Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగానే బాలు లేదా దాసరి ఈ సినిమా చేసి ఉంటే…. నా సామిరంగా..!!

July 3, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. సినిమా కష్టాలన్నీ పడి రిలీజయిన ఈ మనీ సినిమా ఓ చరిత్ర సృష్టించింది . సినిమా తీయటం పూర్తయ్యాక రిలీజవటానికి మూడేళ్ళు పట్టిందట . కిందాపైన పడి నిర్మాత రాంగోపాల్ వర్మ తన మిత్రుల సహకారంతో రిలీజ్ చేయించారు . 55 లక్షల రూపాయల బడ్జెట్టుతో తీస్తే మూడు కోట్ల రెవిన్యూ వచ్చిందట .

వినూత్న పాత్రలు . విభిన్నమైన పాటలు . పంచ్ డైలాగులు . ఖాన్ దాదాతో గేమ్స్ ఆడొద్దు , శాల్తీలు లెగిసిపోతాయ్ . ఈ బ్రహ్మానందం డైలాగ్ తెలుగు నాట ఊతపదం అయిపోయింది . బ్రహ్మానందం పాత్ర సినిమా మొత్తాన్ని మింగేసింది . అతని ఏక్షన్ , డైలాగ్ డెలివరీ , expressions హేట్సాఫ్ . అందుకే ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది .

Ads

జయసుధ ఏ పాత్రయినా అలవోకగా చేసేస్తుంది . ప్రౌఢగా చాలా అందంగా కనిపిస్తుంది . ఆమె cunning భర్తగా పరేష్ రావల్ . అదరగొట్టేసాడు . ముందు ఈ పాత్రకు బాలసుబ్రమణ్యం , దాసరి నారాయణరావు అనుకున్నారట . దర్శకుడు శివ నాగేశ్వరరావు ఛాయిస్ మేరకు పరేష్ రావల్ తెర మీదకొచ్చాడు . సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్ చెప్పారు .

నిరుద్యోగ యువకులుగా చిన్నా , జె డి చక్రవర్తి . చాలా బాగా నటించారు . జె డి చక్రవర్తికి మంచి బ్రేక్ వచ్చింది ఈ సినిమాతో . కాసేపే కనిపించినా బొమ్మల చొక్కాతో కోట శ్రీనివాసరావు ఇరగతీసేసాడు . ఇంగ్లీషు , తెలుగు మిక్స్ చేస్తూ ఉత్తేజ్ తో మాట్లాడే డైలాగులు ప్రేక్షకులను బాగా అలరించాయి .

ముఖ్యంగా పెళ్ళి కష్టాల గురించి పాట . భద్రం బి కేర్ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బేచిలరూ ఎంత పాపులర్ అయిందంటే పెళ్ళికి ముందు కాబోయే పెళ్ళికొడుకులు ఇచ్చే bachelors parties లో ఈ పాట తప్పక ఉండాల్సిందే .

మరో ముఖ్య పాత్ర తనికెళ్ల భరణిది . సినిమా వాళ్ళకు తాను చాలా క్లోజ్ అని బిల్డప్ ఇచ్చే పాత్రలో గొప్పగా నటించాడు . వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసూ ; వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసేయి మరో డోసు . Hats off to Sirivennela . ఫ్రెండ్సులో ఒకరినొకరిని గోల చేసుకోవటానికి ఈ పాట పాడేవారు .

సినిమాను చిత్రవిచిత్రంగా మలుపులు తిప్పుతూ ప్రేక్షకుల ఆదరణ పొందారు దర్శకుడు శివ నాగేశ్వరరావు . ఆయన కష్టం ఫలించింది . తాను ఇండిపెండెంటుగా దర్శకత్వం వహిస్తానని రాంగోపాల్ వర్మకు చెప్పినప్పుడు ఆయన చెప్పిన రెండు మూడు కధల్లో Ruthless People అనే ఇంగ్లీషు సినిమా కధ నచ్చిందట . దానికి మన తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్పులు , చేర్పులు , కూర్పులు చేసుకున్నారు శివ నాగేశ్వరరావు .

బిర్రయిన స్క్రీన్ ప్లేతో సినిమాలాగా కాకుండా మన చుట్టూ జరిగే కధలాగా ఆవిష్కరించారు . ఇద్దరు నిరుద్యోగ యువకులు డబ్బు కోసం పక్కనే ఉండే ఓ డబ్బున్న లేడీని కిడ్నాప్ చేయటం , భర్త గారికి ఫోన్ చేస్తే ఆయన ఆనందించటం , భార్యను లేపేందుకు ప్రయత్నించటం , చివరకు కిడ్నాప్ చేసిన ఇద్దరు కుర్రాళ్ళే ఆమెను కాపాడటం , వాళ్ళకు ఆమే ఉద్యోగాలు ఇవ్వటంతో సినిమా శుభాంతం అవుతుంది . టూకీగా ఇదీ కధ .

కీరవాణి రెండు పాటలకు సంగీతాన్ని కంపోజ్ చేయగా మిగిలిన పాటల్ని చక్రవర్తి కుమారుడు శ్రీమూర్తి సంగీతాన్ని కంపోజ్ చేసారు . పాటలన్నీ సిరివెన్నెల వారే వ్రాసారు . ఈ సినిమాలో పాటలకు కూడా ప్రత్యేకత ఉంది . బాలసుబ్రమణ్యం , చిత్ర , మనోలతో పాటు జయసుధ , జె డి చక్రవర్తి , శ్రీమూర్తి కూడా పాడారు .

చక్రవర్తికీ వీధి భిక్షగత్తెకు బంధువైతానని అంది మనీ మనీ , అనగనగనగా అననే లేదింకా అపుడే అదా కధ అంటే ఎట్టాగా సరదా సరదాగా సాగుతాయి . చిన్నా , జెడిల మీద పేరడీ పాట కూడా సరదాగా ఉంటుంది . చిన్నా , అతని లవర్ రేణుకా సహానీ , జెడిల మీద లేచిందే లేడికి పరుగు కూర్చుంటే ఏమిటి జరుగు ప్రత్యేకంగా ఉంటుంది .

రేణుకా సహానీ ఓ డీడీ టీవీషోతో, అందమైన నవ్వుతో చాలా ఫేమస్ అప్పట్లో… బాలీవుడ్ సినిమాలు చేసింది, కానీ తెలుగులో కేవలం ఈ మనీ, తరువాత దీని సీక్వెల్ మనీమనీ మాత్రమే  చేసింది, శివనాగేశ్వరరావు కోసమే…

తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా ఎనిమిదేళ్ళ తర్వాత హిందీలో లవ్ కే లియే కుఛ్ భీ కరేగా టైటిలుతో రీమేక్ అయింది . సైఫ్ ఆలీ ఖాన్ , పర్దీన్ ఖాన్ , అఫ్తాబ్ , సొనాలి భింద్రే , ట్వింకిల్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు . మన తెలుగు సినిమాకు రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి . 1995 లో మనీ మనీ , 2011 లో మనీ మనీ మోర్ మనీ గా వచ్చాయి .

ఇంత కష్టపడ్డ దర్శకుడు శివ నాగేశ్వరరావు గారికి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు , ద్వితీయ ఉత్తమ చిత్రంగా మరో నంది అవార్డు వచ్చాయి . ఇతర ప్రధాన పాత్రల్లో నర్సింగ్ యాదవ్ , శరత్ సక్సేనా , ఓ వి కృష్ణారావు తదితరులు నటించారు . 1993 జూలైలో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ముక్కలు ముక్కలుగా ఉంది . చూడవచ్చు . An excellent hilarious entertainer .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజంగానే బాలు లేదా దాసరి ఈ సినిమా చేసి ఉంటే…. నా సామిరంగా..!!
  • అమరావతి రాజధాని పనుల్లో ఏదో భారీ తేడా కొడుతోంది!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • ఒక ఆదిపురుష్ – ఒక అఖండ2 – ఒక నాగబంధం!!
  • బంగారు లోదుస్తులు! – వామ్మో ఇరాక్ ఎంపీ!! విస్తుపోయిన ప్రపంచం!!
  • “ప్రతి పొరపాటు వైఫల్యం కాదు… కొన్నిసార్లు అదే ఒక అవకాశం”
  • నాగబాబూ.., మహానటుడు ఎన్టీఆర్‌‌పై మరీ అంత చౌకబారు స్కిట్..!!
  • సవాళ్లు- డిమాండ్లు- తోపులాటలు… ఎందుకొచ్చిన ప్రచార ప్రయాస!
  • NEET – ప్లస్ టూ మార్కులకు వెయిటేజీ- లేదా 70% వస్తే నీట్ అర్హత?
  • ఎట్టకేలకు జననాయకుడికి మోక్షం! 2, 3 రోజుల్లో CBFC క్లియరెన్స్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions