మోనాల్ ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించాక… అందరూ ఆమెను హగ్ చేసుకుంటూ, సానుభూతి చూపిస్తుంటే, ఆమె హారికతో ఓ మాట అన్నది… ‘‘నేను నీకు చప్పాను కాదా’ అని… ఎస్, ఆమెకు మొత్తం ముందే తెలుసు… ఎలిమినేషన్ కోసం తను వెల్ ప్రిపేర్డ్… అందుకే ఎలిమినేషన్ ప్రకటించాక పెద్దగా షాక్, ఎమోషన్ గట్రా ఏమీ ఆమె మొహంలో కనిపించలేదు… కనిపించవు… ఎందుకంటే… తనతో బిగ్‌బాస్ టీం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇక్కడిదాకా లాక్కొచ్చారు ఆమెను… ఆమె పాత్ర ముగిసింది… నిష్క్రమించింది…
నిజానికి ఆమె మెంటాలిటీకి ఎలిమినేషన్ ప్రకటించగానే శోకాలు పెట్టాలి… షాక్ తినాలి… చిన్న చిన్న విషయాలకే పాతాళగంగను వర్షించే ఆమె కళ్లు… ఇప్పుడు నవ్వుతూ హౌస్‌కు వీడ్కోలు చెప్పాయి… జస్ట్, ఒక అగ్రిమెంట్ పూర్తయిపోయింది.., షూటింగ్ అయిపోయింది, ఇక వెళ్తున్నాను అన్నట్టుగా వెళ్లిపోయింది… ఎస్, ఆమె ప్రొఫెషనల్… నటి… ఏ సినిమాలో ఎంతమేరకు నటించాలో అంతవరకే… బిగ్‌బాస్ కూడా ఆమెకు ఓ సినిమా… అంతే…
మొన్న రాత్రి ఎవరూ లేనప్పుడు, బయట తనొక్కతే ఒంటరిగా కూర్చుని, బిగ్‌బాస్‌కు థాంక్స్ కూడా చెప్పుకుంది… అప్పుడే అనిపించింది ఈమె వీడ్కోలుకు సమయం వచ్చేసింది అని… అయితే విశేషం ఏమిటంటే..? ఆమె నిష్క్రమణకు నెటిజనం బాగా హర్షించడం… అప్పట్లో అమ్మా రాజశేఖర్… ఇప్పుడు మోనాల్… ఇద్దరూ బయటికి వెళ్లిపోతూ ఆనందాన్ని నింపారు… పంచారు…
Ads
కాకపోతే ఆమె ప్రేమ నటనకు బకరా అయ్యింది మాత్రం అఖిల్, కొన్నాళ్లు అభిజిత్ కూడా… ఈరోజు కూడా అఖిల్ తెగ ఫీలయిపోయాడు… ‘మాట్లాడే పని ఉంది, బయటికొచ్చాక మాట్లాడుకుందాం’ అన్నాడు… స్కంధాంషి వాళ్ల మోడల్ ఇల్లు కొనగలిగితే మోనాల్ కూడా అందులో ఉండాలట… ఫాఫం, స్టిల్ ఇంకా ఆమె నటనను నిజమే అనుకుంటున్నాడా ఏమిటి..? అసలు నెటిజనం విపరీతంగా కామెంట్ చేస్తున్న ఓ మాట ఏమిటంటే..? ‘ప్చ్, బిగ్‌బాస్, అఖిల్‌ను కూడా పంపించేస్తే ఓ పనైపోయేది కదా…’ అని…
మొత్తానికి మోనాల్‌ను ఇప్పుడు బయటికి పంపించేసి, బిగ్‌బాస్ టీం ప్రేక్షకుల కళ్లు తెరిపించింది… మేం వేసే వోట్ల ద్వారానే కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ఉంటుందనే భ్రమల్ని పటాపంచలు చేసింది… వోట్లు గీట్లు జాన్తా నై… ఆ టీం తమ ప్లాన్ ప్రకారమే తీసుకొస్తారు, పంపించేస్తారు… కుదిరిన అగ్రిమెంట్ల మేరకే ఉంటుంది గేమ్… ఇదొక డ్రామా… ఇదొక షో… జనాన్ని తమ గేమ్ ప్లాన్ మేరకే ఎంటర్టెయిన్ చేస్తారు…
ఎస్, ఇప్పుడు కూడా అంతే… ప్రేక్షకులు వేసే వోట్లను బట్టి విజేతను ఖరారు చేస్తారనే భ్రమలు ఏమీ వద్దు… వాళ్లు ముందుగా ఏది ఫిక్సయ్యారో ఆమేరకే విజేత ఉంటాడు… లేదా ఉంటుంది… మోనాల్‌ను సేవ్ చేయడం కోసం బోలెడు మంది కంటెస్టెంట్లు బయటికి వెళ్లిపోయారు కదా… వాళ్లందరి సాక్షిగా ఆ క్లారిటీ అందరికీ అవసరం… నిజం ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది కదా బిగ్ బాస్…?!
Share this Article