.
మొత్తానికి దర్శకుడు అనిల్ రావిపూడి నైపుణ్యంతో ఫ్లాపుల దశ నుంచి చిరంజీవి ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టే కదా ‘మన శివశంకర ప్రసాద్ గారు’ సినిమాతో..!
ఈ సినిమా ప్రధాన ఆకర్షణల్లో చిరంజీవి వింటేజ్ లుక్కు, వెంకటేష్ అతిథి పాత్ర, నయనతార ప్రజెన్స్ కూడా ముఖ్యమే… సేమ్, ఇలాగే చిరంజీవిని తన పాత సినిమాల లుక్కులోకి తీసుకుపోయి, అదే నయనతార మళ్లీ జతకడితే… ఈసారి మరో పెద్ద నటుడు అతిథి పాత్ర పోషిస్తే..?
Ads
ఈ చర్చ ఆల్రెడీ ప్రారంభమైంది… ఎందుకంటే..? వాల్తేరు వీరయ్య సినిమా అంటే చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్… ఇప్పటికే విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమాను లైన్‌లో పెట్టారు కదా… అంతకుమించి చిరంజీవి కోసం… ఏకంగా మోహన్‌లాల్ అతిథి పాత్రలో, ఐశ్వర్య రాయ్ హీరోయిన్‌గా ఇంకో సినిమా ప్రతిపాదనల్లో ఉందని వార్తలు వచ్చాయి… కానీ..?

మోహన్‌లాల్‌కు బాబీ కొల్లికి ఎంత దోస్తానా ఉన్నా సరే… ఈ అతిథి పాత్ర కోసం ఏకంగా 30 కోట్లు అడిగాడట మోహన్ లాల్… అతిథి పాత్రకు అంత పే చేయాలా..? చిరంజీవి పక్కన అతిథి పాత్ర చేస్తావా అనడిగితే ఉచితంగా చేయడానికి తెలుగులోనే ముఖ్య నటులు దొరుకుతారు, మోహన్‌లాల్ ఇమేజ్‌కు అది చాలా ఎక్కువ, పైగా మొన్న వృషభ అనే డిజాస్టర్‌తో మోహన్‌లాల్ డౌనయిపోయాడు, తనను వదిలేయడమే బెటర్ అని చిరంజీవి సినిమా క్రియేటివ్ టీమ్ ఫిక్సయిపోయిందట…
మరెవరు చేస్తారు అతిథి పాత్ర..? ఫిలిమ్ నగర్ ప్రచారాలను బట్టి రవితేజ పేరు వినిపిస్తోంది… లేదా మంచు విష్ణు… లేకపోతే శరత్ కుమార్, సుమన్… అసలు ఈసారి వెంకటేష్ బదులు ఏకంగా నాగార్జునను ఒప్పిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది… ఎలాగూ చిరంజీవి, నాగార్జున నడుమ సత్సంబంధాలే ఉన్నాయి…
మరి హీరోయిన్..? ఈ టీమ్ నిజంగానే ఐశ్వర్య రాయ్‌ను సంప్రదించినట్టున్నారు… కానీ ఫైనల్ కాలేదు… ఆమె సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది… ప్రధానంగా పాన్ ఇండియా సినిమాలు ఆమె ప్రయారిటీ అట… పైగా ఆమె రెమ్యునరేషన్ చాలా ఎక్కువ… సో, అది వర్కవుట్ కాకపోవచ్చుననీ, మళ్లీ నయనతారే బెటర్ అని మరో చర్చ… ఎందుకంటే..?
ఆల్రెడీ మూడు సినిమాలు చేసింది ఆమె చిరంజీవితో… సైరా, గాడ్‌ఫాదర్, ఇప్పటి శివశంకర వరప్రసాద్… వెటరన్ హీరోలతో కొత్త హీరోయిన్లు చేయడానికి ఇష్టపడరు… కాజల్, త్రిష వంటి హీరోయిన్లు తప్ప… వాళ్ల బదులు నయనతారే బెటర్ అనే చర్చ కూడా ఇండస్ట్రీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి… లక్కీ మస్కట్…
ఈ సినిమా కథ ప్రధానంగా కలకత్తాకు చెందిన ఓ మాస్ గ్యాంగ్‌స్టర్ కథ అట… 1980, 90ల బాపతు కథ, సో నాటి చిరంజీవి ముఠామేస్త్రీ లుక్కు ఆలోచిస్తున్నదట క్రియేటివ్ టీమ్… ఇప్పటి ట్రెండంతా స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లే కదా… పక్కా లోకల్ మాస్ సినిమా…!!
Share this Article