Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథానాయిక మొల్ల అంతిమరోజులపై సినిమాలో కొంత క్రియేటివ్ లిబర్టీ…

March 29, 2024 by M S R

Subramanyam Dogiparthi…..  వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి . కవయిత్రి మొల్లమాంబలో కధానాయిక మొల్లను తెలుగు వారికి తెలిపిన సినిమా . పద్మనాభం స్వీయదర్శకత్వంలో 1970 లో వచ్చిన చాలా మంచి సినిమా . కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . వాణిశ్రీ తనకొచ్చిన మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది . సామాజిక రుగ్మతల మీద తిరగబడే యువతిగా , ఆత్మాభిమానం కల వ్యక్తిగా , కవయిత్రి అయ్యాక అద్భుతమైన ఉదాత్త వ్యక్తిగా గొప్పగా నటించింది .

బద్వేలు వద్ద ఉన్న గోపవరం గ్రామంలో జన్మించిన మొల్ల శ్రీకృష్ణదేవరాయలు , తెనాలి రామలింగడు సమకాలీనురాలుగా చెపుతారు . తెలుగు సినిమా జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసిన మొల్ల జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీయబడింది .

ఈ సినిమాలో వాణిశ్రీ తర్వాత మెచ్చుకోవలసింది దేవదాసి పాత్రలో గీతాంజలి . నటన , నృత్యం అన్నీ చాలా గొప్పగా ఉంటాయి . రామలింగడుగా పద్మనాభం , దేవుడిగా హరనాథ్ , శ్రీకృష్ణదేవరాయలుగా సత్యనారాయణ , మొల్ల తండ్రిగా గుమ్మడి చక్కగా నటించారు . విలన్ & కోగా నాగభూషణం , అల్లు రామలింగయ్య , మిక్కిలినేని , విలన్ నాగభూషణం భార్యగా హేమలత , రాజబాబు బాగా నటించారు .

Ads

యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో పాటలు ఈనాటికీ పాపులరే . జగమే రామమయం మనసే అగణిత తారక నామ మయం , మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా పాటలు బాగా హిట్టయ్యాయి . మరో గొప్ప పాట , నృత్యం రాయల వారి సభలో జ్యోతిలక్ష్మి నృత్యం . అయిదు భాషల్లో పాట , ఆయా ప్రాంతాల నృత్య దుస్తుల్లో జ్యోతిలక్ష్మి నృత్యం తప్పక చూడవలసిన నృత్యం . అలాగే గీతాంజలి నృత్యం తనువూ నీదే మనసూ నీదే కూడా చాలా గొప్పగా ఉంటుంది .‌వాణిశ్రీ అమ్మనురా పెద్దమ్మనురా అంటూ జంతుబలిని నిరసిస్తూ పాడే పాట , దొరవో ఎవరివో నా కొరకే దిగిన దేవరవో పాట బాగుంటాయి .

1970 సంవత్సరరానికి బంగారు నంది అవార్డును పొందింది . వాణిశ్రీ ప్రస్థానంలో ఆమెకు పేరు తెచ్చిన సినిమాలలో ఒకటి ఈ చారిత్రక , ఆధ్యాత్మిక సినిమా . గోదా కల్యాణం , విష్ణువు నవ అవతారాల చిత్రరీకరణ , ప్రస్తావన , తదితర పద్యాలు తప్పక చూడవలసినవి . యూట్యూబులో ఉంది . తప్పక చూడండి . నేను మా నరసరావుపేటలోనే చూసా . టి విలో కూడా చూసా .

ఈ సినిమాలో మొల్ల శ్రీరాముడిలో ఐక్యం ఆయినట్లు చూపారు . ఆమె జీవిత చరిత్రలో శ్రీశైలంలో చివరి రోజులు గడిపిందని చెప్పబడింది . ఇవన్నీ ఎలా ఉన్నా రంగనాధ , భాస్కర రామాయణాల తర్వాత మొల్ల రామాయణం తెలుగు వారి సాహిత్య సంపద . మన సాహిత్య , ఆధ్యాత్మిక , సామాజిక సంపద గురించి , వారసత్వం గురించి తెలుసుకోవటానికి ఈ తరం వారు తప్పక చూడాలి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #telugumovies #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలుగు పుట్టుకే – తెలుగుకన్నా ఇతర దక్షిణ భాషలే గౌరవించాయి!!
  • అఖిల్ బాబూ, నీ లెనిన్ సీన్ పాత బాల‘కృష్ణబాబు సీన్‌కు కాపీ అట..?!
  • తప్పకుండా రైల్వే ఫిజికల్ టికెట్ వెంట ఉండాల్సిందేనా? ఏది నిజం?!
  • అప్పట్లో ఒక అల్లు అరవింద్ – ఒక జగన్ – ఇప్పుడు ఒక కేటీయార్
  • హీరో రాజేంద్రప్రసాద్‌కు దీటైన ఓ హస్తి నటన – కాసింత ఎక్కువే !!
  • Space Couple – ఈ వ్యోమగాముల జంట కథ స్పూర్తిదాయకం!
  • అక్రమార్కిణి..! మమత పార్టీ నిధుల వెనుక నానా బాగోతాలు..!
  • ఒకే పాట- నాలుగు గొంతులు … జానకమ్మ వాయిస్ మ్యాజిక్ ఈ సాంగ్
  • క్రాంతి గౌడ్ – ఆదివాసీ పల్లె నుంచి- లార్డ్స్ హానర్స్ బోర్డు దాకా!
  • అమృత గాయని – అమర గాయని… ఎక్స్‌ప్రెషన్ మాస్టర్ జానకమ్మ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions