Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Money Lesson… అవును, డబ్బే ఓ జీవితపాఠం… అదే సకలం నేర్పిస్తుంది…

September 24, 2024 by M S R

డబ్బు గురించి నా చికాగో స్నేహితుడి మాటల్లో…! ‘‘సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులు సహజం. కానీ, నా స్నేహితుడి జీవితంలో ఆ ఒడిదొడుకుల తీవ్రత, సంఖ్య కాస్త ఎక్కువే.

20 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన తరువాత, 42వ ఏట అతని బ్యాంక్ ఖాతాలో కేవలం 6 లక్షల 50 వేల రూపాయలే మిగిలి ఉన్నాయి. అదీ, అమెరికాలో దశాబ్దకాలం పనిచేసి కూడా… 2006లోనే అతని వద్ద 3 కోట్ల రూపాయల విలువైన ఆడీ కార్ ఉండేది. అయితే, కాలం కాటు వేసింది. జీవితమంతా ఎప్పుడూ ఒకేరకంగా ఉండదు కదా? ఒకవేళ అలానే ఉంటే దాన్ని జీవితమని ఎందుకు అంటారు? “బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి” — ఇది సహజం. కారణాలు ఎవైనా, ఎవరు అయినా అతను తనకున్నదంతా కోల్పోయాడు. డబ్బే కాదు, మిగిలిన అన్ని ఆస్తులు, విలువలు – ఏది మిగలలేదు.

అది 2021 సంవత్సరం జనవరి నెల, చికాగో, అమెరికా. అతని భార్యకు స్టార్ బక్స్ లో కాస్ట్లీ కాఫీ తాగటం అలవాటు. కానీ, ఆమె చేతిలో ఒక్క డాలర్ కూడా లేదు. అయినా, ఆమె స్టార్ బక్స్ కి వెళ్లి, కాఫీ షాప్ లో కాసేపు కూర్చుని, కాఫీ వాసన పీల్చుకొని ఇంటికి వస్తుంది. భర్తతో చిరునవ్వుతో చెప్తుంది, “ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. కాఫీ తాగలేకపోయినా, అక్కడ కూర్చొని వాసన పీల్చుకొని వచ్చా.” అని

Ads

అది విన్న భర్త మౌనంగా తనకి తెలీయకుండా వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటాడు ఆమెకు కనిపించకుండా. భర్త కన్నీళ్ళు గమనించిన భార్యకి కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే “కంటిలో నలక పడింది” అని చెప్తుంది. జీవితంలో కొన్నిసార్లు మనకి కారణాలు తెలిసినా తెలియనట్లు ఉండాలి, మరికొన్నిసార్లు తెలియకపోయినా తెలిసినట్లు ఉండాలి. ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో ఇద్దరికీ తెలుసు.

ఆ క్షణం వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. చేతిలో ఉన్న 6 లక్షల రూపాయలను బ్యాంక్ లో ఉంచి, నెలకు 50 వేల రూపాయలతో, అంటే నెలకు సుమారు 800 డాలర్లతో ఒక రెండు సంవత్సరాలు జీవితం సాగిద్దాం అని నిర్ణయించుకున్నారు. మిగతా 50 వేలతో ఒక సైకిల్ కొనుగోలు చేశారు.

వాళ్లిద్దరికీ ఎలాంటి చెడు అలవాట్లు లేవు, కానీ వారు పెరిగిన పరిస్థితులతో పోలిస్తే, అమెరికాలో నెలకు 800 డాలర్లతో జీవించడం నిజంగా చాలా కష్టమైన పని. అమెరికాలో అడుక్కుతినేవారికి కూడా 800 డాలర్లు సరిపోవు. అయినప్పటికీ, వారు దృఢమైన ప్రణాళికను రూపొందించారు, ఒకరికొకరు నిలబడి, పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.

భార్య ఉద్యోగం ఏమీ చేయదు, భర్తకి నెలకు 10 లక్షల జీతం వస్తుంది. దాని నుంచి 4 లక్షలు ట్యాక్స్‌కు వెళ్లినా, మిగతా 6 లక్షలు చేతిలో ఉంటుంది. ఆ 6 లక్షలని నేను చెప్పిన మ్యూట్యువల్ ఫండ్స్‌లో పెట్టారు. ఈ విధంగా, సాలీనా వచ్చే మొత్తం అంతా ఇన్వెస్ట్ చేస్తూ, నెలకు 6 లక్షలు చొప్పున సంవత్సరానికి 72 లక్షలు పెట్టారు.

ఒక సంవత్సరం పూర్తయినప్పుడు, ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఒక కోటి రూపాయలు అయ్యింది. ఆ తర్వాత, అదే విధంగా భర్త పేరు మీద మరోసారి నెలకు 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తూ, రెండో సంవత్సరం పూర్తయ్యాక అతని పేరు మీద మరో కోటి రూపాయలు సేవ్ అయింది.

ఆ రెండు కోట్లను మ్యూట్యువల్ ఫండ్‌లలోనే ఇన్వెస్ట్ చేసి, నెలకు 50 వేల రూపాయలు భార్యకు సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP) ద్వారా వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ ప్లాన్ ద్వారా, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టిన ఆ 2 కోట్లు ఆయా ఫండ్స్ పనితీరును బట్టి పెరుగుతూనే ఉంటాయి, మరోవైపు ఆమెకు నెలకు 50 వేలు పాకెట్ మనీగా నిరంతరం అందుతాయి.

ఆ తర్వాత ఆరు నెలలు అమెరికాలో పని చేసి, అమెరికా తనకు సరిపోదన్న ఆలోచనతో, భార్యతో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఒక సొంత ఇల్లు, కారు కొనుగోలు చేసి, ప్రస్తుతం హైదరాబాద్ మైండ్‌స్పేస్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబం, స్నేహితులు, బంధువులతో ఉన్నాడు.

“అమెరికాలోనే ఉండకపోయావా? హైదరాబాద్ ఎందుకు?” అని నేను అడిగితే, “డబ్బు మరియూ పరిస్థితులను మనం శాసించాలి, కానీ అవి ఎప్పుడూ మనల్ని శాసించకూడదు” అన్నాడు. నిజానికి నాకు పూర్తిగా అర్ధం కాలేదు కానీ అర్ధం అయినట్లు నటించాను.

వాళ్లకు ఒక పాప ఉంది, ఆమె పేరు మీద ఎప్పుడో 2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఒక సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశారు. పాప పేరు మీద ఉన్న ఆ మొత్తాన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు, అది క్రమంగా పెరుగుతూ ఉంది. అదనంగా, ఆమె విద్య కోసం అవసరమయ్యే ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసి, మంత్లీ పాపకి స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా వ్యవస్థను రూపొందించారు. ఈ ప్రణాళిక ఆమె భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను కల్పిస్తూ, అవసరమైనప్పుడు ప్రాప్తతను సులభతరం చేస్తోంది.

మనందరం పని చేసే కారణం డబ్బు కోసమే, ఎందుకంటే డబ్బు జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, డబ్బే జీవితం కాదని గుర్తించాలి. జీవితంలో ఒడిదొడుకులు, హెచ్చుతగ్గులు సహజం. అయితే, అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే, డబ్బు సమస్య మాత్రం మరో ఎత్తు. డబ్బు చేతిలో లేకపోతే ఎలా ఉంటుందో, మిగతావాళ్ళు ఎలా చూస్తారో, ఆ సమయం లో మనకి మనం ఎలా ఆలోచిస్తామో నాకు బాగా తెలుసు.

మన దగ్గర డబ్బు లేకపోతే, సహాయం అందించేవారు చాలా అరుదు. తోడపుట్టిన వారు, బంధువులు, స్నేహితులు కూడా ఆ సమయంలో ముందుకొచ్చి సహాయం చేయరని, చేయాల్సిన అవసరం కూడా లేదని అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో, మనకి మనమే సహాయం చేసుకోవడం అత్యవసరం. నిజమైన సాయం మన చేతుల్లో, మన ఆలోచనల్లో ఉంటుంది.

“నీవు ఏదైనా విషయంపై ఆలోచించాలంటే, అది డబ్బు గురించే ఉండాలి, ముఖ్యంగా డబ్బు సంపాదన గురించి అయి ఉండాలి” అని చెబుతారు ప్రపంచంలో అతి పెద్ద రీటైల్ స్టోర్ అయిన వాల్‌మార్ట్ ను స్థాపించిన శ్యామ్ రాబ్సన్ వాల్టన్ గారు. నిజం గా ఇది డబ్బు ప్రాముఖ్యతను తేల్చి చెప్పే మాట. వాల్టన్ గారి మాటలు వ్యక్తిగత జీవితంలో ఆర్థిక దృష్టి ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి. జీవిత సాఫల్యం సాధించాలంటే డబ్బు సంపాదన, పొదుపు, మరియు దానిని సక్రమంగా ఉపయోగించడం ముఖ్యం అని అందరికీ తెలిసిందే.

నా స్నేహితుడి జీవితాన్ని చూసి నేర్చుకున్న పాఠం ఏమిటంటే, డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కాదు; డబ్బు అంటే ఒక క్రమశిక్షణ, డబ్బు అంటే ఒక వ్యక్తిత్వం, డబ్బు అంటే మన అభిరుచులు, డబ్బు అంటే మన ఆలోచనా విధానాలు, మరియు డబ్బు అంటే మన ప్రవర్తన. అందుకే జీవితం లో ఏమి ఉన్నా లేకపోయినా ఆర్ధిక క్రమశిక్షణ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటాడు ఒక రోమన్ తత్వవేత్త…. – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం   (జగన్నాథ్ గౌడ్) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…
  • ఐపోలేదు… అసలు కథ ముందుంది… అబ్బే, వేణుస్వామి జోస్యం కాదు…
  • వాళ్లు ఆశించిన డాన్స్ చేసినన్ని రోజులే ఆదరణ… తరువాత..?!
  • ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…
  • చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!
  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సిపీలీహై’… మందు కొట్టించేశాడు…
  • బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట…
  • సంపద, సర్కిల్, పేరు, చదువు… ఆ ఒక్క దుర్బల క్షణంలో పనిచేయవు..!!
  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions