taxes collected: ₹34,388 cr
➡️ ₹0.70 given for every ₹1 received
⸻
2020–21
• Funds received: ₹60,590 cr
• Taxes collected: ₹35,243 cr
➡️ ₹0.58 given for every ₹1 received
⸻
2021–22
• Funds received: ₹62,562 cr
• Taxes collected: ₹51,353 cr
➡️ ₹0.82 given for every ₹1 received
⸻
2022–23
• Funds received: ₹70,068 cr
• Taxes collected: ₹63,908 cr
➡️ ₹0.91 given for every ₹1 received
⸻
2023–24
• Funds received: ₹67,786 cr
• Taxes collected: ₹1,17,820 cr
➡️ ₹1.74 given for every ₹1 received
⸻
2024–25
• Funds received: ₹66,295 cr
• Taxes collected: ₹1,33,208 cr
➡️ ₹2.00 given for every ₹1 received
చూశారుగా లెక్క… 2023-24 లో 1.17 లక్షల కోట్ల పన్నులు వసూలు చేసి ఇస్తే, కేంద్రం ఇచ్చింది 67 వేల కోట్లు… అంటే 1.74 మనం ఇస్తే కేంద్రం రూపాయి ఇచ్చింది… 2024-25 (పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వకాలం) లో మనం కేంద్రానికి రెండు రూపాయలు ఇస్తే, కేంద్రం తిరిగి ఇచ్చింది కేవలం ఒక రూపాయి, అంటే సగం…
వివక్ష నిజం… రేపు ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి కలవబోతున్నాడు… గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించడం కోసం… రేవంత్ రెడ్డి ఎంత సానుకూల ధోరణతో ఉన్నా సరే, మోడీ మాత్రం రేవంత్ రెడ్డిని కేవలం ఓ కాంగ్రెస్ నాయకుడిగా మాత్రమే చూస్తున్నాడు… దాని ప్రభావం తెలంగాణకు ఇచ్చే నిధులపై పడుతోంది…
చివరగా… తెలంగాణ మలి దశ ఉద్యమం జరిగిన నినాదం… నీళ్లు, నిధులు, నియామకాలు… ఇందులో నిధులు అనే లక్ష్యానికి, ఆశయానికి, అవసరానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం రాజకీయ ఉద్దేశాలతో ఎలా తూట్లు పొడుస్తున్నదో చెప్పటానికి ఈ లెక్కలు చాలు కదా..!!
Share this Article