Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పూసల ప్రేమ – రెండు రాష్ట్రాల నడుమ న్యాయపోరాటం ఐపోయింది…

June 5, 2026 by M S R

.

మోనాలిసా… కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ వైరల్ అయిపోయి, సోషల్ సెలబ్రిటీ అయిపోయి, కేరళకు చెందిన ఓ ముస్లిం యువకుడిని పెళ్లిచేసుకున్న ఈ పిల్ల తెలుసు కదా… ఇప్పుడు ఈ పిల్ల కథ రెండు రాష్ట్రాల చట్టాలు, న్యాయాలు, దృక్పథాల నడుమ పోరాటంగా మారింది… నిజం, ఇదొక ఆసక్తికరమైన కేసు… అబ్బే, లవ్ జిహాద్ కోణం కాదు… మైనర్, మేజర్, పోక్సో..!

 కేవలం ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయంగా మిగలకుండా, రెండు వేర్వేరు రాష్ట్రాల చట్టపరమైన, సామాజిక దృక్పథాల మధ్య ఘర్షణగా మారుతోంది… ఒకవైపు మధ్యప్రదేశ్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలనే పట్టుదలతో ఉంటే, మరోవైపు కేరళ హైకోర్టు మానవతా కోణం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది… పైగా మీరు కేరళలో ఉండటం మీ అదృష్టం అని కోర్టు వ్యాఖ్యానించడం ఇందులో ఇంట్రస్టింగ్ పాయింట్… వివరాల్లోకి వెళ్దాం…

Ads



మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన, ‘కుంభమేళా మోనాలిసా’గా పిలవబడే యువతి, కేరళకు చెందిన మహమ్మద్ ఫర్మాన్ ఖాన్‌ల వివాహం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద చట్టపరమైన పోరాటానికి దారితీసింది. ఒక రాష్ట్రం దీన్ని “అపహరణ, ఫోర్జరీ” కేసుగా చూస్తుంటే, మరో రాష్ట్ర న్యాయస్థానం మాత్రం ఆ జంటకు రక్షణ కవచంగా నిలుస్తోంది.

మధ్యప్రదేశ్ వైఖరి: కఠిన చట్టాలు – మైనర్ వాదన

మధ్యప్రదేశ్ పోలీసులు మరియు ప్రభుత్వ యంత్రాంగం ఈ ఉదంతాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

  • మైనర్ వివాహం..: యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె ఇంకా మైనర్ అని, ఆమెను అపహరించుకు వెళ్లారని మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు…

  • పత్రాల ఫోర్జరీ ఆరోపణ..: కోర్టుకు సమర్పించిన బర్త్ సర్టిఫికెట్ ఫోర్జరీ చేయబడిందని, దర్యాప్తు సంస్థల ప్రకారం ఆమె వయసు పెళ్లికి సరిపోలేదని భారత అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు వాదించారు…

  • వివాహ చెల్లుబాటుపై ప్రశ్నలు..: హిందూ-ఇస్లాం మతాలకు చెందిన వీరి వివాహం కేరళలోని ఒక ఆలయంలో జరిగిందని, భిన్న మతాల వివాహం ఆలయంలో చెల్లదని, కాబట్టి స్థానిక రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా చెల్లదన్నది మధ్యప్రదేశ్ తరపు న్యాయవాదుల గట్టి వాదన…

కేరళ వైఖరి: రక్షణ – వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత

మరోవైపు, కేరళ హైకోర్టు ఈ కేసును పూర్తిగా భిన్నమైన కోణంలో చూసింది… నిబంధనల కంటే కూడా అందుబాటులో ఉన్న ఆధారాలు, వ్యక్తుల ప్రాణ రక్షణకు ప్రాధాన్యతనిచ్చింది…

  • డాక్యుమెంట్ల ఆధారంగా మేజర్..: ఓటరు కార్డు, బ్యాంకు పాస్బుక్, బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా యువతి పుట్టినతేదీ 2008 జనవరి 1 అని, కాబట్టి ఆమెను మేజర్‌గానే పరిగణించవచ్చని కేరళ కోర్టు స్పష్టం చేసింది…

  • ట్రాన్సిట్ బెయిల్ మంజూరు…: మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయకుండా ఫర్మాన్‌కు నెల రోజుల పాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేస్తూ, ఆ లోపు మధ్యప్రదేశ్ కోర్టులోనే ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని సూచించింది…

  • ఆరోపణలపై దర్యాప్తు…: ఫోర్జరీ ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సిందేనని చెప్తూనే, అంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది…

“మీరు అదృష్టవంతులు.. కేరళలో ఉన్నారు”

ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు హాల్‌లో జరిగిన సంభాషణ ఈ రెండు రాష్ట్రాల సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది.

న్యాయమూర్తి…: “మీరు అదృష్టవంతులు.. కేరళలో ఉన్నారు….” ఆ జంట బదులిస్తూ: “దానివల్లే మేము ఇంకా జీవించి ఉన్నాం…”

ఈ చిన్న సంభాషణే దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న రాజకీయాలు, భిన్న చట్టపరమైన వాతావరణాలు ఉన్న రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తోంది… మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అంతర్- మత వివాహాలు తీవ్రమైన సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉండగా, కేరళ తమకు రక్షణగా నిలిచిందని ఆ జంట భావిస్తోంది…

ఇదొక చట్టపరమైన సవాలు… ప్రస్తుతానికి కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక నెల ఊరట ఆ జంట ప్రాణాలను కాపాడింది… అయితే, ఈ పోరాటం ఇక్కడితో ముగిసిపోలేదు… మధ్యప్రదేశ్ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి, యువతి వయస్సును నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు… ఒక రాష్ట్రం అరెస్ట్ చేయాలని చూస్తుంటే, మరో రాష్ట్రం రక్షణ కల్పిస్తోంది… క్రమేపీ ఇది రెండు రాష్ట్రాల పోలీసు, న్యాయ వ్యవస్థల నడుమ ఒక ఈగో వార్‌లా లేదా చట్టపరమైన యుద్ధంలా మారుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు… అంతిమంగా మధ్యప్రదేశ్ కోర్టులు ఈ కేసును ఎలా డీల్ చేస్తాయనే దానిపైనే ఈ జంట భవిష్యత్తు ఆధారపడి ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!
  • అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!
  • ఐదు పెళ్లిళ్లు – డజను అఫయిర్స్… కానీ చివరకు ఏమయ్యాడు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions