Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ కర్కోటకుల పేర్లే చిరంజీవి, మోహన్‌బాబు సినిమా టైటిల్…!

March 23, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. ఈ భిల్లా రంగాలు ఆ భిల్లా రంగాలు కారు . ఆ భిల్లా రంగాల గురించి ఇప్పటి తరం వాళ్ళకు తెలియక పోవచ్చు . అప్పటి తరం వాళ్ళు మరచిపోయి ఉండవచ్చు .

వాళ్ళు ఎవరంటే 1978లో దేశంలో సంచలనం సృష్టించిన ఇద్దరు కిరాతకులు . 1978 ఆగస్టు 26న ఢిల్లీలో గీత , సంజయ్ చోప్రా అనే ఇద్దరు పిల్లల్ని డబ్బు కోసం కిడ్నాప్ చేసి ఆనక రాక్షసంగా చంపేసారు .

Ads

నిర్భయ కేస్ ఎలా అయితే సంచలనం సృష్టించిందో ఈ కేసు కూడా అంతే సంచలనం సృష్టించింది . దేశమంతా విషాదం నిండిపోయింది . ఆ కిరాతకులు ఇద్దరినీ 1982 జనవరి 31న ఉరి తీసారు .

ఈ సినిమా వచ్చినప్పుడు చాలామంది ఆ కధేమో అనుకున్నారు . ఈ కధ వేరు . ఇద్దరు యువకులు ఒకే విలన్ని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు . ఆ ప్రయత్నంలో కలిసి , కొట్టుకుని , మళ్ళా కలిసి విలన్ని పోలీసులకు అప్పచెపుతారు . కధ రొటీన్ రివెంజ్ కధే అయినా దర్శకుడు కె యస్ ఆర్ దాస్ సినిమాను పరుగెత్తిస్తాడు . కమర్షియల్ గా కూడా పర్లేదు.

(ఐతే కర్కోటకుల పేర్లను మెయిన్ లీడ్స్‌కు పెట్టడం జనానికి అప్పట్లో పెద్దగా జనానికి నచ్చలేదు… మరీ తాళ్లు కట్టుకుని, తాళాలు వేసుకుని కొట్టుకుంటారు ఈ ఇద్దరూ… ఫైట్లు ఎక్కువైపోయాయి కూడా…)

ఈ సినిమాలో మరో విశేషం ఉంది . ఇద్దరు హీరోలు చిరంజీవి , మోహన్ బాబుల తండ్రులు కూడా చిరంజీవి , మోహన్ బాబులే . ఇద్దరికీ ద్విపాత్రాభినయం ఉంది . ఇద్దరు హీరోలు పోటాపోటీగా నటించారు . ఇద్దరు తండ్రులూ పోటాపోటీగా నటిస్తారు .

మోహన్ బాబు తండ్రి కత్తులు విసరటంలో నిష్ణాతుడు . ఆ నైపుణ్యం కొడుకు మోహన్ బాబుకి కూడా వస్తుంది . చిరంజీవి తండ్రి పోలీస్ ఆఫీసర్ . కొడుకు చిరంజీవి సిఐడి ఆఫీసర్ అవుతాడు .

సినిమాలో నాలుగు పాటలు ఉంటే మూడు పాటలు చిరంజీవితో , ఒక పాట మోహన్ బాబుతో ఉంటాయి . నాలుగూ హుషారుగానే ఉంటాయి . జయమాలినితో ఉండే క్లబ్ డాన్సులో జయమాలిని కూడా చిరంజీవితో డాన్స్ చేయలేకపోతుంది . అంత ఫాస్ట్ డాన్సర్ చిరంజీవి . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో అలరిస్తాయి .

వేటూరి వ్రాసిన నా పేరే భిల్లా ఇటు రావేమే పిల్లా పాట చిరంజీవి , జయమాలినిల మీద చిత్రీకరించబడింది . ఈ పాట బయట కూడా హిట్టయింది . బాలసుబ్రమణ్యం , రమోలా పాడారు . ఆయన వ్రాసిందే మరో పాట పిల్లకి తెస్తా పల్లకి శ్రావ్యంగానే ఉంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిన పాటలు ఎదురుగ నీవు పదునుగ నేను , కదలిపోయే కావేరి ఒదిగిపోయె వయ్యారి బాగుంటాయి .

ఇద్దరు హీరోలకు హీరోయిన్లుగా స్వప్న , శ్యామల గౌరి నటించారు . టైటిల్సులో శ్యామల అనే వేసారు . శ్యామల గౌరి విజయనిర్మల ఫౌండ్ . ప్రేమ సంకెళ్ళు హీరోయిన్ . తరంగిణి ద్వారా పాపులర్ అయింది .

ఇతర పాత్రల్లో ప్రభాకర్ , త్యాగరాజు , రావి కొండలరావు , భీమరాజు , పి ఆర్ వరలక్ష్మి , ప్రభృతులు నటించారు . ఈ సినిమాకు కధ , డైలాగుల్ని ఆదుర్తి నరసింహమూర్తి అందించారు . మోహన్ బాబు గోల్ మాల్ సాలే డైలాగ్ బాగా పాపులర్ అయింది . ఈ సంవత్సరం వీరిద్దరి పట్నం వచ్చిన పతివ్రతలు , భిల్లా రంగా రెండూ సక్సెస్ అయ్యాయి .

1982 అక్టోబరు 15న వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . చిరంజీవి , మోహన్ బాబుల అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . అభిమానులు కాకపోయినా చూడొచ్చు . చూడబులే . An action-oriented K S R Das mark ఢిష్యూం ఢిష్యూం entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions